అన్వేషించండి

'ఆదిపురుష్'కి జగన్ సర్కార్ సపోర్ట్ - టికెట్‌‌పై రూ.50 పెంపునకు గ్రీన్ సిగ్నల్!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా జూన్ 16న విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైతలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' మరికొన్ని గంటల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మొట్టమొదటిసారి ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించగా, కృతి సీత పాత్రలో కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఓంరౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా యూనిట్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి.

అదేంటంటే సినిమా టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఆయా సినిమాల నిర్మాతల అభ్యర్థుల మేరకు మొదటివారం టికెట్ రేట్లను పెంచుకునే తెలుగు రాష్ట్రాలు వెసలపాటు కల్పిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆదిపురుష్ విషయంలోనూ అదే జరిగింది. ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఆదిపురుష్ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ జీవో కూడా విడుదల చేయగా.. ఆ జీవో ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ పై రూ.50 రూపాయలు పెంచేకునే అవకాశం కల్పించింది. అయితే అది కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు జీవోలో పేర్కొంది. అంతేకాకుండా మూడు రోజులపాటు రోజుకు 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ లెక్కన తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని థియేటర్స్ లో ప్రదర్శించుకోవచ్చు.

ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరపై 50 రూపాయలు పెంచినట్లు కాసేపటి క్రితమే ఓ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం జూన్ 16 నుండి పది రోజులపాటు పెంచిన టికెట్ రేట్లు అమ్ముకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం ఆదిపురుష్ టికెట్ ధర మల్టీప్లెక్స్ లో రూ.236 అలాగే సింగిల్ స్క్రీన్స్ లో రూ.210 గా ఉన్నాయి. కాగా ఇప్పటికే తెలంగాణలో ఆదిపురుష్ కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అటు నార్త్ లోను రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కాగా ఆదిపురుష్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. ఇక మోషన్ క్యాప్చర్ 3D టెక్నాలజీ తో విజువల్ వండర్ గా రూపొందిన ఈ సినిమాని రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. అజయ్ అతుల్ సంగీతం అందించారు.

Also Read: 'దృశ్యం 3'పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ - మలయాళం, హిందీలో ఒకేసారి చిత్రీకరణ, మరి తెలుగులో?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sai Pallavi: సాయి పల్లవి సినిమా ఫ్లాపే... అంగీకరించిన హీరో
సాయి పల్లవి సినిమా ఫ్లాపే... అంగీకరించిన హీరో
OTT Malayalam Movie: ఓటీటీలోకి మలయాళ 'హనీమూన్'... ఈ నెలలోనే - స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ ఇవిగో
ఓటీటీలోకి మలయాళ 'హనీమూన్'... ఈ నెలలోనే - స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫార్మ్‌ డీటెయిల్స్ ఇవిగో
Trisha Krishnan: రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?
రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు మరో సినిమా... భారీ తమిళ మల్టీస్టారర్‌లో త్రిష?
Ranveer Singh: శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?
శివునిగా రణవీర్ సింగ్... Dhurandhar సక్సెస్ తర్వాత పౌరాణిక ఫ్రాంచైజీ?

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Embed widget