అన్వేషించండి

Mahaan Trailer: మందు సామ్రాజ్యానికి మహారాజుగా విక్రమ్.. మాస్‌గా కొడుకు.. మహాన్ ట్రైలర్ వచ్చేసింది!

విక్రమ్, ధృవ్ విక్రమ్‌ల మహాన్ సినిమా ట్రైలర్ విడుదల అయింది.

తమిళ స్టార్ హీరో విక్రమ్, తన కొడుకు ధృవ్ విక్రమ్ నటించిన ‘మహాన్’ సినిమా ట్రైలర్‌ను అమెజాన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిమ్రాన్, బాబీ సింహా కీలక పాత్రల్లో కనిపించారు.

స్కూల్లో టీచర్‌గా పని చేసే విక్రమ్‌ను తన స్టూడెంట్స్ మహాన్ అని వెక్కిరించే సీన్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయింది. విక్రమ్ తన తండ్రి లక్ష్యం కోసం పని చేస్తున్నాడని మిగతా పాత్రధారులతో చెప్పిస్తారు. విక్రమ్ భార్య పాత్రలో సిమ్రాన్ కనిపించింది. మద్య నిషేధ పోరాటాన్ని ముందుండి నడిపించే వ్యక్తి.. మద్యం సిండికేట్ లీడర్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో సినిమా రూపొందిందని ట్రైలర్ బట్టి తెలుస్తోంది.

ఇక తండ్రి అంటే పడని పాత్రలో ధృవ్ విక్రమ్‌ను చూపించారు. ‘ఏపీ మందు సామ్రాజ్యానికి మహారాజు నా బాబు’ అనే డైలాగ్‌తోనే ధృవ్ విక్రమ్ పాత్ర ఎలా ఉండనుందో తెలిపారు. అయితే ధృవ్ విక్రమ్ పాత్రలో చాలా ఇంటెన్సిటీ కూడా కనిపిస్తుంది. తన బాడీ బిల్డింగ్, యాక్షన్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో చూపించారు.

ట్రైలర్ చివర్లో విక్రమ్ తెల్ల పంచె, తెల్ల చొక్కా వేసుకుని మహాత్మా గాంధీ విగ్రహంతో నడుచుకుంటూ వెళ్లడం చూపించారు. అంటే చివరికి హీరో మారిపోయాడని కూడా ట్రైలర్‌లోనే చూపించారన్న మాట. సాధారణంగా హీరో చివరికి మారాడా.. లేడా.. అనేది సస్పెన్స్‌గా ఉంచుతారు. దీన్ని కొత్తరకం అప్రోచ్ అనుకోవచ్చు. 

కార్తీక్ సుబ్బరాజ్ ముందు సినిమా 'జగమే తంత్రం' కూడా ఓటీటీలోనే విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు 'మహాన్' కూడా ఓటీటీకే వెళ్తుంది. ఈ సినిమాను మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. ఇటీవల తమిళ పెద్ద హీరోల సినిమాలు ఓటీటీవైపు చూపులు చూస్తున్నాయి. ధనుష్ హీరోగా నటించిన ‘మారన్’ కూడా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్ కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dhruv (@dhruv.vikram)

టాప్ హెడ్ లైన్స్

Horror Comedy OTT : డ్యాన్స్ చేసే దెయ్యాలు - ఓటీటీలో భయపెట్టే మ్యూజికల్ హారర్ కామెడీ... తెలుగులోనూ చూడొచ్చు
డ్యాన్స్ చేసే దెయ్యాలు - ఓటీటీలో భయపెట్టే మ్యూజికల్ హారర్ కామెడీ... తెలుగులోనూ చూడొచ్చు
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Comedy Thriller OTT : ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ - 'దృశ్యం'ను తలపించే ట్విస్టులు... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
Embed widget