అన్వేషించండి

Bigg Boss 7: రాధ తుమ్ము ఎంతపని చేసింది - ఊహించని ట్విస్టుతో ‘బిగ్ బాస్ 7’ ప్రోమో

బిగ్ బాస్ 7 ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఈ ప్రోమో చూస్తుంటే.. ముందు సీజన్లకంటే ఈ సీజన్ చాలా భిన్నంగా ఉంటుందని అనిపిస్తోంది.

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘బిగ్ బాస్ - సీజన్-7’కు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున మరో స్పెషల్ ప్రోమోతో వచ్చేశారు. ఈ ప్రోమో భలే ఆసక్తికరంగా ఉంది. చివరిలో ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. దీన్ని బట్టి, సీజన్-7లో కూడా ఊహించని ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది. 

అనుకున్నది జరగదు..
బిగ్ బాస్ 7 ప్రోమోను రమేశ్, రాధ అనే ఇద్దరు ప్రేమికులతో ప్రారంభించారు మేకర్స్. ఇందులో రమేశ్.. కొండపై నుంచి జారి పడిపోబోతుంటే.. రాధ కొండపై నుంచి చున్నీ ఇచ్చి పట్టుకోమంటుంది. అయితే మామూలుగా సినిమాల్లో ఇలాంటి సీన్ వచ్చినప్పుడు రమేశ్.. కచ్చితంగా బ్రతికి బయటపడాల్సిందే.. కానీ ఈ ప్రోమోలో మాత్రం అలా జరగదు. ఇక బతికేస్తాడు అనుకొనే సమయానికి రాధకు తుమ్ము వస్తుంది. అంతే, రమేష్ లోయలో పడిపోతాడు. అంటే బిగ్ బాస్ 7 కూడా ఎవరి ఊహకు అందకుండా ఉంటుందని ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఆటలు చెల్లవని, బిగ్ బాస్ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని నాగార్జున స్పష్టం చేశాడు. ఇప్పటికే బిగ్ బాస్ 7 ప్రమోషన్స్ కోసం ఒక షోకి వచ్చిన నాగ్.. అక్కడ కూడా ఈ సీజన్ అనేది ముందు సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది అని కచ్చితంగా చెప్పాడు. భిన్నంగా అంటే ఏంటా అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు వేయడం మొదలుపెట్టారు.

కంటెస్టెంట్స్ వీరేనా?
బిగ్ బాస్ 7 ప్రోమో విడుదలైన.. షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ పిల్ల, మోహన భోగరాజు, సాకేత్, అమర్‌దీప్, శోభా శెట్టి, శ్వేతా నాయుడు, వర్ష, బుల్లెట్ భాస్కర్, ప్రభాకర్.. ఈ షోలో కంటెస్టెంట్స్‌గా రానున్నారని సమాచారం. అయితే మునుపటి సీజన్స్‌లాగా కాకుండా బిగ్ బాస్ 7లో కాస్త గుర్తింపు ఉన్న సెలబ్రిటీలనే తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు ముందు నుండే టాక్ ఉంది. ఇప్పుడు ఆ టాక్‌ను నిజం చేస్తూ.. ఎక్కువగా సీరియల్ నటీనటులనే ఈ సీజన్ కోసం ఎంపిక చేశారు. మామూలుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ ఎవరూ అనే విషయాన్ని బయటికి చెప్పకుండా ఉండడమే మేకర్స్ బాధ్యత కాబట్టి.. పైన చెప్పబడిన సెలబ్రిటీలు కూడా కచ్చితంగా ఈ సీజన్‌లో ఉంటారా లేదా అనే సందేహమే.

అప్పటినుంచి ఇప్పటివరకు..
కింగ్ నాగార్జున.. గత నాలుగు సీజన్ల నుంచి బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో బిగ్ బాస్ మొదలవ్వగానే ముందుగా జూనియర్ ఎన్‌టీఆర్‌కు హోస్ట్ స్థానాన్ని ఇచ్చి.. షోపై హైప్‌ను విపరీతంగా పెంచేశారు. అంతే కాకుండా ఎన్‌టీఆర్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బిగ్ బాస్ చూడడం ప్రారంభించారు. ఆ తర్వాత సీజన్‌లోకి నాని హోస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. కానీ నాని హోస్టింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో.. అదే రేంజ్‌లో నెగిటివిటీ కూడా వచ్చింది. అందుకే తరువాతి సీజన్‌కు హోస్టింగ్ చేయడానికి నాని ఒప్పుకోలేదు. ఆ తర్వాత బరిలోకి దిగాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పటివరకు నాగార్జున స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ప్రతీ సీజన్ స్టార్టింగ్‌లో నాగ్ స్థానంలో మరో హీరో బిగ్ బాస్ హోస్ట్‌గా కనిపించనున్నాడు అంటూ రూమర్స్ వస్తాయి. కానీ అవేవి నిజం కాదని చివర్లో తెలుస్తుంది. బిగ్ బాస్ 7 విషయంలో కూడా అదే జరిగింది.

Also Read: 'ఖుషి' నడుము సీన్‌కు అరుపులే - 'భోళా శంకర్' చూసిన ఆడియన్స్ ఏమంటున్నారంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget