అన్వేషించండి

Bollywood Intimate Scenes:"ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోతున్నారు, కట్‌ చెప్పినా ఆగడం లేదు" బాలీవుడ్ నటులపై సీనియర్ నటుడి ఆరోపణలు! 

Bollywood Intimate Scenes: బాలీవుడ్ నటులపై తోటి నటుడు సంచలన ఆరోపణలు చేశారు. ఇంటిమేట్ సన్నివేశాల్లో కట్ చెప్పినా నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అన్ను కపూర్ బాలీవుడ్ సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
  • కొందరు నటులు కట్ చెప్పినా ఆగకుండా ప్రవర్తిస్తారని ఆయన తెలిపారు.
  • నటీమణుల సౌకర్యం, గౌరవం తనకు ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
  • ప్రియాంక చోప్రా, తమన్నా భాటియా గురించి ఆయన అభిప్రాయాలు వెల్లడించారు.

Bollywood Intimate Scenes: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాల కాలంగా తనదైన ముద్ర వేసిన నటుడు అన్ను కపూర్‌. తన నటనతోనే కాకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వంతో ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సిద్ధార్థ్‌ కన్నన్ యూట్యూబ్ షోలో పాల్గొన్న ఆయన, బాలీవుడ్ సెట్స్‌పై సన్నిహత సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చోటు చేసుకునే కొన్ని అవాంఛనీయ ఘటనల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరపై కనిపించే రొమాన్స్ వెనుక నటీమణులు పడే కష్టాలకు, కొందరు నటుల ప్రవర్తనను ఆయన ఎండగట్టారు. 

కట్ చెప్పిన ఆగడం లేదట

సినిమా చిత్రీకరణలో సన్నిహిత సన్నివేశాలు అత్యంత సున్నితమైనవి. ఇక్కడ నటీనటులు మధ్య సమన్వయం, గౌరవం చాలా ముఖ్యం. అయితే అన్ను కపూర్ వెల్లడించిన వివరాల ప్రకారం, కొందరు పురుష నటులు అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు ఉద్యేగానికి లోనై నియంత్రణ కోల్పోతుంటారు. 

దర్శకుడు సన్నివేశం పూర్తయిందని కట్ అని అరిచినా, వారు ఆపకుండా ఆలాగే కొనసాగిస్తారని అన్ను కపూర్‌ పేర్కొన్నారు. చాలా మంది ఇటువంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రయోజనం పొందుతారు, కానీ నేను ఎప్పుడూ అలా చేయలేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఒక నిర్ధిష్ట ఘటన గుర్తు చేసుకుంటూ ఒక హీరో ఇలాగే ప్రవర్తించడంతో ఆ నటి అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా పోరాడాల్సిన వచ్చిందని, ఆ తర్వాత ఆమె ఎంతగా భయపడిందంటే రెండు రోజులపాటు గది నుంచి బయటకు రాలేదని ఆయన ఆవేదన వ్యక్త చేశారు. ఈ విషయంలో ఆ నటిని అడిగినా తను చెప్పిన విషయాలను ధృవీకరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 

నటుడిగా తన ప్రయాణంలో ఇటువంటి సన్నివేశాలను ఎలా డీల్ చేస్తారో కూడా అన్నూ కపూర్  వివరించారు. షూటింగ్ సమయంలో తోటి నటి సౌకర్యవంతంగా ఉందో లేదో తాను ఎప్పుడూ గమనిస్తూ ఉంటానని చెప్పారు. " నేను ఎప్పుడూ నా సహనటిని మీరు బాగున్నారా అని అడుగుతుంటాను అని ఆయన తెలిపారు. గతంలో సెట్స్‌పై ఇటువంటి సన్నివేశాల చిత్రీకరణను పర్యవేక్షించడానికి ఇంటిమసి కోచ్‌లు ఉండేవారు కాదని, అందుకే అప్పుడు నైతికత అనేది పూర్తిగా వ్యక్తిగత బాధ్యతగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ప్రియాంక చోప్రాతో 7 ఖూన్‌ మాఫ్ సన్నివేశం గుర్తు చేస్తూ... 

ఈ చర్చల్లో భాగంగా విశాల్‌ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన 7 ఖూన్ మాఫ్‌ చిత్రంలో ప్రియాంక చోప్రాతో కలిసి నటించిన అనుభవాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ చిత్రంలో ఒక ముద్దు సన్నివేశం ఉందని, అయితే దానిని చేయడానికి ప్రియాంక సముఖంగా లేదని ఆయన వెల్లడించారు. ఆ సన్నివేశం కథలో భాగమని, దానిని తొలగించం సాధ్యం కాదని దర్శకుడు చెప్పినప్పటికీ, నటి అసౌక్యాన్ని తాగును గౌరవించానని అన్ను కపూర్‌ చెప్పారు. ఆ సమయంలో ఈ విషయంపై అనవసర వివాదాలు రేగినా, తాను మాత్రం ఎప్పుడూ ప్రొఫెషనల్‌గానే వ్యవహరించానని చెప్పారు. 

తమన్నాభాటియాపై కామెంట్స్‌కు వివరణ 

గతంలో నటి తమన్నా భాటియా గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కూడా అన్ను కపూర్ స్పందించారు. తమన్నాను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. కానీ అది తాను ఒక ప్రశంసగానే చేశానని అన్నారు. ఒక వేళ ఆమె మనస్తాపానికి గురైతే కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు.

Frequently Asked Questions

బాలీవుడ్ సెట్స్‌పై సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ గురించి అన్ను కపూర్‌ ఏం వెల్లడించారు?

కొన్ని సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ సమయంలో కొందరు పురుష నటులు నియంత్రణ కోల్పోయి, కట్ చెప్పినా ఆగకుండా కొనసాగిస్తారని అన్ను కపూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

సన్నిహిత సన్నివేశాలలో నటీనటుల మధ్య సమన్వయం, గౌరవం ఎంత ముఖ్యం?

సన్నిహిత సన్నివేశాలు చాలా సున్నితమైనవి. నటీనటుల మధ్య పరస్పర సమన్వయం, గౌరవం పాటించడం చాలా అవసరం.

అన్ను కపూర్‌ 7 ఖూన్ మాఫ్‌ చిత్రంలో ప్రియాంక చోప్రాతో నటించిన అనుభవాన్ని ఎలా గుర్తు చేసుకున్నారు?

7 ఖూన్ మాఫ్‌లో ప్రియాంక చోప్రాతో ముద్దు సన్నివేశం ఉంది. ఆమె సముఖంగా లేకపోయినా, నటి అసౌకర్యాన్ని గౌరవించి, ప్రొఫెషనల్‌గా వ్యవహరించానని అన్ను కపూర్‌ తెలిపారు.

తమన్నా భాటియాపై అన్ను కపూర్‌ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఏమిటి?

తమన్నా భాటియాపై తాను చేసిన వ్యాఖ్యలు ప్రశంసగానే చేశానని, ఆమె మనస్తాపానికి గురైతే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్ను కపూర్‌ పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget