అన్వేషించండి

Bigg Boss Telugu 7 : 'కర్మ ఈజ్ బ్యాక్' - సందీప్ మాస్టర్ కామెంట్స్‌పై టేస్టీ తేజ రియాక్షన్ ఇదే!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టేస్టీ తేజ సందీప్ మాస్టర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బిగ్ బాస్ సీజన్ 7లో గతవారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. తేజ కంటే ముందు సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ సమయంలో తేజా వల్లే సందీప్ ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. హౌస్‌లో ఉన్నప్పుడు సందీప్ మాస్టర్, తేజ ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సందీప్ ఎలిమినేట్ అయ్యాడో అక్కడే అసలు గొడవలు మొదలయ్యాయి. 8 వారాలు నామినేషన్స్‌‌లో లేకుండా వచ్చిన సందీప్ కేవలం తేజ నామినేషన్ కారణంగానే ఎలిమినేట్ అయ్యాడు. దాంతో సందీప్ మాస్టర్ చాలా బాధపడ్డాడు.

అంతేకాదు తేజ ఎలిమినేట్ అవుతున్నాడనే ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ.. అందరిని ఎలిమినేట్ చేసి చివరికి తను ఎలిమినేట్ అయ్యాడని ట్యాగ్ కూడా ఇచ్చుకున్నాడు. అంతేకాకుండా 'కర్మ ఈజ్ బ్యాక్' అంటూ ఇన్స్ స్టా స్టోరీ కూడా పెట్టాడు. తాజాగా ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టెస్ట్ తేజని యాంకర్ కొన్ని ప్రశ్నలు అడగగా అందుకు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"మీరు చూసిన ఒక గంట ఎపిసోడ్లో ఏం చూసారో నాకు తెలియదు. దానికంటే ముందు జరిగింది మీరు చూడలేదు. హౌస్ లో ఏం జరిగింది ఏంటి అనేది మీకు తెలియదు. దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడను. ప్రతి ఇంటర్వ్యూలో నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి సందీప్ మాస్టర్ నేను కలిసి డైరెక్ట్ గా మాట్లాడి ఇద్దరం కలిసి ఈ విషయంపై క్లారిటీగా వీడియో పెడతాం" అని తెలిపాడు.

నువ్వు ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి సందీప్ మాస్టర్ ఇన్స్టా స్టోరీస్ అంతా నీ గురించే ఉంది. అది చూసినప్పుడు ఎలా అనిపించింది? అని అడగ్గా.. "నేను ఇప్పటి వరకు చూడలేదు. మీరు చెబుతుంటేనే వింటున్నా" అని చెప్పాడు. మీరు ఎలిమినేట్ అయినప్పుడు సందీప్ మాస్టర్ కర్మ ఈజ్ బ్యాక్ అని ఒక పోస్ట్ పెట్టారు. దాని గురించి మీరేమంటారని అడిగితే.. "సరదాగా పెట్టుంటారు. అంతకుమించి ఏముండదు. దాంట్లో ఏముంది?" అంటూ టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా "బిగ్ బాస్ అనేది ఒక గేమ్. ఆడియన్స్ డిసైడ్ చేశారు చేశారు. కాబట్టి ఇప్పుడు నీ ముందు కూర్చున్నా. లేదంటే ఇంట్లో ఉండేవాడిని" అని అన్నాడు.

ఇక సందీప్ మాస్టర్ గురించి చెప్పాలంటే మొదటి నుంచి అందరితో మంచిగా ఉన్నాడు. నాతో కూడా చాలా బాగున్నాడు. నాకు స్విమ్మింగ్ రాకపోతే నేర్పించాడు. డాన్సుల్లో మూమెంట్లు చెప్తాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు నేను మాస్టర్ మంచి వైబ్ తో ఉన్నాం" అని అన్నాడు. ఆయన అంత మంచి చేసిన నువ్వు ఒక్క నామినేషన్ తోటి బయటికి తీసుకొచ్చావుగా? అని యాంకర్ ప్రశ్నించగా.. "అలా అంటే నేను శివాజీ గారి మీద పడి ఏడవాలి" అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో టేస్టీ తేజ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా టేస్టీ తేజ ఇంటర్వ్యూ చూసిన కొంతమంది నెటిజెన్స్ సందీప్ నామినేషన్ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో తేజ హౌస్ లో అబద్ధం చెప్పాడని, అందుకే దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : బ్లడ్ బాత్‌కి బ్రాండ్ నేమ్ - బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ షురూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget