అన్వేషించండి

Allu Arjun - Sneha Reddy: అల్లు అర్జున్ - స్నేహ రెడ్డిల పెళ్లి బంధానికి 13 ఏళ్లు, వీరి లవ్ స్టోరీ మీకు తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జు, స్నేహారెడ్డి వివాహ బంధంలోకి అడుగు పెట్టి 12 ఏండ్లు పూర్తయ్యాయి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన వీళ్లిద్దరు, 2011లో పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు.

Allu Arjun - Sneha Reddy 13th Wedding Anniversary : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ కెరీర్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతోంది. ‘పుష్ప’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటారు. ఈ మూవీలో ఆయన నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరికీ లభించని అరుదైన గౌరవాన్ని బన్నీ అందుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

హ్యాపీ యానివర్సరీ క్యూటీ!

ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే, టైం దొరికితే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్య స్నేహారెడ్డికి విషెస్ చెప్పారు. పనిలో పనిగా భార్యపై పొగడ్తలు కురిపించారు. “మన పెళ్లై 13 ఏళ్లు గడిచిపోయాయి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నీతో ఏర్పడిన అనుబంధమే. నీ ప్రశాంతతో నాకు ఎంతో శక్తిని అందించావు. మరెన్నో వివాహ వార్షికోత్సవాలు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ యానివర్సరీ క్యూటీ” అంటూ రాసుకొచ్చారు. భార్య స్నేహతో కలిసి ఉన్న ఫోటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు బన్నీ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు.

పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం!

ఇక అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వీరి పెళ్లికి మొదట్లో ఇబ్బందులు ఎదురైనా, ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోవడంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నిజానికి బన్నీ, స్నేహా విభిన్న కుటుంబ నేపథ్యాలను కలిగి ఉన్నారు. స్నేహారెడ్డి అమెరికాలో చదువుకుని ఇండియాకు వచ్చింది. స్నేహ తండ్రి హైదరాబాద్ లోని ప్రముఖ విద్యా సంస్థలకు అధినేత. అటు బన్నీ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. చక్కటి నటనతో స్టార్ హీరోగా ఎదిగారు. వీరిద్దరు ఓ ప్రైవేట్ పార్టీలో కలిశారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇదే విషయాన్నిపెద్దలకు చెప్పారు. అయితే, స్నేహారెడ్డి తండ్రి తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. సినీ నేపథ్యం ఉన్న అబ్బాయిని తన అల్లుడిని చేసుకోలేనని చెప్పారట. కానీ, కొంతకాలం తర్వాత ఆయన మనసు మార్చుకొని పెళ్లి సరే అన్నారట. మొత్తంగా పెద్దల సమక్షంలో 2011 మార్చ్ 6న హైదరాబాద్ లో స్నేహ, బన్నీ వివాహం అట్టహాసంగా జరిగింది. 2014లో వీరికి అబ్బాయి అయాన్ జన్మించాడు. 2016లో రెండవ బిడ్డగా అర్హ పుట్టింది. ప్రస్తుతం హ్యాపీగా వివాహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.  

Read Also : వెల్‌కం టు హైదరాబాద్ - ఒకే నగరం భిన్న జీవితాలు, ‘ప్రేమలు’ తెలుగు వీడియో సాంగ్ చూశారా ?

టాప్ హెడ్ లైన్స్

Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Siddharth Galla Wife: ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
ఎవరీ కిమ్ హెయిన్? మహేష్ మేనల్లుడు సిద్ధార్థ్ పెళ్ళి చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?
Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Raasa Gummadi Song: 'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
'కొరియన్ కనకరాజు'లో దక్ష... రాయలసీమ జాతర నేపథ్యంలో స్పెషల్ సాంగ్... రిలీజ్ ఎప్పుడంటే?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Embed widget