అన్వేషించండి

Actress Kasthuri: ఆ సంస్థ కోసమే ఆ ఫొటోలు, వాటిని లీక్ చేసివారికి విలువల్లేవు - ఫొటోషూట్‌పై నోరువిప్పిన కస్తూరి

సినిమా పరిశ్రమలో కమిట్మెంట్స్ గురించి వస్తున్న వార్తలపై సీనియర్ నటి కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మీడియాకు అదో కాసులు కురిపించే ఐటెమ్ గా మారిపోయిందన్నారు.

Actress Kasthuri About Commitments: తనకు నచ్చింది చెప్పడంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటుంది సీనియర్ నటి కస్తూరి శంకర్. నెటిజన్లనే కాదు, సినీ పరిశ్రమలో ఉన్న వారిని సైతం ఏకిపారేయడంలో ముందుంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే అని తేల్చి చెప్తున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న వారిని ఎదిరించడం వల్ల సమస్యలు వస్తాయాని తెలిసినా, తగ్గేది లేదంటారు కస్తూరి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు.

తానెప్పుడూ అవాస్తవాలు ప్రచారం చేయలేదని చెప్పారు. “నేను ఎప్పుడైనా నిజమే చెప్తాను. ఫేక్ విషయాలు చెప్పుడూ చెప్పను. నేను అడిగే ప్రశ్నలు కూడా వ్యాలిడ్ గా ఉంటాయి. కొన్నిసార్లు నేను అడిగే ప్రశ్నలు కొన్నిసార్లు కొంత మందిని ఇబ్బంది పెట్టొచ్చు.. పెట్టనీయండి. నేను ఎప్పుడూ మర్యాద లేకుండా మాట్లాడలేదు. ప్రకాష్ రాజు గారే దానికి ఉదాహరణ. ఆయనకు ఓ పొలిటికల్ ఐడియాలజీ ఉంది. తను ఎవరినైనా ఏకవచనంతో మాట్లాడుతారు. పెద్ద పెద్ద వారి గురించి కూడా ఆయన అలాగే మాట్లాడుతారు. అలాంటి ఆటిట్యూడ్ నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలంటే మర్యాదగా చెప్పాలి. క్రిటిసైజ్ తప్పులేదు. కానీ, చెప్పేవిధానం పద్దతిగా ఉండాలి. నువ్వు దొంగ అని కాకుండా మీరు దొంగ అనండి. నా మాటలు నాకు సినిమా అవకాశాలు రాకుండా చేసి ఉండవచ్చు. అయినా, నిజం మాట్లాడకుండా ఉండలేను. ఇప్పుడు నాకు అవకాశాలు వచ్చినా ఓకే. రాకపోయినా ఓకే” అని చెప్పుకొచ్చారు.

మీటూ ప్రచారం అంతా మీడియాలోనే - కస్తూరి

సినిమా పరిశ్రమలో కమిట్మెంట్ ఘటనలు కేవలం ప్రచారాలేనని చెప్పారు. మీడియా రేటింగ్ కోసం చేసే ప్రచారం తప్ప ఏమీ లేదన్నారు. “మీటూ ఘటనలు, కమిట్మెంట్ ఘటనలు అప్పుడు లేవు. ఇప్పుడు లేవు. కేవలం మీడియాలోనే ఉన్నాయి. ఎక్కడో ఒక్కచోట జరిగిన ఘటనను పూర్తి ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదన్నారు. ఇలాంటి వార్తలు అప్పుడూ రాసేవాళ్లు. ఇప్పుడూ రాస్తున్నారు. మీడియాకు అదో డబ్బులు కురిపించే టాపిక్. అందులో వాస్తవం అనేది చాలా తక్కువగా ఉంటుంది” అని వెల్లడించారు.

విలువలు పాటించకుండా ఆ ఫోటోలు పబ్లిష్ చేశారు- కస్తూరి

ఇక తన కొడుకుని ఎత్తుకుని చేసిన ఫోటో షూట్ కాంట్రవర్శియల్ కావడం పట్ల కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొడుకును ఎత్తుకుని చేసిన ఫోటో షూట్ బాగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోలను పబ్లిష్ చేసే విషయంలో మీడియా ఎలాంటి ఎథిక్స్ పాటించలేదు. ఆ ఫోటోలను పబ్లిష్ చేసేందుకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. డెలివరీ తర్వాత తల్లుల బాడీ మొత్తం మారిపోతుంది. దాని మీద అవగాహన కల్పించేందుకే ఆ ఫోటో షూట్ చేశాను. అది కూడా ‘అమెరికన్ విమెన్’ కోసం చేశాను. ఆ ఫోటోలను ఇక్కడ పబ్లిష్ చేసిన ఏ సంస్థను నేను గౌరవించను. ఆ సంస్థలకు ఎలాంటి ఎథిక్స్ లేవు. వాటిలో కొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ఒకే ఒక్క సంస్థ నన్ను పర్మిషన్ అడిగింది. నేను ఇచ్చాను. ఆ పత్రిక కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో వార్త రాసింది. ఇక్కడ ఏదైనా మంచి విషయం కోసం ప్రయత్నం చేసినా చెడుగా మాట్లాడుతారు. ట్రోల్ చేస్తారు” అని కస్తూరి వివరించారు.

Read Also: నా భర్త నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే నేను దురదృష్టవంతురాలిని ఎలా అవుతాను - రేణు దేశాయ్

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బీభత్సం చేసేసిన కంటెస్టెంట్స్! యుద్ధంలో ప్రేమ! నిజంగానే రోహిత్, షాలిని లవ్‌లో ఉన్నారా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బీభత్సం చేసేసిన కంటెస్టెంట్స్! యుద్ధంలో ప్రేమ! నిజంగానే రోహిత్, షాలిని లవ్‌లో ఉన్నారా!
Mayookha Telugu Trailer: ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
ముక్కలుగా గుర్తు తెలియని శవం... ఊళ్ళో కోళ్లు మాయం... పాయల్ చెంగప్ప 'మయూఖ' ట్రైలర్ ఎలా ఉందంటే?
Dorothy Controversy: ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
ఎల్‌జీబీటీక్యూ యాంగిల్‌లో చూడొద్దు... కీర్తీ సురేష్ సినిమా క్లైమాక్స్‌ కాంట్రవర్సీపై డైరెక్టర్ రియాక్షన్
Anakapalli Movie: మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్
మా కంటే ఆయనకు సినిమా పిచ్చి ఎక్కువ... వీవీ వినాయక్

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget