అన్వేషించండి

Akhil Raj Delivery Boy: తాగొచ్చాడు... అమ్మను తిట్టాడు... ఫుడ్ డెలివరీ బాయ్‌ వివాదంపై అఖిల్ రాజ్ క్లారిటీ

Akhil Raj On Delivery Boy Issue: ఫుడ్ డెలివరీ బాయ్ మీద అఖిల్ రాజ్ చెయ్యి చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది. అతడిపై ఎందుకు చెయ్యి చేసుకోవాల్సి వచ్చిందో అఖిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌తో గొడవపడిన వీడియో వైరల్.
  • డెలివరీ బాయ్ తన తల్లిని దుర్భాషలాడటం వల్లే గొడవ అఖిల్ వివరణ.
  • డెలివరీ బాయ్ మద్యం తాగి తల్లిని తిట్టి, బ్లాక్ మెయిల్ చేశాడన్నాడు.
  • ఖండన వీడియోలో తనపై వచ్చిన ఆరోపణలు అఖిల్ రాజ్ తోసిపుచ్చాడు.

'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ (Akhil Raj Uddemari)పై ఇంటర్‌నెట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఆయన గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది. ఓ బాయ్‌ను అలా కొట్టడం ఏమిటి? అని అఖిల్ రాజ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో వివరణ ఇస్తూ అఖిల్ రాజ్ వీడియో విడుదల చేశారు.

డెలివరీ బాయ్ తాగొచ్చాడు...
ఇంకా మా అమ్మను తిట్టాడు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే... డెలివరీ బాయ్ తనది తప్పు అయ్యిందని సారీ చెబుతున్నా, అతనిపై అఖిల్ రాజ్ దాడి చేసినట్లు అర్థం అవుతోంది. ఇంకా డెలివరీ బాయ్ ముఖం మీద అఖిల్ తల్లి ఉమ్మి వేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై అఖిల్ రాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.

Also Read: Rahul Ravindran - రాహుల్ రవీంద్రన్ మెడకు పుణె కేతన్ అగర్వాల్ - సియా ఘోయల్ కేసు... ట్విట్టర్‌కు టాటా - ఎందుకంటే?

డెలివరీ బాయ్ మద్యం మత్తులో తమ అపోజిట్ అపార్ట్‌మెంట్‌లో 201 ఫ్లాట్‌కు ఇవ్వాల్సిన పార్శిల్‌ను తమ ఇంటికి తీసుకు వచ్చాడని అఖిల్ రాజ్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మా ఇంట్లోని నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేశారని మా నాన్నగారు అనుకొకున్నారు. ఆ పార్శిల్ తీసుకున్నారు. ఆ తర్వాత అది మా పార్శిల్ కాదని తెలిసింది. అప్పటికే మా అమ్మ దానికి ఓపెన్ చేశారు. ఆ తర్వాత విషయం తెలిసి పక్కన పెట్టారు. కాసేపటికి డెలివరీ బాయ్ వచ్చారు. మాది అనుకుని ఓపెన్ చేశామని మా అమ్మ చెప్పగా... 'ఎందే? ఫ్రీగా వస్తే తీసుకుందామని అనుకున్నావా?' అంటూ మాట్లాడాడు. పైగా తాగేసి ఉన్నాడు. మా అమ్మను అసభ్య పదజాలంతో దూషించాడు'' అని చెప్పారు.

Also ReadSudha Kongara Vs Parasakthi Producer Controversy: డబ్బులు ఎగ్గొట్టారు... తమిళ నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akhil Raj Uddemari (@akhilraj_uddemari)

తన తల్లిని అవమానించడంతో కొడుకుగా తాను రియాక్ట్ అయ్యానని, అంతే తప్ప డెలివరీ బాయ్ పట్ల తనకు ఎలాంటి చిన్నచూపు లేదని అఖిల్ రాజ్ స్పష్టం చేశారు. తాను గతంలో డెలివరీ బాయ్‌గా పని చేశానని, ఆ కష్టం తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు. డెలివరీ బాయ్ తప్పు చేయడమే కాకుండా... తిడతావేంటి? అని గట్టిగా అడిగినందుకు 'నువ్వు హీరో కదా! నిన్ను ఎలా వైరల్ చేస్తానో చూడు' అంటూ తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని అఖిల్ రాజ్ వివరించారు. వీడియో చూస్తే... తాను ఎక్కడా కొట్టలేదని, తనను తండ్రి ఆపుతున్నట్టు ఉంటుందని తెలిపారు. 

వైరల్ అవుతున్న చిన్న వీడియో క్లిప్‌ చూసి తన వ్యక్తిత్వాన్ని తప్పుగా అంచనా వేయవద్దని ప్రజలకు అఖిల్ రాజ్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఉదయం నుంచి తనపై విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ... తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులను ఎవరైనా తిడితే ఏం చేస్తారని అఖిల్ రాజ్ ప్రశ్నించారు.

Also ReadNTR x Trivikram Controversy - దేవుడికి ప్రాంతాన్ని అంటకడతారా? తెలుగు వర్సెస్ తమిళ్ గొడవ... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై కాంట్రవర్సీ... ఏమైందో తెల్సా?

Frequently Asked Questions

అఖిల్ రాజ్‌పై ప్రజలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు?

ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవ పడిన వీడియో వైరల్ కావడంతో అఖిల్ రాజ్‌పై ఇంటర్‌నెట్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. డెలివరీ బాయ్‌ను కొట్టాడని ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

డెలివరీ బాయ్‌తో గొడవకు అసలు కారణం ఏమిటి?

తాగిన డెలివరీ బాయ్ పక్క అపార్ట్‌మెంట్‌కు వెళ్లాల్సిన పార్శిల్‌ను అఖిల్ రాజ్ ఇంటికి తీసుకువచ్చాడు. పార్శిల్ తెరిచిన తర్వాత అది తమది కాదని తెలిసింది. దీనిపై డెలివరీ బాయ్ అఖిల్ తల్లిని దూషించడంతో గొడవ మొదలైంది.

ఈ వివాదంపై అఖిల్ రాజ్ ఏ వివరణ ఇచ్చారు?

డెలివరీ బాయ్ తాగొచ్చి తప్పుడు పార్శిల్ తమ ఇంటికి తెచ్చి తన అమ్మను అసభ్య పదజాలంతో దూషించాడని అఖిల్ రాజ్ తెలిపారు. తన తల్లిని అవమానించడంతోనే తాను స్పందించానని చెప్పారు. తాను కొట్టలేదని కూడా వివరించారు.

అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌ను కొట్టారా?

వైరల్ అవుతున్న వీడియోలో తాను ఎక్కడా కొట్టలేదని అఖిల్ రాజ్ స్పష్టం చేశారు. తనను తండ్రి ఆపుతున్నట్టు ఉంటుందని ఆయన తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని తప్పుగా అంచనా వేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget