Madhavan: బ్రిక్స్టన్ క్రోమ్వెల్ 1200 బైక్ కొన్న మొదటి భారతీయుడిగా మాధవన్... ఆ బైక్ ధర ఎంతో తెలుసా?
Brixton Cromwell 1200 price in India: బ్రిక్స్టన్ క్రోమ్వెల్ 1200 బైక్ కొన్న మొదటి భారతీయుడిగా మాధవన్ చరిత్ర సృష్టించారు. ఆ బైక్ ధర ఎంతో తెలుసా ?

సెలబ్రిటీలకు కోట్లాది మంది అభిమానులు ఉంటారన్న విషయం తెలిసిందే. అలాగే వాళ్లకు ప్రత్యేకమైన అభిరుచులు కూడా ఉంటాయి. ముఖ్యంగా కాస్ట్లీయస్ట్ బైక్ లు, కార్లు అంటే ఇష్టపడే సెలబ్రిటీ ఉండడు. కొత్తగా వచ్చే కార్, బైక్ మోడల్స్ పై స్టార్స్ కన్ను ఉంటుంది. పైగా లిమిటెడ్ వెర్షన్ కార్లు, బైకులు కొని, తమ గ్యారేజీలో కొలువుదీరేలా చూసుకుంటుంటారు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ మాధవన్ బ్రిక్స్టన్ క్రోమ్వెల్ 1200 బైక్ ను కొన్న మొట్టమొదటి ఇండియన్ గా చరిత్రను సృష్టించారు.
మాధవన్ చేతిలో బ్రిస్టన్ క్రోమ్ వెల్ బైక్
కోలీవుడ్ స్టార్ మాధవన్ ఇప్పటికీ 58కి పైగా సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్నారు. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న మాధవన్ ఎక్కువగా సినిమాలతోనే వార్తల్లో నిలుస్తారు. తాజాగా సినిమాలతో కాకుండా బ్రిక్స్టన్ క్రోమ్ వెల్ బైక్ కారణంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ బైక్ బ్రాండ్ ఇండియాలో తమ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ బ్రాండ్ కు చెందిన ఫస్ట్ బైక్ డెలివరీ మాధవన్ కు చేరడంతో, దాన్ని సొంతం చేసుకున్న మొట్టమొదటి ఇండియన్ గా మాధవన్ నిలవడం విశేషం. అలాగే మాధవన్ ఈ సందర్భంగా బైక్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
మాధవన్ మాట్లాడుతూ "ఈ బైక్ నా పర్సనాలిటీకి తగ్గట్టుగా, టైం లెస్ స్టైల్ తో ఉండడం సంతోషంగా ఉంది. ఈ బైక్ కొన్న ఫస్ట్ ఇండియన్ నేనే కావడం, అందులోనూ ప్రత్యేకమైన పెయింట్ స్కీం, బైక్ పై నా కొడుకు వేదాంత్ పేరు ఉండడం మరింత ఆనందాన్నిస్తోంది" అని అన్నారు. ఇక సదరు బైక్ బ్రాండ్ తమ అఫీషియల్ అనౌన్స్మెంట్లో మాధవన్ తమ ఫస్ట్ కస్టమర్ కావడం గర్వంగా ఉందని వెల్లడించింది.
అత్యంత కాస్ట్లీ బైక్
ఇక ఇప్పటికే ఇండియాలో పలు ఖరీదైన బైకులు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ బైక్ ధర ఏకంగా రూ.7,84,000 ఉంది. చూడడానికి రెట్రో స్టైల్ లాగా ఉన్న ఈ బైక్ లో నిస్సాన్ బ్రేక్స్, బోస్ ఏవీఎస్, కేవైబి అడ్జస్టబుల్ సస్పెన్షన్ సిస్టం వంటి సేఫ్టీ అండ్ సుపీరియర్ హ్యాండ్లింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
Sports. Drama. And a hat-trick of a cast. This pitch is all set for this test of life 🏏💥
— Netflix India (@NetflixIndia) February 3, 2025
TEST, a sports drama starring @ActorMadhavan, @NayantharaU, and #Siddharth is coming soon, only on Netflix.#TEST#TESTOnNetflix#NextOnNetflixIndia pic.twitter.com/1cRwMcBfsv
కాగా మరోవైపు మాధవన్ గత ఏడాది 'షైతాన్' అనే హర్రర్ మూవీతో పేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా 'హిసాబ్ బరాబర్' అనే సిరీస్ లో ఆయన కనిపించారు. ఇందులో కీర్తి కుల్హరి, నీల్ నితిన్ ముఖేష్, రష్మీ దేశాయ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే మాధవన్ 'టెస్ట్' అనే అప్ కమింగ్ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సిద్ధార్థ్ తో కలిసి నటిస్తున్నారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే రిలీజ్ కాబోతోంది.
Also Read: నా ఆటోగ్రాఫ్ రీ రిలీజ్... రవితేజ స్వీట్ మెమరీస్ థియేటర్లలోకి మళ్లీ వచ్చేది ఎప్పుడంటే?





















