Namitha: ఎన్నికల ప్రచారంలో హీరోయిన్ నమిత - పూల వర్షం కురిపించిన స్థానికులు, వీడియో వైరల్
Namitha Election Compaign Video: హీరోయిన్ నమిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. లోక్‌సభ ఎన్నికలో భాగంగా ఆమె బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరింది.
Actress Namitha Election Campaign in Chennai Video: దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల రాజకీయ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల ప్రచారాలు ఆసక్తికరంగా మారాయి. ఆయా రాజకీయ పార్టీ తరపున పలువురు సినీ తారలు రంగంలోకి దిగుతున్నారు. అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా నటి నమిత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మొదలుపెట్టింది. బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్న నమిత ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంది. బీజేపీ లోక్‌సభ విన్నింగ్ క్యాండిడేట్ శ్రీ వినోజ్ పీ సెల్వం అవర్గల్‌కు మద్దతుగా నమిత ప్రచారం చేసింది. ఈ క్రమంలో నిన్న రాత్రి చెన్నైలోని నుగంబకం, అన్నాగర్ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ ప్రచారంలో పాల్గొని సందడి చేసింది. ఈక్రమంలో నమితను చూసేందుకు స్థానికులంతా భారీ తరలివచ్చారు.
ఇక ఆమె క్యాంపైన్ వాహనంలో నుంచి చేయి ఊపుతూ ఓటర్లను పలకరిస్తుండగా.. ఆమెపై స్థానికుల పూల వర్షం కురిపించారు. ప్రస్తుతం నమిత ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తమిళనాట బీజేపీకి నమితతో పాటు ఖుష్బు, ప్రముఖ నటుడు శరత్ కుమార్‌లు పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే చెన్నై స్థానిక పార్టీ అన్నాడీఎంకే తరపున సినీ తారల నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. ఈ పార్టీ ప్రచారం కోసం కోలీవుడ్ అగ్రనటీనుటలంతా ప్రచారం మొదలుపెట్టారు. నటి వింధ్య, గౌతమి, గాయత్రి రఘురామ్, నటులు రవి, సింగముత్తు, ఆర్ సుందరరాజన్ ఇలా తదితరులు అన్నాడీఎంకే తరపున ప్రచారం చేస్తున్నారు. ఇక డీఎంకే కూటమికి మద్దతుగా లోకనాయకుడు కమల్ హాసన్, వాగై చంద్రశేఖర్ వంటి అగ్ర నటులు మద్దతుగా ప్రచారం మొదలుపెట్టారు. ఇక కాంగ్రెస్‌కు తరపున నటి విజయశాంతి ప్రచారంలో పాల్గొంటున్నారు.
View this post on Instagram
హీరో విజయ్ పై నమిత పోటీ..
ఇదిలా ఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై నటి నమిత చేసిన కామెంట్స్ తమిళనాట హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ హీరో విజయ్‌కి పోటీ తాను ఎమ్మెల్యేగా పోటీకి దిగుతానంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ సంచలనం అయ్యాయి. ఇటీవల మీడియా సమావేశంలో నమిత మట్లాడుతూ.. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంది. అయితే తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేసినప్పుడే రాజకీయ ఎదుగుదల ఉంటుందని, అందుకే తాను హీరో విజయ్‌పై పోటీ చేయాలనుకుంటున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే విజయ్ సైతం రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నానంటు పేర్కొంది. ఈ స్టేట్‌మెంట్‌తో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రెండేళ్లు ముందే రసవత్తరంగా మారాయి. అంతా 2026లో ఎన్నికల వేడి ఎలా ఉండబోతుందా? అని కొందరు అంచనాలు వేసుకుంటుంటే విజయ్ ఫ్యాన్స్ మాత్రం నమిత కామెంట్స్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ పోటీ చేస్తే నమితకు కనీస డిపాజిట్ కూడా రాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.