అన్వేషించండి

Allari Naresh : 'బచ్చలమల్లి'గా అల్లరి నరేష్ - ఆసక్తి రేకెత్తిస్తోన్న పోస్టర్, గజదొంగగా కనిపించనున్నఅల్లరోడు!

Allari Naresh : అల్లరి నరేష్ కొత్త సినిమాకి 'బచ్చలమల్లి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని మూవీ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.

Allari Naresh : అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలో లాగా రొటీన్ కథలు కాకుండా విభిన్న తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన కెరీర్లో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు మాత్రం సీరియస్ సబ్జెక్ట్స్ తో మెప్పిస్తున్నాడు. అందులోనూ తన నటనతో అదరగొడుతున్నారు .సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయోగాల బాట పడుతూ ఈ హీరో నటించిన 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' వంటి సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. చివరగా 'ఉగ్రం'తో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఆ వెంటనే తన తదుపరి సినిమాని అనౌన్స్ చేసాడు.

#Naresh62 అనే వర్కింగ్ టైటిల్ తో తన పుట్టినరోజు సందర్భంగా గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మూవీ టీం టైటిల్ ని రివీల్ చేసింది. అల్లరి నరేష్ కెరీర్లో 62వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బచ్చలమల్లి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇంతకీ 'బచ్చలమల్లి' అనే టైటిల్ లో ఉన్న వ్యక్తి పేరు ఎవరిది? ఈ ప్రాజెక్టుకి ఆ టైటిల్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయానికొస్తే.. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని తునిలో గజదొంగగా పేరుగాంచిన బచ్చలపల్లి జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

తుని ప్రాంతంలో రౌడీగానూ ముద్ర వేసుకున్న బచ్చలపల్లి పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నారు. ఓ వైపు సీరియస్ గా కథని నడిపిస్తూనే మరోవైపు కామెడీ కూడా హైలెట్ అయ్యేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి ధరంతేజ్ తో 'సోలో బ్రతుకే సో బెటర్' మూవీని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుబ్బు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. అల్లరి నరేష్ తో 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాను నిర్మించిన హాస్య మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిచర్డ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మూవీ టీం అధికారికంగా వెల్లడించనుంది. ఇదిలా ఉంటే అల్లరి నరేష్ ఇప్పటివరకు ఇలాంటి బయోపిక్ లో నటించింది లేదు. ఈ హీరో నటిస్తున్న ఫస్ట్ బయోపిక్ ఇదే. ఈ మధ్య టాలీవుడ్ లోనూ పలు బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు, క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వంటి బయోపిక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ కూడా ఈ బయోపిక్ ట్రెండ్ లో జాయిన్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.

Also Read : దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan OTT: ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Psychological Thriller OTT : చిన్న గొడవ... రెండు ఫ్యామిలీస్ మధ్య ఊహించని ఘటన - ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
చిన్న గొడవ... రెండు ఫ్యామిలీస్ మధ్య ఊహించని ఘటన - ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Jim Jim Tara Song : జిమ్ జిమ్ తారా... జిమ్ జిమ్ తారా... జిలేబీ తేరా చిన్నోడా - ఒక్క సాంగ్‌తోనే ట్రెండింగ్‌లో 'పర్ణశాల' మూవీ
జిమ్ జిమ్ తారా... జిమ్ జిమ్ తారా... జిలేబీ తేరా చిన్నోడా - ఒక్క సాంగ్‌తోనే ట్రెండింగ్‌లో 'పర్ణశాల' మూవీ
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget