అన్వేషించండి

Shruti Haasan Marriage: శృతి హాసన్ నీ పెళ్లి ఎప్పుడు? అదేంటీ.. అలా సమాధానం ఇచ్చింది?

Shruti Haasan Marriage: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పెళ్ళి గురించి చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇదే విషయంపై ఆమె తాజాగా మాట్లాడింది.

Shruti Haasan Marriage: దక్షిణాది అగ్ర కథనాయికల్లో శృతి హాసన్ ఒకరు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందాల భామ.. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో శృతి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె ప్రేమాయణం, డేటింగ్, పెళ్లి గురించిన ఎన్నో రూమర్స్ నెట్టింట హల్ చల్ చేశాయి. వీటిపై సలార్ బ్యూటీ ఇప్పటికే పలు సందర్భాల్లో క్లారిటీ ఇవ్వగా.. తాజాగా మరోసారి తన వివాహంపై స్పందించింది. 

శృతి హాసన్ ఇటీవల తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ తో కలిసి ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో రొమాంటిక్ సీన్స్‌లో లోకేష్, శ్రుతి రెచ్చిపోయి నటించడం హాట్ టాపిక్ అయింది. ఈ మ్యూజిక్ వీడియో గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోనే శృతి హాసన్ మ్యారేజ్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 

మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోబోతున్నారని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ఏమో తెలియదు సార్ అని శృతి హాసన్ బదులిచ్చింది. నిజానికి శృతికి ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయిందని ఆ మధ్య పుకార్లు పుట్టుకొచ్చాయి. తన బాయ్‌ ఫ్రెండ్ శాంతను హజారికాను ఆమె సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్హాన్ అవత్రమణి ఓ ఇంటర్వ్యూలో శాంతనును శృతి భర్తగా ప్రస్తావించడంతో ఈ రూమర్స్ ఊపందుకున్నాయి.  

Also Read: 'ఫ్యామిలీ స్టార్' కు పోటీగా 'మంజుమ్మల్‌ బాయ్స్‌'

ఈ నేపథ్యంలో శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. వాటిల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పింది. తన గురించి తెలియని వాళ్లు కాస్త నోరు మూసుకొని ఉంటే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. "నేను పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయంలోనూ ఓపెన్ గా ఉండే నేను నా పెళ్లి విషయం ఎందుకు దాచి పెడతాను? కాబట్టి నా గురించి తెలియని వాళ్లు కాస్త నోరు మూసుకుంటే మంచిది" అని శృతి పోస్ట్ పెట్టింది.

వాస్తవానికి శృతి హాసన్ గతంలో లండన్‌ కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌ తో డేటింగ్ చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయిన తర్వాత శాంతను హజారికాతో శ్రుతి రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్లుగా చెప్పుకుంటారు. తరచుగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో వీరి ప్రేమాయణంపై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.

ఓసారి శృతి హాసన్ తన ఇన్స్టా చిట్ చాట్ లో హజారిక గురించి ఓపెన్ అయింది. శాంతను తనకు 2018లోనే తెలుసని.. కానీ తాము 2020లో కలుసుకున్నామని తెలిపింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలపై మాట్లాడుతూ.. తన దగ్గర ఎలాంటి రహస్యాలు లేవని, పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే మరుక్షణమే ఆ విషయం అందరికీ చెప్పేస్తానని చెప్పింది. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని పేర్కొంది. ఇప్పుడు తాజాగా పెళ్ళి ప్రస్తావన రాగా, ఎప్పుడు చేసుకుంటానో తెలియదని స్పష్టం చేసింది.

Also Read: ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు - రామ్ చరణ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Upcoming Movies: జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'
జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Sandeep Reddy Vanga : సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
Raakh Series OTT : ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Embed widget