అన్వేషించండి

Alia Bhatt: బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో ఆలియా భట్ - కన్ఫర్మ్ చేసిన ఆ నిర్మాణ సంస్థ సీఈఓ

Alia Bhatt: ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లాంటి హాలీవుడ్ చిత్రంలో తన యాక్షన్‌ను చూపించిన ఆలియా భట్.. ఇప్పుడు బాలీవుడ్‌లోని స్పై యూనివర్స్‌లో చేరి అలాంటి క్యారెక్టర్‌తోనే ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది.

Alia Bhatt in YRF Spy Universe: బాలీవుడ్‌లో సినిమాటిక్ యూనివర్స్‌లు అనేవి చాలా అరుదుగా తెరకెక్కుతుంటాయి. ఇక వాటన్నింటిలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్. ఇప్పటికే ఈ స్పై యూనివర్స్‌లో పలు చిత్రాలు వచ్చాయి. అవన్నీ బ్లాక్‌బస్టర్ హిట్లు అయ్యాయి. అయితే ఇందులో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ స్టార్ హీరోలతోనే తెరకెక్కాయి. కానీ మొదటిసారి ఈ స్పై యూనివర్స్‌లోకి ఒక హీరోయిన్ అడుగుపెట్టనుంది. తను మరెవరో కాదు.. ఆలియా భట్. ఈ విషయాన్ని వైఆర్ఎఫ్ సీఈఓ స్వయంగా ప్రకటించారు. ఇది తెలిసిన ఆలియా భట్ ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీలో ఉన్నారు.

అప్పుడే షూటింగ్ ప్రారంభం..

2024 చివరిలోపు ఆలియా భట్‌తో ఒక సినిమాను ప్రారంభిస్తున్నామని యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విధానీ ప్రకటించారు. అంతే కాకుండా ఇది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌కు చెందిన చిత్రమని కూడా బయటపెట్టారు. ముందుగా ఈ స్పై యూనివర్స్‌లో ‘టైగర్’ అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా ‘వార్’ తెరకెక్కింది. ఇక గతేడాది షారుఖ్ ఖాన్‌ నటించిన ‘పఠాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవన్నీ స్పై యూనివర్స్‌లో భాగమే. ఇందులో ప్రతీ సినిమా ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో ఆలియా భట్ చేరడం తన ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది.

అంతే చెప్పగలను..

తాజాగా యశ్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విధానీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన సంస్థ గురించి, అది తెరకెక్కించే సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ‘‘ఇండస్ట్రీలో దాచిపెట్టిన ఘోరమైన సీక్రెట్‌ను నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఆలియా భట్ స్పై యూనివర్స్‌లోని ఒక సినిమాలో లీడ్‌గా నటించనుంది. ఈ ఏడాది చివర్లో సినిమా షెడ్యూల్ ప్రారంభం కానుంది. మేము ఈ విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. ఇది మాత్రమే కాదు.. స్పై యూనివర్స్‌లో మరెన్నో ఆసక్తికర అంశాలు చేరనున్నాయి. మరెన్నో చిత్రాలు ఈ యూనివర్స్‌లో తెరకెక్కనున్నాయి. ప్రస్తుతానికి ఆలియా భట్ కూడా ఈ స్పై యూనివర్స్‌లో భాగమవుతుంది అని మాత్రమే చెప్పగలను’’ అని తెలిపారు అక్షయ్ విధానీ.

ఆ సినిమా పూర్తయ్యాక..

ఇక వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ విషయానికొస్తే.. ఈ సంస్థ భవిష్యత్తులో తెరకెక్కించాలని అనుకుంటున్న అన్ని సినిమాలతో ఒక ప్లాన్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్ 2’ తెరకెక్కించడానికి సిద్ధంగా ఉంది. దాని తర్వాత ‘టైగర్ వర్సెస్ పఠాన్’ అని మరో చిత్రం ప్లానింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఒకరితో ఒకరు తలపడనున్నారు. వాటితో పాటు ఆలియా భట్ కూడా ఇందులో చేరడం ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది. ప్రస్తుతం ఆలియా భట్ చేతిలో ‘జిగ్రా’ అనే చిత్రం ఉంది. ఈ సినిమాలో తను హీరోయిన్‌గా నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తను వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో చేరే అవకాశం ఉంది.

Also Read: నేనొక కోతిని, పవన్‌కు స్థిరత్వం లేదు - రామ్ గోపాల్ వర్మ

టాప్ హెడ్ లైన్స్

Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget