Zombie Reddy 2 Upendra : జాంబీల వరల్డ్‌లో ఉపేంద్ర - జాంబీ రెడ్డి 2లో మాంత్రికుడిగా ఇంటెన్స్ లుక్ వేరే లెవల్
Upendra Zombie Reddy 2 : యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న జాంబీ రెడ్డి 2లో నటుడు ఉపేంద్ర లుక్ రివీల్ చేశారు. ఆయన బర్త్ డే సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు.

Upendra First Look From Teja Sajja Zombie Reddy Sequel : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తోన్న మూవీ జాంబీ రెడ్డి 2 (Zombie Reddy 2). 2021లో వచ్చిన జాంబీరెడ్డికి సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్టులో నటుడు ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తుండగా... శుక్రవారం ఆయన బర్త్ డే సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ రివీల్ చేశారు.
జాంబీల ప్రపంచంలో భయంకరంగా...
సినిమాలో ఉపేంద్ర (Upendra) ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఓ మాంత్రికుడి రూపంలో జడలతో చేతిలో కత్తితో చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న మాస్ ఇంటెన్స్ లుక్ ట్రెండ్ అవుతోంది. 'జాంబీ రెడ్డి 2లో మునుపెన్నడూ చూడని అవతార్‌తో సరికొత్త రకమైన ఉన్మాదం, భయంకరత్వం, విధ్వంసాన్ని ఆవిష్కరించబోతున్నాడు.' అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆయన రోల్ వేరే లెవల్లో ఉండబోతోందని అర్థమవుతోంది.
కరోనా తర్వాత 2021లో థియేటర్లలోకి వచ్చిన జాంబీరెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 'జాంబీరెడ్డి'తోనే తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హిట్ కాంబో స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ పార్ట్‌కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా... తేజ సజ్జా, ఆనంది, దక్షా నగార్కర్ నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్, కక్షలు, కోవిడ్ నేపథ్యంతో పాటు హారర్, కామెడీ అంశాలను కూడా టచ్ చేయడంతో భారీ విజయం సాధించింది.
ఇప్పుడు సీక్వెల్‌కు సుపర్ణ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా... ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస్తున్నారు. తేజ సజ్జాతో పాటు షనయా కపూర్, ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ స్టోరీ అందిస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను మించి సూపర్ థ్రిల్లింగ్ అంశాలతో సెకండ్ పార్ట్ ఉండబోతోందని గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది.
Wishing the Real Star @nimmaupendra a very Happy Birthday 💥#ZombieReddy2 NXT LVL will unleash a whole new flavour of madness, menace & mass with his never-before-seen avatar ❤️🔥🧟♂️
— People Media Factory (@peoplemediafcy) September 18, 2026
Superhero @tejasajja123 @Suparn @PrasanthVarma #ShanayaKapoor @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/pSPSdlozwY
ట్రెండింగ్ వార్తలు























