అన్వేషించండి

Bigg Boss Nominations: బిగ్ బాస్ బిగ్ 'ట్విస్ట్'- వైల్డ్ కార్డ్ ఎంట్రీ సభ్యులకి మరిన్ని పవర్స్, నామినేషన్స్ ప్రక్రియ షురూ

బిగ్ బాస్ సీజన్ 7లోకి కొత్తగా అయిదుగురు కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. వారికి నామినేట్ చేసే హక్కు ఇచ్చారు బిగ్ బాస్.

బిగ్ బాస్ సీజన్ 2.0 వర్షన్ తో ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే వారికి పవర్స్ కూడా వచ్చేశాయి. సండే ఫన్ డే అంటూ ఫుల్ డబుల్ ఎనర్జీ ఇచ్చేసిన బిగ్ బాస్ మండే మంట పెట్టేశారు. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోతుంది. అయితే ఈ సారి నామినేట్ చేసే బాధ్యత ఇంట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారికి ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లో ఎవరు అనర్హులో సరైన కారణాలు చెప్తూ నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు.

ఐదో వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలుకాబోతుంది. ఇందులో పోటుగాళ్ళు మాత్రమే నామినేషన్ చేస్తారు. బిగ్ బాస్ ఇంట్లో ఉండేందుకు అర్హత లేదనుకునే వారికి సంబంధించి సరైన కారణాలు చెప్పి మొహం మీద ఇంటూ మార్క్ వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. మొదటగా నయని పావని టేస్టీ తేజని నామినేట్ చేసింది. గేమ్ ఎక్కువగా అడినట్టుగా అనిపించలేదని కారణం చెప్పింది. బిగ్ బాస్ అంటే కేవలం టాస్క్ ఒక్కటే కాదని గేమ్స్ ఒక్కటే ఆడి గెలిపించడం కాదని తేజ చెప్పుకొచ్చాడు. భోలే షావలి సందీప్ ని నామినేట్ చేశాడు. పవర్ అస్త్ర కోసం జరిగిన స్మైల్ ప్లీజ్ టాస్క్ లో తేజని ఆపలేదని అది తనకి కరెక్ట్ అనిపించలేదని షావలి చెప్పుకొచ్చాడు. కానీ సందీప్ మాత్రం తేజ బయటకి వచ్చిన తర్వాత తన మీద గట్టిగా అరిచిన వ్యక్తిని తనేనంటూ సమర్థించుకున్నాడు.

ఇక పూజా మూర్తి కూడా తేజని నామినేట్ చేసింది. స్మైల్ ప్లీజ్ టాస్క్ లో తేజ చేసిన పనిని తప్పుబట్టింది. అందరూ వద్దు తేజ అని అరుస్తుంటే అది ఎంకరేజ్ మెంట్ ఎలా అవుతుందని పూజ నిలదీసింది. అమర్ దీప్ ఆడటం సెల్ఫిష్ గా అనిపించిందని అశ్విని శ్రీ చెప్పుకొచ్చింది. సెల్ఫిష్ గా ఆలోచించాలి అది గేమ్.. ఇక్కడికి వచ్చిందే నా గురించి నేను ఆలోచించుకోవడానికని అమర్ తేల్చి చెప్పేశాడు. తర్వాత అశ్విని శోభాని నామినేట్ చేసింది. గ్రూపిజం చేస్తున్నారని శోభాని ఉద్దేశించి అశ్విని చేసిన వ్యాఖ్యల్ని డాక్టరమ్మ బాగానే వ్యతిరేకించింది. అసలు తను నోరు తెరిచి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా గ్రూపిజం వల్ల ఎవరు నష్టపోయారంటూ నిలదీసింది. ఈ కారణం చెప్పి నామినేట్ చేస్తే చాలా బాధగా ఉంటుందని చెప్పింది. అలా ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న వారి గురించి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు నామినేట్ చేశారు. మరి ఈ వారం ఎవరు ఉంటారో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారంతా కన్ఫర్మ్ హౌజ్‌మేట్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటినుండి హోస్ట్ ఆఫ్ బెడ్స్ చేతిలోనే ఎవరు ఎక్కడ పడుకోవాలని నిర్ణయం ఉంటుందని అన్నారు. దీంతో ముందు నుండి హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మనసులో అసూయ మొదలయ్యింది.

Also Read: కొన్ని గంటల్లో ‘బిగ్ బాస్’, ఇంతలో నాన్న చనిపోయారనే వార్త - పూజా మూర్తి భావోద్వేగం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Tamil Nadu Assembly Elections 2026: రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
రజనీ ఫ్యాన్స్ తో కయ్యం పెట్టుకున్న టీవీకే విజయ్ పార్టీ నేత - ఇక రాజకీయం కాదు ఫ్యాన్ వార్స్ తప్పవా?
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Embed widget