అన్వేషించండి

Chiranjeevi-Rajinikanth:‘బాషా’ కోసం చిరంజీవిని కాదని మోహన్ బాబుకు ఓకే చెప్పిన రజనీకాంత్, ఆ తర్వాత ఏం జరిగిందంటే!

రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘బాషా’. 1995లో విడుదలై సంచనల విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తెలుగు రీమేక్ కు సంబంధించి దర్శకుడు సురేష్ కృష్ణ గతంలో చేసిన కీలక వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ కెరీర్ లోనే అద్భుత విజయాన్ని అందుకున్న చిత్రం ‘బాషా’. మాఫియా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. అద్భుత నటనకు తోడు చక్కటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. 1995 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘బాషా’ చిత్రం, 28 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఈ చిత్రం తెలుగు రీమేక్ కు సంబంధించి దర్శకుడు సురేష్ కృష్ణ గతంలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

‘బాషా’ తెలుగు రీమేక్ కు నో చెప్పిన చిరంజీవి!

రజనీకాంత్ ‘బాషా’ చిత్రం అప్పట్లో ఏకంగా ఏడాది పాటు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా  రూ. 35 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే సరిపోతారని సురేష్ కృష్ణ తెలిపారు. నిజానికి ఈ సినిమాలోని ‘బాషా’ పాత్రకు ఆయన మాత్రమే సరైన న్యాయం చేస్తారని చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాట్లాడిన ఆయన, మెగాస్టార్ చిరంజీవితో తెలుగు రీమేక్ చేయాలని భావించినట్లు చెప్పారు. ఆ సమయంలో చిరంజీవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, తెలుగు రీమేక్ రైట్స్ విషయంలో అల్లు అరవింద్ తో బేరం కుదురకపోవడంతో వదులుకున్నట్లు చెప్పారు.  

మోహన్ బాబు పేరును సూచించిన రజనీకాంత్

చిరంజీవి ‘బాషా’ రీమేక్ కు నో చెప్పడంతో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేస్తే ఎలా ఉంటుంది? అని రజనీకాంత్ దర్శకుడు సురేష్ కృష్ణకు అడిగారట. అయితే, ఈ సినిమా రీమేక్ కు చిరంజీవి, ఆయన కంటే ఎక్కువ స్టార్ డమ్ ఉన్న హీరో అయితే బాగుంటుందని చెప్పారట. ఈ నేపథ్యంలో ఆ మూవీ రీమేక్ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయాయట. ‘బాషా’ చిత్రాన్ని డబ్బింగ్ వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారట. ఈ సినిమా తెలుగులోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. రజనీకాంత్ మార్కెట్ ఈ సినిమాతో టాలీవుడ్ లో బాగా విస్తరించింది. ఇక ఇప్పుడున్న తమిళ స్టార్ హీరోలలో ఏ హీరోతో ‘బాషా’ చిత్రాన్ని తీస్తే బాగుంటుంది అనే ప్రశ్నకు దర్శకుడు సురేష్ కృష్ణ అజిత్ కుమార్ అని చెప్పడం విశేషం.

బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ‘భోళా శంకర్’- బిగ్గెస్ట్ హిట్ గా ‘జైలర్’   

ఇక తాజాగా చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’, రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అయ్యాయి. ‘భోళా శంకర్’ చిత్రం చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలువగా, ‘జైలర్’ మూవీ ఏకంగా రూ. 600 కోట్లు వసూళు చేసి రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత డిజాస్టార్‌గా నిలవగా, రజనీకాంత్ జైలర్ సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసి ఆయన కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది.

Read Also: దసరాకి 3 సినిమాలకే అల్లాడిపోతే, సంక్రాంతికి అర డజను చిత్రాలు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Hrithik Roshan : హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
హృతిక్ రోషన్‌తో టాలీవుడ్ డైరెక్టర్? - కాంతార మేకర్స్ ప్రాజెక్టుపై క్రేజీ బజ్
Venky Anil 5 : అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Bandla Ganesh : అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget