Coolie Movie: రజినీ కాంత్ 'కూలీ' నుంచి బిగ్ సర్ ప్రైజ్ - ఫైనల్ క్యారెక్టర్ రివీల్ చేసిన మేకర్స్... థ్రిల్ కొనసాగేనా?
Rajinikanth Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబో అవెయిటెడ్ మూవీ 'కూలీ' నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో ఫైనల్ క్యారెక్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

Aamir Khan Look Released From Coolie: సూపర్ స్టార్ రజినీ కాంత్ అవెయిటెడ్ మూవీ 'కూలీ'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ నుంచి తాజాగా బిగ్ సర్ ప్రైజ్ రివీల్ చేశారు మేకర్స్. ఫైనల్ క్యారెక్టర్‌ను రిలీజ్ చేశారు.
బాలీవుడ్ స్టార్... సూపర్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ రజినీకాంత్ 'కూలీ'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదివరకూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా... వాటిని తాజాగా మూవీ టీం కన్ఫర్మ్ చేసింది. 'కూలీ నుంచి ఆఖరి పాత్ర 'దాహా' వచ్చేసింది.' అంటూ 'X'లో రాసుకొచ్చింది. మూవీలో ఆమిర్ లుక్ ఆకట్టుకుంటోంది. చేతిలో సిగార్‌తో మాస్ లుక్‌లో డాన్ పాత్రలో ఆమిర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ క్యారెక్టర్ అంటూ డిఫరెంట్‌గా రివీల్ చేసి హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఆమిర్ లుక్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Introducing #AamirKhan as Dahaa, from the world of #Coolie 😎⚡#Coolie is all set to dominate IMAX screens worldwide from August 14th 🔥@rajinikanth @Dir_Lokesh @anirudhofficial @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @anbariv @girishganges… pic.twitter.com/Z8pI5YJzRe
— Sun Pictures (@sunpictures) July 3, 2025
Also Read: 'ఆంధీ వచ్చేసింది' - పవన్ 'హరిహర వీరమల్లు'లో మోదీ డైలాగ్... పవర్ స్టార్ పవర్ అట్లుంటది మరి
సూపర్ థ్రిల్ కొనసాగేనా...
సూపర్ స్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ అంటేనే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. రజినీ కాంత్ ఆమిర్ ఖాన్ చివరిసారిగా 29 ఏళ్ల క్రితం వచ్చిన 'ఆతంక్ హై ఆతంక్' అనే మూవీలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ రూపొందించగా... 'దాహా' రోల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
'కూలీ' స్టోరీని మలుపు తిప్పేలా ఆయన రోల్ ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'విక్రమ్' క్లైమాక్స్‌లో లోకేశ్ 'రోలెక్స్' నెగిటివ్ పాత్రలో సూర్యను ఎంట్రీ చేసి సూపర్ థ్రిల్ అందించారు. ఆ సీన్ మూవీకే హైలైట్‌గా నిలవడంతో పాటు సీక్వెల్‌పై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 'కూలీ'లోనూ ఆమిర్ ఎంట్రీ అలానే ఉంటుందని... ఇంపార్టెన్స్, డిఫరెంట్ రోల్ అయితే తప్ప ఆమిర్ సినిమాను ఒప్పుకోరంటూ పేర్కొంటున్నారు. ఈ మూవీ 'ఎల్‌సీయూ' (లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్)లో భాగం కాదని చెబుతున్నా భారీ స్టార్స్ నటిస్తుండడంతో ఏదో ఒక రోల్ కనెక్ట్ అయి ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్
ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మించారు. తలైవాతో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సౌబిన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్ 'చికిటు' ట్రెండింగ్‌గా మారింది. ఆగస్ట్ 14న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.
మూవీలో 'కూలీ నెంబర్ 1421'గా దేవా పాత్రలో సందడి చేయనుండగా... కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా... ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ మూవీని తీసుకొస్తున్నారు.





















