అన్వేషించండి

Solanki Diwakar: కూటి కోసం కోటి తిప్పలు- అప్పుడు పాపడాలు, ఇప్పుడు పండ్లు అమ్ముతున్న బాలీవుడ్ నటుడు

ఆయుష్మాన్ ఖురానా, ప్రియాంక చోప్రా లాంటి స్టార్ యాక్టర్లతో కలిసి నటించి ఓ బాలీవుడ్ యాక్టర్ ఇప్పుడు పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్నాడు. తోపుడు బండి మీద పండ్లు పెట్టుకుని అమ్ముతున్నాడు.

Solanki Diwakar: చాలా మంది యువతీ యువకులు సినిమాల్లోకి రావాలని భావిస్తారు. నటీనటులుగా మారేందుకు హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తినేందుకు తిండి, ఉండేందుకు ఇల్లు లేకపోయినా సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవకాశాల కోసం తిరుగుతారు. కానీ, అందరికీ అవకాశాలు దక్కవు. కొంత మంది మాత్రమే నటులుగా రాణిస్తారు. వెండితెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తారు. అలాంటి వారిలో ఒకరు నటుడు సోలంకి దివాకర్.

జీవనోపాధి కోసం పండ్లు అమ్ముతున్నదివాకర్

బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, హీరోయిన్ ప్రియాంక చోప్రాతో పాటు పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించారు సోలంకి దివాకర్. చక్కటి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. వాటిలో చాలా సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. నటుడిగా ఆయనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. కానీ, ఇప్పుడు అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. బతుకుబండి లాగించేందుకు పండ్ల బండి నడుపుతున్నాడు. 

సినిమాల్లోకి రాకముందు పాపడ్ లు అమ్మిన దివాకర్

సినిమాల్లోకి రాకముందు సోలంకి దివాకర్, థియేటర్లలో విరామ సమయంలో పాపడ్ లు అమ్మేవాడు. అదే సమయంలో నటనపై మక్కువ పెంచుకున్నాడు. నెమ్మదిగా సినిమాల్లో ప్రయత్నించి అవకాశాలు దక్కించుకున్నారు. కానీ, ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో జీవనోపాధి కోసం పండ్లు అమ్ముతున్నట్లు చెప్పాడు సొలంకి. సినిమాల ద్వారా నా కుటుంబ పోషణకు సరిపడ డబ్బులు వచ్చినా, పండ్లు అమ్మేవాడిని కాదన్నారు. ఎన్నో సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నా, అవకాశాలు ఇచ్చేవారు లేరని చెప్పారు. అందుకే, వేరే మార్గం లేక పండ్లు అమ్ముతున్నట్లు తెలిపారు. నిజానికి సోలంకి దివాకర్ కరోనా సమయంలోనూ పండ్లు అమ్మాడు. కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమ మూతబడటంతో జీవనోపాధి కోసం ఆయన పండ్లు అమ్మాడు. వచ్చిన డబ్బుతో కుటుంబ సభ్యులను పోషించాడు. సినిమాలల్లో నటిస్తూనే, అవకాశాలు రానప్పుడు పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. 

‘తిత్లీ’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

2014లో ‘తిత్లీ’ చిత్రంతో సోలంకి దివాకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన వెడ్డింగ్ కార్డ్ కుర్రాడి పాత్రను పోషించాడు. ఆ తర్వాత ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘డ్రీమ్ గర్ల్’, ప్రియాంక చోప్రా ‘ది వైట్ టైగర్’తో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘సోంచిరియా’ చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ నటించిన ‘బ్రీత్: ఇంటు ది షాడోస్’ వెబ్ సిరీస్‌ లో సెక్యూరిటీ గార్డుగా కనిపించాడు. ‘తాండవ్‌’ వెబ్ సిరీస్ తోనూ మంచి గుర్తింపు పొందారు. ఆయన చివరగా షాహిద్ కపూర్ హీరోగా నటించిన హిట్ మూవీ ‘బ్లడీ డాడీ’ కీలక పాత్ర పోషించాడు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Solanki Diwakar (@solanki_diwakar)

Read Also: విషమంగా విజయ్‌ ఆంటోని హీరోయిన్‌ ఆరోగ్య పరిస్థితి - వెంటిలెటర్‌పై చికిత్స, డబ్బుల్లేక ఆర్థిక సాయం కోసం ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Lenin Collections : 100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
Srinivasa Mangapuram Review - 'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?
'శ్రీనివాస మంగాపురం' రివ్యూ: ఘట్టమనేని వారసుడు... మహేష్ అన్నయ్య కొడుకు సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget