News
News
వీడియోలు ఆటలు
X

Bhumika Chawla : ఆ సినిమాల నుంచి నన్ను తీసేసి వేరే హీరోయిన్లను పెట్టుకోవడం బాధేసింది: భూమిక చావ్లా

'తేరే నామ్‌' చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్ భూమిక చావ్లా.. తాను గతంలో కొన్ని సినిమాలకు సైన్ చేశానని, కానీ కారణం లేకుండా తన స్థానంలో వేరే హీరోయిన్ ను పెట్టారని వ్యాఖ్యానించారు

FOLLOW US: 
Share:

Bhumika Chawla : దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో జత కట్టిన భూమిక చావ్లా ఇటీవల విడుదలైన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' లో నటించారు. వీరిద్దరూ చివరిగా దివంగత సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ ట్రాజెడీ చిత్రం 'తేరే నామ్‌'లో కనిపించారు. 2007లో ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'జబ్ వి మెట్', రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన 'మున్నాభాయ్ MBBS' సినిమాల్లో భూమిక నటించాల్సి ఉండేదట. కానీ ఆమె స్థానంలో కరీనా కపూర్, గ్రేసీ సింగ్‌లకు ఛాన్స్ ఇచ్చారట. ఈ విషయాన్ని భూమిక స్వయంగా వెల్లడించింది.

 2003 హిట్ 'తేరే నామ్‌' సినిమాతో సల్మాన్ ఖాన్ సరసన నటించి, బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన భూమిక చావ్లా.. ఇటీవల RJ సిద్ధార్థ్ కన్నన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'జబ్ వి మెట్', 'మున్నా భాయ్ MBBS'లకు సంతకం చేశానని, తన స్థానంలో కరీనా కపూర్, గ్రేసీ సింగ్‌లు వచ్చారని భూమిక వెల్లడించింది. "నాకు చాలా ఆఫర్‌లు వచ్చాయి. నేను ఎప్పుడూ సెలెక్టివ్‌గా, నేనేం చేయాలో ఎంపిక చేసుకుంటాను. ఈ సందర్భంగా ఒక పెద్ద చిత్రానికి సంతకం చేశాను. దురదృష్టవశాత్తు చిత్ర నిర్మాణ సంస్థ మారిపోయింది. ఆ తరువాత హీరోను మార్చారు. సినిమా టైటిల్ కూడా మారింది. వీటన్నింటి తర్వాత హీరోయిన్‌ని కూడా చేంజ్ చేశారు. కానీ నేనే ఆ మూవీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ సినిమా కోసం ఒక సంవత్సరం పాటు ఎదురుచూశా. ఆ సమయంలో వేరే సినిమాకి కూడా సంతకం చేయలేదు. ఆ తర్వాత సైన్ చేసిన మరో సినిమా కూడా చేజారింది’’ అని భూమిక వాపోయింది.

ఇంతియాజ్ అలీ2007లో రూపొందించిన 'జబ్ వి మెట్' (కరీనా కపూర్, షాహిద్ కపూర్ జంటగా నటించిన) గురించి భూమిక మాట్లాడుతూ.. "నేను జబ్ వి మెట్‌పై సంతకం చేశాను. ఈ చిత్రానికి మొదట బాబీ డియోల్, నన్ను తీసుకున్నారు. దానికి 'ట్రైన్' అని పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత షాహిద్, నన్ను అనుకున్నారు. ఆ తర్వాత షాహిద్, అయేషా టాకియా, ఆపై షాహిద్, కరీనా కపూర్.. అలా.. మార్చారని, అయినా కూడా ఓకే.. అంటూ భూమిక చెప్పారు. ఆ తర్వాత తాను ఒక్కసారే బాధపడ్డానని, కానీ ఆ తర్వాత ముందుకు సాగిపోయానని, మళ్లీ వాటి గురించి పెద్దగా ఆలోచించలేదని భూమిక వెల్లడించింది.

రాజ్‌కుమార్ హిరానీ తీసిన 'మున్నా భాయ్ MBBS' కి కూడా సంతకం చేశానని, అయితే చివరకు గ్రేసీ సింగ్‌ని ఈ చిత్రంలో పెట్టారని భూమిక తెలిపింది. "నేను మున్నా భాయ్ MBBS సంతకం చేసాను.. కానీ అది జరగలేదు. మణి (రత్నం) సార్‌తో 'కన్నతిల్ ముత్తమిట్టల్త' కూడా జరగలేదు" అంటూ భూమిక పేర్కొంది. తన స్థానంలోకి వేరొక హీరోయిన్‌ను పెట్టడానికి కారణాన్ని రాజ్‌కుమార్ హిరానీ చెప్పారని భూమిక తెలిపింది. ‘‘ఎవరో చేసిన తప్పు కారణంగా మిమ్మల్ని సినిమా నుంచి తొలగించారు’’ అని రాజ్ కుమార్ అన్నారని భూమిక తెలిపింది. ‘‘సినిమా ఓ జూదం లాంటిది. ఎప్పుడు, ఏ సినిమా వర్క్ చేస్తుందో ఎవరికీ తెలియదు’’ అని పేర్కొంది.

ఇదిలా ఉండగా, భూమిక ఇటీవల సల్మాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌'లో కనిపించారు. 2003 తర్వాత ఆమె సల్మా్న్ ఖాన్ తో స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌'(KKBKKJ )ఏప్రిల్ 21, 2023న పెద్ద స్క్రీన్‌పై రిలీజైంది.

Also Read : ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?

Published at : 26 Apr 2023 04:01 PM (IST) Tags: Bhumika Chawla Kisi Ka Bhai Kisi Ki Jaan Salman Khan Tere Naam Jab We Met Munnabhai MBBS

సంబంధిత కథనాలు

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

Rakul Preet Singh: సినిమాల్లో ఫెయిలైతే అదే చేద్దామనుకున్నా, తన ‘ప్లాన్-బి’ రివీల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: సినిమాల్లో ఫెయిలైతే అదే చేద్దామనుకున్నా, తన ‘ప్లాన్-బి’ రివీల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

అలాంటి రోజు రావాలి - రూ.190 కోట్ల బంగ్లా కొనుగోలుపై ఊర్వశీ రౌతేలా తల్లి స్పందన

అలాంటి రోజు రావాలి - రూ.190 కోట్ల బంగ్లా కొనుగోలుపై ఊర్వశీ రౌతేలా తల్లి స్పందన

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!