By: ABP Desam | Updated at : 28 Jan 2023 12:17 PM (IST)
'బుట్ట బొమ్మ'లో సూర్య వశిష్ఠ, అనేఖా సురేంద్రన్, అర్జున్ దాస్
'బుట్ట బొమ్మ' పేరులో తెలుగుదనం ఉంది. 'బుట్ట బొమ్మ' ట్రైలర్‌లోనూ అచ్చమైన తెలుగుదనం కనిపించింది. అరకు నేపథ్యంలో అందమైన ప్రేమ కథగా చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ చూస్తే... కథను క్లియర్ కట్ ఫార్మటులో చెప్పేశారు.
అరకులో ఓ అమ్మాయి అనేఖా సురేంద్రన్. ఆమెకు తండ్రి అంటే భయం. ఫోనులో పరిచయమైన అబ్బాయి సూర్య వశిష్టతో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడతారు. ఆ తర్వాత కలిసి తిరుగుతారు. అది అర్జున్ దాస్ చూస్తారు. అతడికి ఆ ప్రేమ నచ్చదు. ఎందుకు? అతడిని నుంచి తప్పించుకోవాలని ఇంటి నుంచి పారిపోయిన హీరో హీరోయిన్లకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ట్రైలర్ మొత్తం మీద ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, సంభాషణలు హైలైట్. ''మీ ఫ్రెండా? పేరు ఏంటి?'' అని జగదీష్ అడిగితే ''సొంగ తుడుచుకో! చెల్లి అవుతుంది'' అని అమ్మాయి కోపంగా చెప్పడం... ''ఈడొచ్చిన దానివి ఇంట్లో పడి ఉండు. ఎవడి కంట్లోనూ పడకు'' అని తండ్రి హెచ్చరిస్తే ''మరి లైన్ కట్టేసి ఉన్నారు అక్కడ! నేను ఎప్పుడు రోడ్డు మీదకు వస్తానా?'' అని అనేఖా సురేంద్రన్ విసుక్కోవడం... ''పిచ్చి కాదు, ప్రేమ''... ''మనం వీడియో చూసి ప్రేమిస్తాం కదా! వాడు రేడియో చూసి ప్రేమిస్తాడు'' డైలాగులు బావున్నాయి. బీచ్, సెల్ ఫోనులు సినిమాలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. 'బుట్ట బొమ్మ'తో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయం అవుతున్నారు.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
'బుట్ట బొమ్మ' అంటే మన తెలుగు ప్రేక్షకులకు పూజా హెగ్డే గుర్తుకు వస్తారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన 'అల వైకుంఠపురములో' సాంగ్ అంత సూపర్ హిట్ మరి. ఇప్పుడు 'బుట్ట బొమ్మ' పేరుతో సినిమా నిర్మించింది హారిక అండ్ హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు.
ఫిబ్రవరి 4న 'బుట్ట బొమ్మ' విడుదల
తొలుత జనవరి 26న 'బుట్ట బొమ్మ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే, విడుదలకు ఐదు రోజుల ముందు ఫిబ్రవరి 4కు వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఫీల్ గుడ్ రూరల్ లవ్ డ్రామాగా రూపొందిన చిత్రమిది.
Also Read : దేవుడి గదిలో దిష్టిబొమ్మ - ఆ 16 మంది తలలు ఏమయ్యాయ్?
అనేఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, నవ్యా స్వామి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాలో 'పుష్ప' జగదీష్, ప్రేమ్ సాగర్, రాజ్ తిరందాసు, 'మిర్చి' కిరణ్, నర్రా శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వంశీ పచ్చిపులుసు, సంభాషణలు : గణేష్ కుమార్ రావూరి, కూర్పు : నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ : వివేక్ అన్నామలై, నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య, దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్.
Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్
NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?
Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ
Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్
Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?
SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్ 204
Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్