అన్వేషించండి

Akkineni Nagarjuna: అక్కినేని ఫ్యామిలీకి ఏమైంది? కొడుకుల వల్లే నాగార్జున సినిమాలకు దూరమయ్యారా?

‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత నాగార్జున మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు. అయితే మొన్నామధ్యలో మలయాళ హీరో జోజు జార్జి నటించిన సూపర్ హిట్ సినిమా ‘పొరింజు మరియం జోస్‌’ ను రిమేక్ చేస్తున్నారని తెలిసింది.

Akkineni Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయన ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ గత కొంత కాలంగా ఈ తండ్రీకొడుకులకు సరిగ్గా కలసి రావడం లేదు. హీరో నాగార్జున నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన నటించిన చివరి చిత్రం ‘ది ఘోస్ట్’. ఈ మూవీ ఆక్టోబర్ 2022 లో విడుదల అయింది. ఈ సినిమా తర్వాత నాగార్జున సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే మధ్యలో ఓ కథను ఓకే చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ మూవీ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి వార్తలు రాలేదు. దీంతో నాగార్జున కెరీర్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కినేని అభిమానులు.

రీమేక్ సినిమా ఓకే చేసిన నాగ్, కానీ..

‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత నాగార్జున మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు. అయితే మొన్నామధ్యలో మలయాళ హీరో జోజు జార్జి నటించిన సూపర్ హిట్ సినిమా ‘పొరింజు మరియం జోస్‌’ ను రిమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ మూవీకు దర్శకుడిగా ప్రసన్న కుమార్ బెజవాడ ను ఓకే చేశారని అన్నారు. ఈ మూవీ గురించి మే నెలలో అనౌన్స్ చేస్తారని, జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని అన్నారు. అయితే ఇప్పుడు జూన్ నెల అయిపోవస్తున్నా ఇంకా నాగ్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. దీంతో అసలు నాగార్జున సినిమాలు చేస్తారా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట అక్కినేని అభిమానులు. 

కొడుకుల్ని దారిలో పెట్టడానికేనా?

నాగార్జున హీరోగా తన కెరీర్ లో చాలా హిట్లు అందుకున్నారు. ఆయన తరువాత సినీ వారసులుగా వచ్చిన నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నాగ చైతన్య పలు హిట్ సినిమాల్లో నటించగా అఖిల్ సరైన హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. అయితే కొన్నేళ్ల నుంచి వీరి మావీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. రీసెంట్ గా అఖిల్ ‘ఏజెంట్’ మూవీతో మరో ఫ్లాప్ ను అందుకున్నారు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. కానీ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఇక నాగచైతన్య కూడా రీసెంట్ గా ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ‘మజిలీ’ సినిమా తర్వాత నాగచైతన్యకు సరైన హిట్ రాలేదు. మధ్యలో ‘బంగార్రాజు’ సినిమా కాస్త పర్వాలేదనిపించినా కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. దీంతో సీన్ లోకి నాగార్జున ఎంటర్ కావాల్సి వచ్చిందట. కొడుకులిద్దర్నీ సక్సెస్ ట్రాక్ లోకి పెట్టడంపైనే ప్రస్తుతం నాగార్జున దృష్టి పెట్టారట. స్క్రిప్ట్ సెలక్షన్ లో వారి వెనకుండి సపోర్ట్ చేస్తున్నారట. అందుకే నాగార్జున సినిమాలు లేట్ అవుతున్నాయని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ‘ది ఘోస్ట్’ తర్వాత నాగార్జున 6 నెలలు గ్యాప్ తీసుకుంటానని అన్నారు. కానీ ఇప్పుడు 8 నెలలు దాటుతుంది. మరి ఆయన ఫ్యాన్స్ కు మళ్లీ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో చూడాలి. 

Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget