News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Aishwarya Rajesh: జస్ట్ మిస్, ఐశ్వర్యా రాజేష్‌‌పై దాడి చేయబోయిన డాల్ఫిన్ - వీడియో వైరల్

ప్రస్తుతం కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ కూడా ఆస్ట్రేలియాలో తన హాలిడేను ఎంజాయ్ చేస్తోంది. ఆ హాలిడేలో తను డాల్ఫిన్స్‌తో ఆడుకోవడానికి ప్రయత్నించిన ఒక క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

FOLLOW US: 
Share:

సినీ పరిశ్రమలో నటీనటుల జీవితం ఎక్కువశాతం బిజీబిజీగా గడిచిపోతుంది. చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తి చేయాలి, వెంటవెంటనే సినిమాలు ఒప్పుకోవాలి, తమ ఫ్యాన్స్‌ను సినిమాలతో ఖుషీ చేయాలి.. ఇలా వారిపై చాలా ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి బిజీ లైఫ్‌లోనే కాస్త ఖాళీ సమయాన్ని చూసుకొని హాలిడేస్‌కు చెక్కేసే వారు కూడా ఉన్నారు. కొందరు నటీనటులు అయితే ఎన్ని కమిట్‌మెంట్స్ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదికి ఒకసారి అయినా హాలిడేస్‌కు వెళ్లాలని అనుకుంటారు. ప్రస్తుతం కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ కూడా ఆస్ట్రేలియాలో తన హాలిడేను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె డాల్ఫిన్స్‌తో ఆడుకోవడానికి ప్రయత్నించిన ఒక క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఆ డాల్పిన్ ఐశ్వర్యపై దాడికి ప్రయత్నించింది. దీంతో ఆమె ఒక్కసారే కంగారు పడింది. ఆ తర్వాత భయంతోనే దాన్ని టచ్ చేస్తూ.. ఫొటోలు, వీడియోలకు పోజులిచ్చింది.

ట్రావెల్.. షూట్.. రిపీట్..
ఐశ్వర్య రాజేశ్.. ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తోంది. తన చివరి చిత్రం ‘ఫర్హానా’ విడుదలైన తర్వాత లాస్ వేగస్ వెళ్లొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక అక్కడి నుండి వచ్చిన తర్వాత ‘డియర్’ మూవీ షూటింగ్‌లో బిజీ అయిపోయింది. ‘డియర్’ కోసం మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాశ్‌తో మొదటిసారి జోడీ కడుతోంది ఈ భామ. ఇక వారం క్రితమే ‘డియర్’ షూటింగ్ ముగిసింది. దీంతో తనకు వెంటనే మరో హాలిడే కావాలని అనిపించిందో ఏమో.. వెంటనే ఆస్ట్రేలియా చెక్కేసింది. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ ‘జీవించడం అంటే ప్రయాణించడమే’ అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఐశ్వర్యకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో మరోసారి ప్రూవ్ అయ్యింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)

అందమైన అనుభవం..
ఇక మెల్బోర్న్‌లో చక్కర్లు కొడుతున్న ఐశ్వర్య రాజేశ్.. తాజాగా ఆస్ట్రేలియాలో ఉండే సీ వరల్డ్ అనే మెరీన్ పార్క్‌ను సందర్శించింది. ఇక్కడ అన్ని రకాల నీటి జంతువులు ఉంటాయి. అదే సమయంలో తను ఒక డాల్ఫిన్‌తో ఆడుకోవడానికి ప్రయత్నించింది. కానీ దానిని ముట్టుకోబోయి భయపడింది. ఇదంతా తను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో డాల్ఫిన్‌తో పాటు ఐశ్వర్య కూడా చాలా క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ‘డాల్ఫిన్స్‌ను చూడడం, వాటితో ఆడుకోవడం అందమైన అనుభవాన్ని ఇచ్చింది’ అంటూ సీ వరల్డ్‌కు థ్యాంక్స్ చెప్పింది ఐశ్వర్య. 

మలయాళంలో కూడా బిజీ..
ఓవైపు ట్రావెలింగ్‌లో బిజీగా ఉంటూనే తన అప్‌కమింగ్ కమిట్‌మెంట్స్‌పై కూడా దృష్టిపెడుతోంది ఐశ్వర్య రాజేశ్. మాలీవుడ్ యాక్టర్ జోజూ జార్జ్‌తో కలిసి ‘పులిమాడా’ అనే మలయాళ మూవీని కమిట్ అయ్యింది ఈ భామ. ఏకే సాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల జోజూ జార్జ్ నటించిన సెన్సేషనల్ చిత్రం ‘ఇరట్టా’కు ఇది సీక్వెల్ అని మాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమయితే.. ‘ఇరట్టా’ కారణంగా ‘పులిమాడా’కు కూడా హైప్ లభిస్తుందని, సినిమా బాగుంటే అదే రేంజ్‌లో హిట్ కూడా అవుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. తాజాగా ‘పులిమాడా’ టైటిల్ పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. దీనికి ట్యాగ్‌లైన్‌గా ‘సెంట్ ఆఫ్ ఉమెన్’ అని ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేశ్‌కు.. ‘పులిమాడా’తో కూడా ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.

Also Read: అక్షయ్‌తో కలిసి ‘OMG 2’ మూవీ చూసిన సద్గురు - ఆయన రివ్యూ ఇదే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 09 Aug 2023 10:26 AM (IST) Tags: Aishwarya Rajesh Travel Kollywood pulimada dear movie

ఇవి కూడా చూడండి

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'