అన్వేషించండి

అక్కినేని అఖిల్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకోబోతున్నాడా?

అక్కినేని అఖిల్ సర్జరీ చేయించుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్​లో తెగ వైరల్ అవుతుంది. ముక్కుకు సర్జరీ చేయించుకోవడం కోసం అఖిల్ విదేశాలకు వెళ్లబోతున్నట్లు సమాచారం.

అక్కినేని యంగ్ హీరో అఖిల్ సర్జరీ చేయించుకోబోతున్నారని ఓ న్యూస్ బయటికి రావడం హాట్ టాపిక్​గా మారింది. త్వరలోనే ఇందుకోసం విదేశాలకు కూడా వెళ్లబోతున్నారట. ఫిజిక్ పరంగా, లుక్స్ పరంగా అఖిల్ చాలా హ్యాండ్సమ్​గా ఉంటాడు. అలాంటిది సర్జరీ చేయించుకోవడం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. మరి అఖిల్ సర్జరీ వార్తల్లో నిజం ఎంత? డీటెయిల్స్​లోకి వెళ్తే.. కెరీర్ పరంగా అఖిల్ టైం అస్సలు బాలేదు. ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతోంది. ఇటీవల ఈ హీరో నటించిన 'ఏజెంట్' ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఏజెంట్'తో ఈ ఎడారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు అఖిల్.

నిజానికి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఓ రేంజ్​లో బాడీ పెంచాడు. అందుకోసం రకరకాల డైట్స్ మెయింటైన్ చేశాడు. అంత కష్టపడి సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్​కి చివరికి నిరాశ మిగిలింది. అఖిల్ మాత్రమే కాదు ఈ సినిమాతో నిర్మాత కూడా బాగా నష్టపోయాడు. అటు డైరెక్టర్ సురేందర్ రెడ్డికి సైతం బ్యాడ్ నేమ్ వచ్చింది. మొన్నటి వరకు 'ఏజెంట్' రిజల్ట్​తో డిప్రెషన్ లోకి వెళ్లిన అఖిల్ ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అఖిల్ తన తదుపరి చిత్రాన్ని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్​లో చేస్తున్నట్లు తెలుస్తోంది.

అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారట. ప్రభాస్ 'సాహో' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పని చేసిన అనిల్ అఖిల్​తో తీయబోయే సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం కాస్త పక్కన పెడితే అఖిల్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు ఫిలిం సర్కిల్స్​లో ప్రచారం ఊపందుకుంది. చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఎంతో హ్యాండ్సమ్ లుక్స్​తో కనిపించే అఖిల్ తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని అంటున్నారు. అఖిల్ తన ముక్కుకు సంబంధించి సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన త్వరలోనే ఫారిన్​కు వెళ్ళబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక సమాచారం లేకపోయినా సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఈ న్యూస్ తెలిసిన కొంతమంది అఖిల్​కి కాస్మోటిక్ సర్జరీ అనే న్యూస్ నిజం కాదని అంటున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఫిజిక్, లుక్స్ పరంగా ఎలా చూసినా అఖిల్ హాలీవుడ్ హీరోలా ఎంతో అందంగా ఉంటాడు. అలాంటిది సర్జరీ చేయించుకోవడమేంటి. పూర్తిగా ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. కాగా త్వరలోనే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. అఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం.

Also Read : మాసీగా సాయి ధరమ్ తేజ్ - 'గాంజా శంకర్'గా వచ్చేశాడోయ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget