అన్వేషించండి

Allu Arjun: బన్నీ సింప్లిసిటీ చూడండి - పాన్‌ ఇండియా స్టార్ అయ్యుండి.. సాధారణ వ్యక్తిలా దాబాలో భోజనం!, ఫోటో వైరల్‌

Allu Arjun Spotted in Dhaba: అల్లు అర్జున్‌ సింప్లిసిటీ చూసి ఫ్యాన్స్‌ అంతా తెగ ముచ్చటపడుతున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యుండి.. సాధారణ వ్యక్తిలా ఇలా దాబా భోజనం చేయడం అందరిని సర్‌ప్రైజ్‌ చేస్తుంది.

Allu Arjun Spotted in Loacl Dhaba: ఈ మధ్య ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నారు. ఏపీ ఎన్నికల నుంచి బన్నీ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇక ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డును కైవసం గెలుచుకున్నాడు. అంతేకాదు తెలుగు హీరోల్లో నేషనల్‌ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా సినీ చరిత్రలో రికార్డు క్రియేట్‌ చేశాడు. అంతటి ఘనత, రికార్డు నెలకొల్పిన బన్నీ సింప్లిసిటీ పై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. 

భార్యతో కలిసి దాబాలో

ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఐకాన్ స్టార్ ఇప్పుడు ఒక్క టాలీవుడ్‌లోనే కాదు ఇండియా వైడ్‌గా గుర్తింపు పొంది నేషనల్‌ స్టార్‌ అయ్యాడు. పాన్‌ ఇండియా స్టార్‌ డమ్‌ ఉన్న బన్నీ ఓ సాధారణ వ్యక్తిలా దాబాలో భోజనం చేశాడు. ఇది ఎక్కడనేది తెలియదు. కానీ, ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ఫోటోల బన్నీ మాత్రమే కాదు అతడి భార్య స్నేహారెడ్డి కూడా పక్కనే ఉన్నారు. వెనకాలే వారి బాడిగాడ్ కూడా ఉన్నాడు. అంత స్టార్‌ డమ్‌ ఉన్న అల్లు అర్జున్‌ ఇలా సింపుల్‌ దాబాలో భోజనం చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇది చూసి అతడి సింప్లిసిటీకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. కాగా ఇది ఏపీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన సంఘటన.

ఇప్పుడు ఆలస్యంగా ఈ ఫోటో సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. కాగా ఏపీ ఎన్నికల భాగంగా అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైస్సారిసీపీ అభ్యర్థుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అతడి తరపున ప్రచారం చేసి తన స్నేహితుడికి ఓటేసి గెలిపించాలని ఓటర్లు సూచించాడు. ఈ ప్రచారం అనంతరం తిరిగి వస్తుండగా.. ఏపీలోని ఓ దాబా బన్నీ ఇలా భార్యతో కలిసి లంచ్‌ చేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ఈ ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ ఫోన్‌ మాట్లాడుతూ ఉండగా.. పక్కనే స్నేహరెడ్డి భోజనం చేస్తూ కనిపించింది. దీంతో వారి సింప్లిసిటీ చూసి నెటిజన్లు, ఫ్యాన్స్‌ తెగ ముచ్చటపడుతున్నారు. 

Also Read: పవిత్ర జయరాం, చందు రిలేషన్‌పై స్పందించిన ఆమె కూతురు - ఏం చెప్పిందంటే!

కాగా అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్‌తో బీజీగా ఉన్నాడు. పాన్‌ ఇండియా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఒక్క తెలుగు ఆడియన్స్‌ మాత్రమే ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మూవీ లవర్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప,పుష్ప సాంగ్‌ యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. ఇక సోషల్‌ మీడియాలో అయితే ఈ పాట మారుమోగుతుంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 15న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా రష్మిక హీరోయిన్‌ కాగా, మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, రావు రమేష్‌, జగపతి బాబు, యాంకర్ అనసూయ వంటి స్టార్‌ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget