అన్వేషించండి

Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?

Anirudh Ravichander On Jailer 2: అక్టోబర్ 15న 'జైలర్ 2' విడుదల సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ట్రిబ్యూట్ కింద సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఓ పోస్ట్ చేశారు. సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అనిరుధ్ రవిచందర్ 'జైలర్ 2'పై రివ్యూ తరహా ట్వీట్ చేశారు.
  • రజనీకాంత్ 51 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని అనిరుధ్ ప్రశంసించారు.
  • మూడు ఫైర్ ఎమోజీలతో 3 స్టార్ రేటింగ్ అని అభిమానుల అంచనా.
  • 'జైలర్ 2' అక్టోబర్ 15న విడుదల; మిథున్ చక్రవర్తి కీలక పాత్ర.

Jailer 2 First Review: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)కు ఓ అలవాటు ఉంది. రీ రికార్డింగ్ కంప్లీట్ చేసి, సినిమా చూశాక ఓ ట్వీట్ చేస్తారు. అందులో పోస్ట్ చేసే ఎమోజీలను బట్టి సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తారు. ఆ విధంగా పోస్ట్ చేయడం మానేసి కొన్ని రోజులైంది. హీరోలతో పాటు దర్శక నిర్మాతల నుంచి ప్రతి సినిమాకు పోస్ట్ చేయమని ఒత్తిడి రావడంతో రివ్యూ తరహా ట్వీట్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'కు అనిరుధ్ ఓ ట్వీట్ చేశారు. దానికి రివ్యూ అనుకోవాలి. అందులో ఏముందంటే?

'జైలర్ 2'కు అనిరుధ్ రేటింగ్ 3 స్టార్స్?
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'జైలర్ 2'. అక్టోబర్ 15వ తేదీన... అంటే ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీనికి నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వం వహించారు. రజనీతో ఆయన తీసిన 'జైలర్'కు సీక్వెల్ ఇది. దాంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో అనిరుధ్ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

"తరతరాలుగా మనకు ఎనలేని ఆనందాన్ని, స్వచ్ఛమైన నవ్వులను, గూస్‌ బంప్స్ మూమెంట్స్ అందించడంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలను అందించారు రజనీకాంత్. ఇప్పుడు ఆయన వయసు 76 సంవత్సరాలు. ఈ వయసులోనూ... గత 51 సంవత్సరాలుగా సినిమా రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎన్నో రికార్డులను తిరగరాస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు'' అని రజనీకాంత్ గురించి అనిరుధ్ ట్వీట్ చేశారు.

Also Read: TG Vishwa Prasad On Raja Saab Result - ప్రభాస్ 'ది రాజా సాబ్' కొంపముంచిన సంక్రాంతి? బాక్సాఫీస్ రిజల్ట్ మీద ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ రియాక్షన్

రజనీకాంత్ ప్రయాణంలో 172వ సినిమా 'జైలర్ 2'. అందువల్ల... ''రేపు 172వ సారి థియేటర్లు దద్దరిల్లుతాయి. ప్రేక్షకుల అందరి ఆశీస్సులతో ప్రతి ఒక్క భారతీయ ప్రేక్షకుడి హృదయంలో నివసించే సూపర్ స్టార్ పట్ల అందరిలో ఉన్న అపారమైన ప్రేమను రేపు ప్రపంచం ప్రత్యక్షంగా చూడబోతోంది'' అని అనిరుధ్ తెలిపారు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, అలాగే సూపర్ స్టార్ ఒకే ఒక్కడు అని పోస్ట్ ఎండ్ చేశారు. ఆ తర్వాత మూడు ఫైర్ ఎమోజీలను యాడ్ చేశారు. దాంతో 'జైలర్ 2' సినిమాకు అనిరుధ్ రేటింగ్ 3 స్టార్స్ అని రజనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read: Director Maruthi Next After The Raja Saab Movie - రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?

'జైలర్ 2'లో రమ్యకృష్ణ మరోసారి రజనీకాంత్ భార్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇంకా విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  

Also Read: Vijay Deverakonda On Ranabaali Success - 'రణబాలి'తో కమ్‌బ్యాక్ ఇస్తా... ఈ సినిమాకు రష్మిక అవసరం - విజయ్ దేవరకొండ

Frequently Asked Questions

అనిరుధ్ రవిచందర్ 'జైలర్ 2' సినిమాకు ఎలా రేటింగ్ ఇచ్చారు?

అనిరుధ్ తన ట్వీట్‌లో మూడు ఫైర్ ఎమోజీలను ఉపయోగించారు. దీనిని అభిమానులు 'జైలర్ 2'కి 3 స్టార్ రేటింగ్‌గా భావిస్తున్నారు.

'జైలర్ 2' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

'జైలర్ 2' రజనీకాంత్ కెరీర్‌లో ఎన్నో సినిమా?

'జైలర్ 2' రజనీకాంత్ ప్రయాణంలో 172వ సినిమా. అనిరుధ్ తన ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

'జైలర్ 2' సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరు నటించారు?

ఈ సినిమాలో రమ్యకృష్ణ రజనీకాంత్ భార్యగా నటించారు. మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idupu Kayitham Ullipoola Song : ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
Arjun Sarja : ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
Ram Charan Sukumar : చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!
చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!
Anil Ravipudi Ramayana : మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
మైథలాజికల్ జానర్‌లో అనిల్ రావిపూడి మూవీ - డ్రీమ్ ప్రాజెక్టు‌పై స్టార్ డైరెక్టర్ రియాక్షన్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget