అన్వేషించండి

Naveen Chandra: ఆ జనాన్ని చూసి షాకయ్య - అప్పుడే ప్రభాస్‌లా హీరో అవ్వాలనుకున్నా: నవీన్ చంద్ర

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ క్రేజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Actor Naveen chandra about Prabhas Craze : పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలామంది ప్రభాస్ కి 'బాహుబలి' తర్వాతే క్రేజ్ వచ్చిందని అంటుంటారు. కానీ బాహుబలికి ముందే ప్రభాస్ కి మాస్ ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఫాలోయింగ్ ఉందని యంగ్ హీరో నవీన్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లోనే ప్రభాస్ క్రేజ్ చూసి తాను షాక్ అయిపోయానని, అది చూసిన తర్వాతే తాను కూడా హీరో అవ్వాలని ఫిక్స్ అయినట్లు తెలిపాడు. దీంతో ప్రభాస్ ఫాలోయింగ్ గురించి నవీన్ చంద్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

'వర్షం' 50 డేస్ ఫంక్షన్‌కు వచ్చిన జనాన్ని చూసి షాక్ అయ్యా

నవీన్ చంద్ర లీడ్ రోల్ లో 'ఇన్స్పెక్టర్ రిషి' అనే సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్ చంద్ర ప్రభాస్ క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు తెలిపాడు. "అప్పట్లో ‘వర్షం’ సినిమా 50 రోజుల ఫంక్షన్ భీమవరంలో చేసినప్పుడు ఓ సాంగ్ పెర్ఫార్మ్ చేయడానికి వెళ్లాను. అప్పటికి ప్రభాస్ మహా అయితే నాలుగైదు సినిమాలు చేసుంటారు. కానీ ‘వర్షం’ 50 రోజుల ఫంక్షన్‌కు దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనం వచ్చి ఉంటారు. వాళ్లని చూసి నేను షాక్ అయిపోయా. అంతేకాదు ఆ రోజే నేను కూడా హీరో అవ్వాలని ఫిక్సయి సినిమాల్లోకి వచ్చి ఇప్పటికీ మంచి మంచి కథల కోసం చూస్తూనే ఉన్నా" అంటూ చెప్పాడు.

'వర్షం'తో మాస్‌లో భారీ ఫాలోయింగ్

'ఈశ్వర్' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కి 'వర్షం' సినిమాతోనే మొదటి కమర్షియల్ సక్సెస్ దక్కింది. అంతేకాదు ఈ సినిమాతోనే ప్రభాస్‌కు మాస్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. శోభన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో మూడో సినిమా. 2004 సంక్రాంతికి చిరంజీవి 'అంజి', బాలకృష్ణ 'లక్ష్మీనరసింహ' సినిమాలతో పాటు రిలీజ్ అయిన 'వర్షం' థియేటర్స్ లో ఏకంగా 175 రోజుల పాటు ఆడి ప్రభాస్ ని మాస్ హీరోని చేసింది. 'వర్షం' 175 డేస్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. అప్పుడు ఒకే వేదికపై కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్ ముగ్గురు కనిపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు.

సినిమాలు, వెబ్ సిరీస్‌‌లతో పాటూ క్యారెక్టర్ రోల్స్ కూడా

నవీన్ చంద్ర ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకుంటున్నాడు. మామూలుగా హీరోగా అవకాశాలు వస్తున్నప్పుడు ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు కొంతమంది హీరోలు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ నవీన్ చంద్ర అందుకు భిన్నంగా తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కంప్లీట్ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

Also Read : శ్రీలీల ప్లేస్‌లో కొత్త హీరోయిన్ - రౌడీ హీరో సరసన 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ!

టాప్ హెడ్ లైన్స్

Hanuman Ansh Collections : హనుమాన్ అంశ్ వరల్డ్ వైడ్ 400 కోట్లు - తెలుగు వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
హనుమాన్ అంశ్ వరల్డ్ వైడ్ 400 కోట్లు - తెలుగు వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Poonam Kaur Trivikram Srinivas : నా ఫ్యామిలీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారు - MAA ఎందుకు ప్రశ్నించడం లేదు?... త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి ఫైర్
నా ఫ్యామిలీ బలహీనతను ఆసరాగా చేసుకున్నారు - MAA ఎందుకు ప్రశ్నించడం లేదు?... త్రివిక్రమ్‌పై పూనమ్ మరోసారి ఫైర్
Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
Comrade Kalyan Day 1 Collection : కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్
కామ్రేడ్ కల్యాణ్ ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీ విష్ణు కొత్త మూవీకి తొలి రోజు సాలిడ్ నెంబర్స్

వీడియోలు

Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget