అన్వేషించండి

ఈ రోజు నుంచే ఓటీటీలో 'అవతార్ 2' - ఇక ఉచితంగా చూసేయొచ్చు!

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేసిన 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' గత ఏడాది విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీ రాక కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పింది. 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' మూవీ జూన్ 7 నుండే ఓటిటిలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 7 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. నిజానికి మన సినిమాలు, వెబ్ సిరీస్ లు అర్ధరాత్రి నుంచి ఓటిటి ప్లాట్ఫామ్స్ లో అందుబాటులోకి వస్తాయి. కానీ 'అవతార్2' మాత్రం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి మూడు గంటలకు అలాగే పసిఫిక్ స్టాండర్డ్ టైం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతాయి.

పసిఫిక్ స్టాండర్డ్ టైం కంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం 12.30 గంటలు ముందు ఉంటుంది. దీని ప్రకారం 'అవతార్ ది వ్ ఆఫ్ వాటర్' మూవీ ఇండియాలో స్ట్రీమ్ అయ్యే సమయం జూన్ 7 బుధవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు. అయితే ఈ సినిమా బుధవారం ఓటీటీలోకి వస్తుందని తెలియడంతో కొందరు ఉదయాన్నే హాట్ స్టార్ చూసి సినిమా లేకపోవడంతో నిరాశ చెందారు. అయితే జూన్ 7 ఉదయం కాకుండా మధ్యాహ్నం నుంచి అవతార్ 2 హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ సినిమా నెలరోజుల కిందే ఓటిటిలోకి వచ్చినా.. అందుకు రెంటల్ విధానంలో భారీగా చెల్లించాల్సి వస్తుంది. మళ్లీ సుమారు నెల రోజుల తర్వాత జూన్ 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఓ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత దాదాపు 90 రోజుల లోపే ఓటిటి ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుంది. కానీ అవతార్ 2 మాత్రం గత ఏడాది డిసెంబర్ 16న విడుదలైంది.

అంటే ఈ సినిమా థియేటర్లో విడుదలై సుమారు 173 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక సుమారు 1 బిలియన్ డాలర్స్ తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.9 బిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి హాలీవుడ్ లోనే అత్యంత కలెక్షన్స్ ని కొల్లగొట్టిన చిత్రంగా సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు  ఇండియాలో ప్రత్యేకించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు అందుకొని గ్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. ఇక 'అవతార్ పార్ట్ 1' లో పండోరా గ్రహం పై జంతువులు, అడవులతో సరికొత్త లోకాన్ని సృష్టించిన జేమ్స్ కామెరూన్.. పార్ట్ 2 లో సముద్రపు అడుగున చిత్రించిన సన్నివేశాలతో ఆడియన్స్ కి అదిరిపోయే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని అందించారు.  ఇక ఈ క్రమంలోనే  'అవతార్ 3' ని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజానికి పార్ట్2 క్లైమాక్స్ లోనే 'అవతార్ 3' కి సంబంధించి దర్శకుడు హింట్ ఇచ్చాడు. 2024 లో 'అవతార్ 3' ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రియాంక చోప్రా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget