అన్వేషించండి

చిరంజీవి స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా, ఆయన నన్ను తమ్ముడిలా చూస్తారు: శ్రీకాంత్

మెగాస్టార్ ఫ్యామిలీ మ్యాన్ అని, ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీలో చాలా మంది వచ్చారని నటుడు శ్రీకాంత్ చెప్పారు. అందులో తానూ ఒకడినేనన్న ఆయన.. అన్నయ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లు కూడా బాగా కష్టపడతారని చెప్పారు

Megastar B'day: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సినీ నటుడు శ్రీకాంత్ మేక పాల్గొన్నాడు. సినిమాల్లోకి రావడానికి మెగాస్టారే స్ఫూర్తి అని ఎప్పుడూ చెప్పే శ్రీకాంత్.. ఈ వేదికపైనా ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ఆయనను రోల్ మోడల్ గా తీసుకుని ఇండస్ట్రీకి చాలా మంది వచ్చారని, ఆయనొక ఫ్యామిలీ మ్యాన్ (Family Man) అని చిరంజీవి గురించి శ్రీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఆగస్టు 22 వచ్చిందంటే చాలు.. ఇంట్లో వాళ్లకే కాదు ఫ్యాన్స్ అందరిలోనూ ఓ పండగ వాతావరణ నెలకొంటుందని అందరికీ తెలిసిందే. ప్రతీ సంవత్సరం ఇలా మెగాస్టార్(Megastar) పుట్టినరోజును ఒక పండగలా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ తో నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేనే కాదు నాలా చాలా మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్లు కూడా ఆయన్ను రోల్ మోడల్ గా తీసుకుని వచ్చినవారే. తల్లిదండ్రుల్ని ప్రేమించేవాళ్లు భార్యాపిల్లల్ని ప్రేమిస్తారు. అలాగే తోబుట్టువులను ప్రేమిస్తారు. వాళ్లందరినీ ప్రేమించేవారు ఖచ్చితంగా అభిమానుల్ని కూడా ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తి మన అన్నయ్య. అభిమానుల్ని కూడా ఓ తమ్ముడిగా ట్రీట్ చేసే గుణం ఆయనకుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేనొక అభిమానిగా ఆయన్ని ఫస్ట్ కలిసి.. నేను మీ అభిమానిని అని అన్నపుడు.. ఆయన అభిమానిలా కాకుండా ఓ తమ్ముడిలా అక్కున చేర్చుకున్నారు. ఆయన సినిమాలు చూసి నేను కూడా హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. అలాగే ఆయన ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీకి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో మాటల్లో చెప్పలేం. ఆ విషయంలోనూ ఆయన రోల్ మోడల్ గానే ఉంటారు" అని శ్రీకాంత్ చెప్పారు.

"కరోనా సమయంలోనూ తన సామాజిక సేవలతో ఎంతో మంది సాయం చేశారు. నేను హీరో అయినా ఇప్పుటికీ నేను ఆయన అభిమానినే. డబ్బులుండొచ్చు. కానీ కష్టాన్ని నమ్ముకున్నోడు ఎప్పటికైనా సక్సెస్ అవుతారని మెగాస్టార్ ను చూసి ఆయన ఫ్యామీలీ నుంచి వచ్చిన నటులు కూడా నేర్చుకున్నారు. ఈ రోజు నేను ఆయన అభిమానిని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది" అని శ్రీకాంత్ అన్నారు. 

ఇక శ్రీకాంత్ (Srikanth) సినిమాల విషయాలకొస్తే.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన ఆయన.. ఇటీవలి కాలంలో పలు పాత్రలు పోషిస్తూ సినిమాల్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న'కోట బొమ్మాళి .. పీఎస్ (Kotabommali PS)' అని సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 నుంచి రాబోతున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గతంలో జోహార్, అర్జున ఫాల్గుణ చిత్రాలను రూపొందించిన తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నాడు. 

Read Also : Vennela Kishore: వెన్నెల కిషోర్ హీరోగా ‘చారీ 111’ - బుర్రలేని స్పైగా నవ్విస్తాడట, ఇదిగో ప్రోమో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Vijay Deverakonda Rashmika : విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ రష్మిక - విరోష్ కపుల్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా 'రణబాలి'
విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ రష్మిక - విరోష్ కపుల్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా 'రణబాలి'
This Week OTT Movies : దసరా పండక్కి ఓటీటీల్లో సినిమాల సందడి - 'ది ప్యారడైజ్' To డోరతీ... ఈ బ్లాక్ బస్టర్ మూవీస్ డోంట్ మిస్
దసరా పండక్కి ఓటీటీల్లో సినిమాల సందడి - 'ది ప్యారడైజ్' To డోరతీ... ఈ బ్లాక్ బస్టర్ మూవీస్ డోంట్ మిస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Cult Trailer Review : మాస్ కా దాస్ విశ్వక్ విశ్వరూపం - 'కల్ట్' వయలెన్స్ వేరే లెవల్... ఇది మరో స్క్విడ్ గేమ్
మాస్ కా దాస్ విశ్వక్ విశ్వరూపం - 'కల్ట్' వయలెన్స్ వేరే లెవల్... ఇది మరో స్క్విడ్ గేమ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Embed widget