అన్వేషించండి

JD Chakravarthy: బ్రహ్మానందం వల్ల చాలా టార్చర్ అనుభవించా - జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్

ప్రముఖ హీరో జె.డి చక్రవర్తి ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పటి టాలీవుడ్ హీరో జె.డి చక్రవర్తి గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా అప్పట్లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలోనే మళ్లీ నటుడిగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తాజాగా 'దయ' అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవల రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జెడి చక్రవర్తి.. కమెడియన్ బ్రహ్మానందం తనకు టార్చర్ చూపించారంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. దీనికి సంబంధించిన జెడి చక్రవర్తి ఓల్డ్ ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జెడి చక్రవర్తి కెరియర్లో వచ్చిన 'మనీ' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం పోషించిన 'ఖాన్ దాదా' పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జెడి చక్రవర్తి, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ గా 'మనీ మనీ మోర్ మనీ' అనే సినిమాను స్వయంగా జెడి చక్రవర్తి తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్లో బ్రహ్మానందం తనకు టార్చర్ చూపించారంటూ జె.డి చక్రవర్తి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ మేరకు చక్రవర్తి మాట్లాడుతూ.."మనీ మనీ మోర్ మనీ.. సినిమా చేసేటప్పుడు చాలామంది నన్ను బ్రహ్మానందాన్ని ఈ సినిమా కోసం తీసుకోవద్దని అన్నారు. కానీ నేనే పట్టుబట్టి మరీ బ్రహ్మానందంను సినిమాకి కోసం కావాలని అన్నాను. ఆ సమయంలో నాతో బ్రహ్మానందం గురించి చాలా చెప్పారు. బ్రహ్మానందం టైంకి షూటింగ్ కి రాడు. వ్యానిటీ వ్యాన్లు అడుగుతాడు. హోటల్ నుంచి రకరకాల ఆర్డర్లు తనకే కాదు తన పక్కవాళ్లకు కూడా చెప్తాడు. తొమ్మిదిన్నర, పదింటికి వస్తాడు. 12 గంటలకు బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రేక్ మనం ఇవ్వం. తను తీసుకుంటాడు. ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్. మళ్లీ 3 గంటలకు వస్తాడు. 4 గంటలకు వెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడు. డైలాగ్ లేకపోతే ట్రాలీలు, స్టడీక్యామ్ షాట్లు ఉంటే చేయడు" అంటూ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారంటూ తెలిపారు.

‘‘ఆ తర్వాత ఫస్ట్ డే షూటింగ్ 9 గంటలకని బ్రహ్మానందానికి చెబితే సరైన సమయానికి వచ్చారు. ఇంకా ఆయన రాగానే నేను ఇది మీ కాస్ట్యూమ్. ఇది వేసుకోవాలి అంటే, ఆయన స్వయంగా కొన్ని కాస్టమ్స్ తెచ్చుకుని ఇందులో నచ్చింది వేసుకుందాం అని నాతో అన్నారు. నేను సరే అన్నాను. మొదటిరోజు షూటింగ్ ఎలాగోలా పూర్తయింది. కానీ ఆ తర్వాత ఆయన ఎలాగో షూటింగ్ కి లేట్ వస్తారని తెలిసి అంతకంటే ముందే మేము కొన్ని సీన్స్ షూట్ చేయాలని ప్లాన్ చేసుకుంటే ఆయన తొందరగా వచ్చేసేవారు. అలా నా ప్లానింగ్ అంతా తారుమారు అవుతుండేది. అలా డైలీ నేను ఆయన వల్ల టార్చర్ అనుభవించానంటూ చెప్పుకొచ్చారు జే.డి చక్రవర్తి. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనలో మార్పు వచ్చిందని షూటింగ్ సమయంలో నాకు ఎంతో సపోర్ట్ చేశారంటూ బ్రహ్మానందం పై పొగడ్తలు సైతం కురిపించారు. దీంతో ప్రస్తుతం జేడీ చక్రవర్తి ఓల్డ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతోంది.

Also Read : 'జైలర్' స్టోరీ లీక్ - రజినీకాంత్‌కు ఈసారి హిట్ పక్కా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget