అన్వేషించండి

Bigg Boss Season 7: గుక్కపెట్టి ఏడ్చేసిన అమర్, ప్రశాంత్- ఫ్లోలో నిజం ఒప్పేసుకున్న శివాజీ!

బిగ్ బాస్ హౌస్ లో త్యాగాల పరంపర కొనసాగుతోంది. కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులు తమ ప్రియమైన వారి దగ్గర నుంచి వచ్చిన లేఖలు తోటి వారికోసం త్యాగం చేసి చింపేస్తున్నారు.

బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటి వరకు ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, తిట్టుకోవడం మాత్రమే చూస్తూ వచ్చాం. ఇప్పుడు వారిలోని ప్రేమని బయట పడింది. కెప్టెన్సీ టాస్క్ కోసం తమ తోటి వారి మీద చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. తమకి ఇష్టమైన వారి దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని కూడ త్యాగం చేశారు. కెప్టెన్సీ టాస్క్ లో  భాగంగా బిగ్ బాస్ చిట్టి ఆయిరే అంటూ ఫిట్టింగ్ పెట్టాడు. ఇంటి దగ్గర నుంచి కంటెస్టెంట్స్ కి ఉత్తరాలు వచ్చాయి. అయితే జంటలుగా ఉన్న కంటెస్టెంట్స్ తమ తోటి వారి కోసం వాళ్ళకి వచ్చిన లేఖని చింపేయాల్సి ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్లో యావర్, తేజ ఒకరికోసం మరొకరు త్యాగం చేస్తూ ఏడిపించేశారు. పాత సినిమాల్లో స్నేహాన్ని గుర్తుకు తెచ్చారు. యావర్ తేజ కోసం త్యాగం చేయగా, గౌతమ్ కోసం శుభశ్రీ తనకి వచ్చిన లేఖని చింపేసింది. ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఏముందంటే..

అమర్ దీప్, సందీప్ వంతు వచ్చింది. బిగ్ బాస్ ఇంటికి వచ్చాకే తనకి విలువలు, ప్రేమ గురించి తెలిసి వచ్చిందని అమర్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో అడుగుతున్నానని సందీప్ నిన్ననే చెప్పాడు. తన తల్లి దగ్గర నుంచి వచ్చిన లెటర్ చదవాలని ఉందని చెప్పేసరికి అమర్ తన భార్య తేజస్వీ దగ్గర నుంచి వచ్చిన లేఖని త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. తేజుకి ఇప్పటి వరకు ఏం చేయలేదు. తనని సరిగా చూసుకున్నానో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని విలువలు తెలిసి వచ్చాయి. కన్నని చూడగానే తనే పిలిచినట్టు అనిపించింది. తేజు ఐయామ్ సోరి. నీ విలువ తెలిసిందని వెక్కి వెక్కి ఏడ్చాడు.

Also Read: త్యాగజీవి తేజాకు యావర్ షాక్ - పాత సినిమాల్లో స్నేహితుల్లా గుండెలు పిండేసిన బడ్డీస్!

ఇక శివాజీ ప్రశాంత్ కోసం తన భార్య దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు. ఎక్కడి నుంచో వచ్చావ్. రాగానే హగ్ ఇచ్చావ్. నీకోసం నా భార్య దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని గివ్ అప్ చేస్తాను. నా భార్యని నేను బాగా చూసుకున్నానో లేదో తెలియదు కానీ తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది” అని శివాజీ తనకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్ ని చింపేయడానికి రెడీ అయిపోయాడు. ప్రశాంత్ అది చూసి గుక్క పట్టి ఏడ్చేశాడు. ఇక నిన్న జరిగిన టాస్క్ లో గౌతమ్, టేస్టీ తేజ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.  

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన సమయంలో శివాజీ తనకి పెళ్లి కాలేదని టేస్టీ తేజతో అబద్దం చెప్పి ఆడేసుకున్నాడు. దీంతో కొందరు ప్రేక్షకులు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యారు. కానీ నాగార్జున స్టేజ్ మీద అడిగినప్పుడు తన భార్య పేరు శ్వేత అని చెప్పారు. అప్పట్లో పెళ్లి కాలేదని బుకాయించిన శివాజీ ఇప్పుడు టాస్క్ లో మాత్రం నిజం కక్కేశాడు. తనకి పెళ్లి అయ్యిందని ఒప్పేసుకున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget