''పొలిమేర 2' పార్ట్-1 కంటే పది రెట్లు భయంకరంగా ఉంటుంది - పార్ట్-3 స్టార్ హీరోతో ప్లాన్ చేశాం'
'మా ఊరి పొలిమేర 2' సినిమాపై దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్ట్-1 కంటే పార్ట్-2 పదిరెట్లు భయంకరంగా ఉంటుందని, పార్ట్-3 కూడా ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు.
ఓటీటీలో సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన 'మా ఊరి పొలిమేర'(Maa Oori Polimera) చిత్రానికి సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ 'మా ఊరి పొలిమేర' సీక్వెల్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. సత్యం రాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమేర' 2021లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సైలెంట్ గా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ మెల్లమెల్లగా మౌత్ టాక్ తో ప్రేక్షకులో మరింత ఆదరణను కనబరిచింది.
ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న 'మా ఊరి పొలిమేర 2' మూవీని ఏకంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌర గణబాబు సమర్పణలో గౌరీ కృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, రాకెందు మౌళి, దాసరి సాహితి, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ మరింత భయంకరంగా ఉండబోతుందని అర్థమవుతుంది.
ఇదే విషయంపై దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్స్, ఫ్రీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మా ఊరి పొలిమేర చిత్రాన్ని సైతం ఫ్రాంచేజీలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ భావిస్తున్నారట. దీని గురించి చిత్ర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ 'మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ 10 రెట్లు భయంకరంగా మరింత థ్రిల్లింగ్ గా ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా పార్ట్ 3 కి సంబంధించి కథ కూడా రాయడాన్ని ప్రారంభించినట్లు' తెలిపారు. " లూప్ హోల్స్, బ్లాక్ వదిలాను. వాటిని సరి చేసుకుంటూ మూడోపార్ట్ కూడా రెడీ చేస్తాను. మూడో పార్ట్ మరింత పెద్ద స్థాయిలో ఉంటుంది. అందులో స్టార్ హీరోలను సైతం యాడ్ చేస్తాను" అంటూ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పేర్కొన్నారు.
ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే పొలిమేర మూవీ ని ఫ్రాంచైజీలుగా తెరకెక్కించి దర్శకుడిగా తన స్థాయి పెంచుకునే ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మొత్తంగా పొలిమేర సీక్వెల్ పై డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ చేసిన కామెంట్స్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. గ్యాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీ వర ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. ఉపేంద్ర రెడ్డి చందా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. రామ్ మాస్టర్ ఫైట్లు కంపోజ్ చేశారు. ఎన్.సి.సతీష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. మరి నవంబర్ 3న రాబోతున్న పోలిమేర 2 ప్రేక్షకుల్ని ఏమేర భయపెడుతుందో చూడాలి.
Also Read : 'టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ - సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial