Abhinaya: ఆయనంటే నాకు చాలా ప్రేమ - విశాల్‌తో పెళ్లి రూమర్స్‌పై స్పందించిన అభినయ
హీరో విశాల్, అభినయ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారంటూ గతకొంతకాలంగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై విశాల్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ అభినయ మాత్రం తాజాగా వీటిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది.
అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. సినిమాల్లో నటించడం అంత సులభం కాదు.. దానికి చాలా లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, అందం ఉండాలి.. ఇలా చాలా చెప్తుంటారు. కానీ మాటలు రాకపోయినా, వినికిడి లోపం ఉన్నా.. నటి అవ్వొచ్చు అని నిరూపించింది అభినయ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా.. ఇలా ఎన్నో పాత్రలు, ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అభినయ.. తాజాగా తన తండ్రితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో పలువురు నటీనటులపై తన అభిప్రాయాలు చెప్తూ.. విశాల్‌తో ప్రేమ, పెళ్లి అనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు అభినయ.
పిచ్చోడు అన్నారు..
అభినయ తండ్రి ఆనంద్.. పలు తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినా.. అది పూర్తిస్థాయిలో సాధించలేకపోయానని బాధపడ్డారు. తాను చేయలేని పని తన కూతురు చేసిందని గర్వంగా చెప్పారు. అంతే కాకుండా తన కూతురిని హీరోయిన్ చేయాలని ఫోటోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘చాలామంది కోపడ్డారు. మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు పిచ్చోడు అంటూ రకరకాలుగా మాట్లాడారు. కానీ దేవుడి దయ ఉంది. ఆ దేవుడే సముద్రఖని. ఆయన లేకుంటే అభినయ లేదు ఇండస్ట్రీలో’’ అని సముద్రఖని చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు.
రజినీకాంత్ సెల్యూట్..
సముద్రఖని ఫోటో చూపించగానే.. ఆయన నా గాడ్ ఫాదర్ అని సైన్ లాంగ్వేజ్‌లో చూపించింది అభినయ. సముధ్రఖనితో అభినయ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఎవరి వల్ల అభినయకు ఇబ్బంది కలగకూడదని, అందరూ తనతో నవ్వుతూ ఉండాలని సముద్రఖని తన టీమ్‌కు గట్టిగా చెప్పారని అభినయ తండ్రి ఆనంద్ బయటపెట్టారు. అభినయ చేసిన సినిమాను చూసిన రజినీకాంత్.. ఆ నటి పేరు ఏంటో నాకు తెలియదు కానీ తనకు నేను సెల్యూట్ చెప్పానని చెప్పండి అన్నారని గర్వంగా చెప్పారు ఆనంద్. సమంత ఫోటో చూపించగానే.. తన ఆరోగ్యం బాగాలేదని తెలిసిందని, తను కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తానని చెప్పింది అభినయ. ఇక మహేశ్, వెంకటేశ్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసినా కూడా వారితో ఎక్కువగా మాట్లాడలేదని తెలిపింది. ఎప్పుడూ వారు బిజీగా ఉండేవారని చెప్పింది.
ఆయనంటే నాకు చాలా ప్రేమ..
చివరిగా విశాల్‌తో అభినయ దిగిన ఫోటోను చూపించి.. విశాల్‌తో తనకున్న బంధం గురించి చెప్పమన్నారు. ‘‘15 ఏళ్లు అనుకుంటా ఆ టైమ్‌లో మొదటిసారి నేను విశాల్ సినిమా చూశాను. అప్పటినుండి నేను పెద్ద ఫ్యాన్. ఆయనంటే నాకు చాలా ప్రేమ. ఎప్పుడూ కలవాలని అనుకుంటాను కానీ ఆయనను కలవడం చాలా కష్టం. మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయనతో కలిసి పనిచేశాను. అందరు అంటున్నారు ఏంటి అభినయ, విశాల్ పెళ్లి చేసుకుంటున్నారని నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. అలాంటిది ఏమీ లేదు. ఆయన చాలా మంచివారు. అందరితో కలిసి ఉండాలని ఎప్పుడూ చెప్తుంటారు’’ అని విశాల్‌తో పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది అభినయ. ‘లాఠీ’ సినిమా ప్రతీ రిలీజ్ సమయంలో యాంకర్ చేసిన వ్యాఖ్యల వల్లే విశాల్, అభినయ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది తప్పా నిజంగా అలాంటిది ఏమీ లేదన్నారు అభినయ తండ్రి ఆనంద్.
Also Read: నాగార్జున, నాగచైతన్య అసలు పట్టించుకోరు - ఎన్నో అవమానాలు చూశా: ఎడిటర్ మార్తాండ్ షాకింగ్ కామెంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial