అన్వేషించండి

సోషల్ మీడియా ట్రెండింగ్‌లో #BoycottJawan - కారణం అదేనా?

షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'జవాన్' మూవీ మరికొద్ది గంటల్లో విడుదలవుతున్న తరుణంలో సోషల్ మీడియాలో #BoycottJawan అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీ మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కి భారీ షాక్ తగిలింది. 'జవాన్' సినిమాని బాయ్ కాట్(Boycott) చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో? పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన 'జవాన్' గురువారం, సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. ఇండియా తో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో 'జవాన్' మూవీని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. అందుకు కారణం తమిళ హీరో ఉదయనిది స్టాలిన్ అని తెలుస్తోంది. తమిళనాడులో 'జవాన్' సినిమా హక్కులను రెడ్ జాయింట్ మూవీ సంస్థ సొంతం సొంతం చేసుకున్నారు.

అయితే ఈ సంస్థ తమిళనాడు యువజన క్రీడా శాఖ మంత్రి, సినీ హీరో ఉదయనిది స్టాలిన్ కు చెందింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ సంస్థ 'జవాన్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు 'జవాన్' మూవీని బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. సనాతన ధర్మంపై ఉదయనిది స్టాలిన్ తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారని, అందుకే అతనికి నష్టం వచ్చేలా 'జవాన్' సినిమాను బాయ్ కాట్(Boycott) చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో #బాయ్ కాట్ జవాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

ఇటీవల ఓ సభలో ఉదయనిధి స్టాలిన్ 'దోమలు, డెంగ్యూ, మలేరియా, కరోనా లాగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు 'జవాన్' మూవీపై కూడా పడడంతో సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. ఆ మధ్య బాలీవుడ్ లో ఈ బాయ్ కాట్ ట్రెండ్ బాగా వినిపించింది. ఈమధ్య అది కాస్త తగ్గిందని అనుకునే లోపు ఇప్పుడు జవాన్ తో మరోసారి తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక మరోవైపు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఈ ట్రెండుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాలిటిక్స్ తో సినిమాలను ముడి పెట్టవద్దని చెబుతున్నారు. అంతేకాదు చాలామంది బుక్ చేసుకున్న టికెట్ల స్క్రీన్ షాట్లను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎవరు ఏం చేసినా 'జవాన్' మూవీ పక్క బ్లాక్ బాస్టర్ అని రాసుకొస్తున్నారు. మరి మూవీ టీం ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Also Read : 'జవాన్'పై మహేష్ బాబు ట్వీట్స్ - షారుఖ్ మూవీస్ అంటే అంత ఇష్టమా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget