Avengers End Game Advance Bookings : విశ్వాన్ని కాపాడే సూపర్ హీరోస్ - సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి అవెంజర్స్ ఎండ్ గేమ్... అడ్వాన్స్ బుకింగ్స్ షురూ
Avengers End Game Encore : మార్వెల్ అభిమానులకు సూపర్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు 'అవెండర్స్ ఎండ్ గేమ్ ఎన్ కోర్' మళ్లీ రెడీ అవుతోంది. ఈ నెల 25న సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుంది.

Avengers Endgame Encore Returns To Theatres Advance Bookings : మార్వెల్ అభిమానులకు గుడ్ న్యూస్. బిగ్ స్క్రీన్‌పై మరోసారి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్ : ఎన్కోర్' (Avengers Endgame : Encore) ఈ నెల 25న (శుక్రవారం) రీ రిలీజ్ కానుంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
'అవెంజర్స్ : ఎండ్‌గేమ్ – ఎన్కోర్' సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వరల్డ్ వైడ్ థియేటర్లలో రీరిలీజ్ కానుంది. ఈసారి 'ఎండ్‌గేమ్'ను ఐమాక్స్, ఇన్ఫినిటీ విషన్ సమర్పణలో మార్వెల్ స్టూడియోస్, 4DX, MX4D, SCREEN X, డాల్బీ విషన్, HDR BARCO, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకులు చూడొచ్చు. బిగ్ స్క్రీన్లు, బ్రైట్ ఇమేజ్, అద్భుతమైన సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించనున్నారు.
ముఖ్యంగా 'అవెంజర్స్ : ఎండ్‌గేమ్ – ఎన్కోర్'లో 'అవెంజర్స్ : డూమ్స్‌డే' సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్ కూడా చూపించనున్నారు. ఈ సినిమా డిసెంబర్ 18, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
‘ఎండ్‌గేమ్’ కథలో థానోస్ కారణంగా విశ్వంలోని సగం జనాభా నాశనం అవుతుంది. మిగిలిన సూపర్ హీరోలు ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చివరికి తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకు రావడంతో పాటు విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు థానోస్‌తో తలపడాల్సి వస్తుంది. తమ ప్రియమైన వారిని తిరిగి తీసుకురావడానికి సూపర్ హీరోస్ చేసే పోరాటం ప్రధానంగా సాగుతుంది. విశ్వంలో శాంతి, సమతుల్యతను పునరుద్ధరించేందుకు అవెంజర్స్ మరోసారి ఏకమై థానోస్‌తో తలపడే మహా సంగ్రామం ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించనుంది.
ఈ మూవీని కెవిన్ ఫైజ్ నిర్మించగా... ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహించారు. 'అవెంజర్స్ : ఎండ్‌గేమ్ – ఎన్కోర్' సెప్టెంబర్ 25న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో IMAX సహా అన్ని ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. లూయిస్ డి ఎస్పొసిటో, విక్టోరియా అలోన్సో, మైఖేల్ గ్రిల్లో, ట్రిన్ ట్రాన్, జాన్ ఫావ్రూ, జేమ్స్ గన్, స్టాన్ లీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
Also Read : The Paradise Story : అందుకే ట్రైలర్ రిలీజ్ చేయడం లేదు - తల్లీ కొడుకుల ఎమోషనల్ స్టోరీ ది ప్యారడైజ్
ట్రెండింగ్ వార్తలు























