అన్వేషించండి

Mirzapur Season 3 : 'మీర్జాపూర్' ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సీజన్ 3 పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అమెజాన్!

Mirzapur 3 : 'మీర్జాపూర్' సీజన్ 3 త్వరలోనే రాబోతుందంటూ అమెజాన్ ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది.

Mirzapur Season 3 Update : అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ లలో 'మీర్జాపూర్' ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ పొలిటికల్ గ్యాంగ్ స్టర్ డ్రామా సిరీస్ నుంచి త్వరలోనే మూడో సీజన్ కూడా రాబోతుంది. అమెజాన్లో ఎన్ని సిరీస్ లు వచ్చిన 'మీర్జాపూర్' కు మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. ఈ సిరీస్ కు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. 2018లో 'మీర్జాపూర్' మొదటి సీజన్ అమెజాన్ లో విడుదలై రికార్డ్ స్థాయిలో న్యూస్ సాధించి సూపర్ సక్సెస్ అయింది. తొలి సీజన్ బ్లాక్ బస్టర్ అవడంతో 2020 లో రెండో సీజన్ ని రిలీజ్ చేశారు. అది కూడా మొదటి సీజన్ ను మించి రెస్పాన్స్ అందుకుంది. ఇక చాలాకాలంగా సీజన్ 3 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ చెప్పింది. 

'మీర్జాపూర్' సీజన్ 3 వచ్చేస్తోంది

మార్చి 19న ముంబైలో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్ లో 'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇదొక్కటే కాదు అమెజాన్లో రాబోతున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇదే వేదికపై అనౌన్స్ చేసింది. అంతేకాదు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయిన వెబ్ సిరీస్ సీక్వెల్స్ ని కూడా ప్రకటించింది. ఇందులో భాగంగానే 'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

'మీర్జాపూర్' సింహాసనం దక్కేది ఎవరికి?

'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇస్తూ మంటల్లో దగ్ధమవుతున్న ఓ కుర్చీని పోస్ట్ చేశారు మేకర్స్. అంతేకాకుండా.. "కిరీటం దక్కించుకునేందుకు గుడ్డు, గోలు కొత్త పోటీదారుడుతో తలపడనున్నారు. మరి వారికి అధికారం దక్కుతుందా? లేదా బయట శక్తులతో ఆ పవర్ ఫుల్ సీట్ శాశ్వతంగా నాశనం అవుతుందా?" అంటూ పేర్కొన్నారు. ఈ సీజన్లో గుడ్డు, గోలు క్యారెక్టర్స్ మరింత పవర్ ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే రెండవ సీజన్లో కొనసాగిన పాత్రలతో పాటు ఇంకొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతాయని అంటున్నారు. కాగా సీజన్ 3 లో పంకజ్ త్రిపాటి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.  గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆ విషయంలో నిరాశాపరిచిన అమెజాన్

ముంబైలో జరిగిన స్పెషల్ ఈవెంట్లో 'మీర్జాపూర్' సీజన్ 3 అప్డేట్ ఇచ్చిన మేకర్స్ ఓ విషయంలో మాత్రం ఫాన్స్ ని నిరాశపరిచారు. అదే సీజన్ 3 రిలీజ్ డేట్. 'మీర్జాపూర్' సీజన్ 3 గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా స్ట్రీమింగ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. కనీసం స్ట్రీమింగ్ కి ఎప్పుడు తీసుకొస్తున్నారనే విషయంపై కూడా హింట్ ఇవ్వలేదు. దీంతో ఈ విషయంలో మీర్జాపూర్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. అయితే ఇప్పటికే సీజన్ 3 షూటింగ్ పూర్తయిందని, ఈ ఇయర్ లోనే రిలీజ్ ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో నైనా అమెజాన్ ప్రైమ్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Also Read : వామ్మో, 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ అన్ని కోట్లు పెట్టిందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

టాప్ హెడ్ లైన్స్

Hanuman Ansh OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'హనుమాన్ అంశ్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'హనుమాన్ అంశ్' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ganguly Doosra Row: గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
గంగూలీ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. దూస్రా చిత్ర ప్రదర్శనపై కీలక తీర్పు
Family Drama OTT : మూడు ఫ్యామిలీస్... ఊహించని షాక్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ
మూడు ఫ్యామిలీస్... ఊహించని షాక్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ
Ramayana Review : సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ
సిల్వర్ స్క్రీన్‌పై ఓ అద్భుతం - 'రామాయణ'పై వారణాసి రాముడి రివ్యూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
Embed widget