అన్వేషించండి

Ashu Reddy Issue : అషు రెడ్డి వివాదంలో షాకింగ్ ట్విస్ట్ - కాల్ మనీ రాకెట్‌తో లింక్?

Ashu Reddy Father : అషు రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఆమె తండ్రి వెంకట కృష్ణారెడ్డి స్పందించారు. తన బిడ్డ అమాయకురాలని ఆమెకు ఏమీ తెలియదని అన్నారు.

Ashu Reddy Father Reaction Over Her Daughter Issue : బిగ్ బాస్ ఫేం, సినీ నటి అషు రెడ్డి వ్యవహారం ఆదివారం నుంచి హాట్ టాపిక్‌గా మారింది. తన కుమారుడి వద్ద రూ.9 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆరోపిస్తూ... ఆమెపై, ఫ్యామిలీపై కూడా షేక్ పేట్‌కు చెందిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై అషు రెడ్డి తండ్రి వెంకట కృష్ణారెడ్డి స్పందిస్తూ... షాకింగ్ నిజాలు వెల్లడించారు.

'వారికి కాల్ మనీతో సంబంధాలు'

తమ అమ్మాయి మోసం చేసిందని ఆరోపించిన సత్యనారాయణకు కాల్ మనీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు వెంకట కృష్ణా రెడ్డి. '2021లో కాకినాడ నుంచి సత్యనారాయణ తనను తాను పరిచయం చేసుకుని పెళ్లి సంబంధం గురించి మాట్లాడాడు. వాళ్ల అబ్బాయి, మా అమ్మాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అయ్యారని చెప్పాడు. దీంతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి ఎంక్వైరీ చేయించాను. అప్పటికే అతనికి పెళ్లై విడాకుల కేసు నడుస్తోందని తెలిసింది.

అంతే కాకుండా సత్య నారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుతామని నానుస్తూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వింటున్నా.' అని చెప్పారు.

Also Read : ధనుష్ టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?

'నా బిడ్డ అమాయకురాలు'

తన బిడ్డ అమాయకురాలని... ఆమెకు ఏమీ తెలియదని చెప్పారు వెంకట కృష్ణారెడ్డి. 'నేను వైజాగ్‌లో ఉంటా. మా అమ్మాయి తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. నాకు ఆమె ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. తల్లి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. అషు రెడ్డికి ఏమీ తెలియదు. అమాయకురాలు.

ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏమీ తెలీదు. మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు చెప్పింది.' అని చెప్పారు.

అసలేం జరిగిందంటే?

తన కుమారుడు ధర్మేంద్రను పెళ్లి పేరుతో అషు రెడ్డి రూ.9.35 కోట్ల మేర మోసం చేసిందంటూ షేక్ పేట్‌కు చెందిన సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధర్మేంద్ర లండన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడని... 2018లో భారత్‌కు వచ్చిన టైంలో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పి డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరిట బంగారం, కార్లు, ఆస్తులు కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకుందని ఆరోపించారు.

ఆ తర్వాత అషు రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధం అంటూ హడావుడి చేసి పెళ్లి పేరెత్తితే మొహం చాటేస్తున్నారని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. మరోవైపు, అషు రెడ్డి దీనిపై స్పందించారు. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chandini Chowdary : నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Ramayana Release Date : విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
Varanasi : వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget