Bigg Boss Vasanthi Home Tour: బిగ్‌బాస్ వాసంతి అత్తింటి హోంటూర్ - ఈ కొత్తకోడలి సందడి చూశారా?
Bigg Boss Vasantha Krishnan: బిగ్‌బాస్ వాసంతి అత్తింటి హోంటూర్ చేసింది. కొత్త కోడలుగా ఆమె అత్తింట్లో సందడి, హడావుడి మామూలుగా లేదు.
Tv Actress, Bigg Boss Vasanthi Krishnan Home Tour Video: టీవీ నటి, బిగ్‌బాస్ ఫేం వాసంతి కృష్ణన్ (Bigg Boss Vasanthi Krishnan) ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత నెల ఫిబ్రవరి తన ప్రియుడి, నటుడు పవన్ కళ్యాణ్‌తో ఏడడుగులు వేసింది. వాసంతి సొంతూరైన తిరుపతిలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక పెళ్లయి అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె తన అత్తంటి హోంటూర్ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. పెళ్లి అనంతరం అత్తింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమె చేసిన సందడి, మొదటి పూజ ఇలా విశేషాలను అన్నింటిన పంచుకుంది (Vasanthi Home Tour). అంతేకాదు కొత్త కోడలిగా మొదటిసారి అత్తింట్లో చేసిన పాకం చూపించింది.
ఇంట్లో అడుగుపెట్టాక కొత్త కోడలిగా ఆమెకు ఇచ్చిన స్వాగతంతో ఇలా అన్నింటిని వివరిస్తూ అత్తింటి హోంటూర్ చేసి చూపించింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా పవన్ కళ్యాణ్‌తో (Vasanthi Husband Pawan Kalyan) వాసంతి కొంతకాలంగా ప్రేమలో మునిగితేలింది. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిశ్చికున్న ఈ లవ్‌బర్ట్స్ ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పొందారు. దీంతో గతేడాది డిసెంబర్ నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 21న తిరుపతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.కాగా వాసంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్‌తో బుల్లితెరపై అలరించిన ఆమె బిగాబాస్‌తో ఆడియన్స్‌కి మరింత దగ్గరైంది.
బిగ్‌బాస్ హౌజ్‌లో గ్లామరస్ బ్యూటీగా హోస్ట్ నాగార్జున చేత బిరుదు అందుకుంది. ఈ దెబ్బతో ఆమె ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది హౌజ్‌గా మారింది. మొదట్లో టాస్క్‌ల్లో కాస్తా వెనకబడ్డ ఆమె మెల్లిమెల్లిగా పుంజుకుంది గట్టి పోటింది. టాస్క్ ఏదైన శివంగిలో చెలరేగిపోయి ఆడింది. అలా హౌజ్‌లో తనదైన ఆట తీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ హౌజ్‌లో ఎక్కువకాలం కొనసాగింది. హౌజ్‌లో కళ్యాణ్ కృష్ణతో కాస్తా సన్నిహిత్యంగా మెదిలిన ఆమె బయటకు కూడా కాస్తా క్లోజ్‌గా మూవ్ అయ్యింది. బయటకు వచ్చాక వీరిద్దరు జంటగా స్టార్ మా డ్యాన్స్ షోలోనూ అలరించారు. ఈ షోలో తన మ్యాజికల్ స్టేప్స్, గ్రేస్ డ్యాన్స్ హోస్ట్‌ని మెస్మరైజ్ చేసింది.
Also Read: ‘హనుమాన్’ కాన్సెప్ట్తో హాలీవుడ్ మూవీ.. 'మంకీ మ్యాన్' ట్రైలర్-2 చూశారా?
సీరియల్స్, బిగ్‌బాస్ షో, ఆ తర్వాత డ్యాన్స్ షోతో సందడి చేసిన ఆమె ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. రియాలిటీ షో తర్వాత ఇక వరుస ఆఫర్స్‌తో నటిగా ఫుల్ బిజీ అవుతుందనుకుంటే.. పెళ్లీ పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. సడెన్‌గా నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి అందరిని సర్‌ప్రైజ్ చేసింది. పెళ్లికి ముందే కాబోయే భర్తతో సుమన్ టీవీకి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ షోలో వారి సరసరాలు చూసి అంత చూడముచ్చటి జంట అంటూ పొగిడేశారు. అయితే పెళ్లి కాకుండా ఇలా బహిరంగంగా ముద్దులాడుతూ పిచ్చి వేశాలు వేయడమేంటని విమర్శకులు ఈ జంటపై పెదవి విరిచారు.