అన్వేషించండి

Bigg Boss 6 Telugu: అనుకున్నట్టే ఇనయా సుల్తానా అవుట్ - మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన నాగార్జున

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అవుతుందని అనుకున్న ఇనయా సుల్తానా ఎలిమినేట్ అయింది.

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌లో ఎప్పుడు, ఏం అవుతుందో చెప్పడం కష్టం. అలాగే టాప్ 3 కంటెస్టెంట్ అనుకున్న ఇనాయ 14వ వారం అనూహ్యంగా బయటికి వచ్చేసింది. ప్రేక్షకులకు, ఇంటి సభ్యులకు కూడా ఇది నమ్మకం కష్టమే అయింది. 99వ ఎపిసోడ్ మొదలవ్వగానే నాగార్జున చుమ్మా దే చుమ్మాదే పాటతో వేదిక మీదకు వచ్చారు. మొదట ఇంటి సభ్యులతో ఆటలు ఆడించారు. ‘మీకు ఎంత తెలుసు’ అనే ఆట ఆడించారు. అందులో బిగ్ బాస్ ఇంటి గురించి ప్రశ్నలు అడిగారు. ఎవరు ముందు గంట కొడితే వారు జవాబులు చెప్పచ్చు. గెలుచుకున్న వారికి బహుమతి కూడా ఉంది. ఇందులో బాత్రూమ్‌లో ఎన్ని పూలకుండీలు ఉన్నాయి?, గార్డెన్లో ఎన్ని డంబెల్స్ ఉన్నాయి? లాంటి ప్రశ్నలు అడిగారు. ఇందులో రేవంత్ విజేతగా నిలిచాడు. ఆయనకు గిఫ్ట్‌ను అందించారు. మధ్యమధ్యలో ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. తరువాత రోహిత్ సేవ్ అయినట్టు చెప్పారు. 

తరువాత మరో ఆట ఆడించారు. పాట ఇస్తే ఆ పాటను స్టెప్పులతో వివరించాలి. మిగతా వాళ్లు చెప్పాలి. ఈ ఆట ఫన్నీగా నడిచింది. ఆదిరెడ్డి డ్యాన్సు మాత్రం చాలా నవ్వించింది. ఈ ఆటలో కూడా రేవంత్ టీమ్ గెలిచింది. ఈ ఆట పూర్తయ్యాక శ్రీసత్య సేవ్ అయింది. ఆఖరికి ఇనాయ, ఆదిరెడ్డి నామినేషన్స్‌లో మిగిలారు. చివరికి ఇనాయ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. 

వేదిక మీదకు వచ్చిన ఇనాయను మిగతా ఇంటి సభ్యుల కోసం ఒక మంచి క్వాలిటీ, ఒక చెడు క్వాలిటీ చెప్పమని అడిగారు నాగార్జున. దానికి ఇనాయ మొదట శ్రీహాన్‌తో మొదలుపెట్టింది. నువ్వే టైటిల్ గెలిచి రావాలని కోరుకుంటున్నా అంది. దీంతో అందరూ షాక్ అయ్యారు. శ్రీహాన్ చాలా ఆనందపడ్డాడు. శ్రీహాన్ చాలా మంచివాడని, కానీ ఆ విషయం ఆలస్యంగా తెలిసిందని చెప్పింది ఇనాయ. ఇక బ్యాడ్ క్వాలిటీ గురించి చెబుతూ అతడు మనిషి వెనుక మాట్లాడతాడని చెప్పింది. అలాగే శ్రీసత్య గురించి చెబుతూ ఆమెకు నచ్చితే బాగా చూసుకుంటుందని, నచ్చకపోతే రెచ్చగొడుతుందని చెప్పింది. కీర్తి చాలా స్ట్రాంగ్ అని, ఒక్కోసారి బాధపడినా కూడా మళ్లీ స్ట్రాంగ్ అయిపోతుందని చెప్పింది. అలాగే ఆదిరెడ్డి, రేవంత్ గురించి కూడా కొన్ని పాయింట్లు చెప్పింది. 

మిడ్ వీక్ ఎలిమినేషన్...
హోస్ట్ నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి చెప్పారు. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారని, వారిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ కాబోతున్నట్టు చెప్పారు. ఓటింగ్ లైన్లు ఓపెన్ అయ్యాయని చెప్పారు. అలా ఒకరు ఎలిమినేట్ అయితే టాప్ 5 కంటెస్టెంట్లు ఫైనల్‌కు చేరుతారు.  

బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం జరుగుతున్నట్టు ప్రేక్షకులకు నమ్మకం కుదరడం లేదు. కాబట్టి విన్నర్ కూడా ఓటింగ్ బట్టి నిర్ణయిస్తారో లేక వారికి నచ్చినవారిని విన్నర్ చేస్తార చూడాలి. ఇనాయ ఎలిమినేషన్‌తో బిగ్ బాస్ ఫెయిర్‌గా ఎలిమినేట్ చేస్తున్నారన్న నమ్మకం ప్రేక్షకుల్లో తగ్గింది.

Also read: ఇనయా X ఆదిరెడ్డి - ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అన్న నాగార్జున, ఆది సేఫ్?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget