Bigg Boss Telugu 7: గౌతమ్ ఇంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పార్టీ - పల్లవి ప్రశాంత్ అలా, మిగతావారు అంతా ఇలా!
Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ కేసుల్లో చిక్కుకుని జైలులో కూర్చుంటే.. మిగతా కంటెస్టెంట్స్ అంతా అది పట్టించుకోకుండా పార్టీ చేసుకున్నారు.
Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఒక దుర్ఘటనతో ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. కంటెస్టెంట్స్ అంతా ఎంతో ఆనందంతో, బిగ్ బాస్ జర్నీ ముగిసిపోయింది అనే ఫీలింగ్‌తో బయటికి వస్తే.. ఫ్యాన్స్ అంటూ కొందరు ఆకతాయిలు వారి సంతోషాన్ని దూరం చేశారు. రన్నర్‌గా ఉన్న అమర్‌దీప్‌తో పాటు అశ్విని, గీతూ కార్లపై కూడా దాడులు చేశాడు. ఆ దాడి చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అని, వద్దని చెప్తున్న వినకుండా ప్రశాంత్ ర్యాలీ నిర్వహించడం వల్లే గొడవ పెద్దగా అయ్యిందని పోలీసులు తనను అరెస్ట్ చేశారు. రెండురోజులు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించిన తర్వాత ప్రశాంత్‌కు బెయిల్ దొరికింది. కానీ మిగతా కంటెస్టెంట్స్ ఇదేమీ పట్టించుకోకుండా ఆనందంగా పార్టీ చేసుకున్నారు.
గౌతమ్ ఇంట్లో పార్టీ
బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ నయని పావని, టేస్టీ తేజ, శుభశ్రీ, ప్రియాంక, యావర్, గౌతమ్, అర్జున్ కలిసి తాజాగా పార్టీ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలు సోషల్ మీడియాల్లో షేర్ చేసుకున్నారు. ప్రియాంక అయితే ఈ పార్టీకి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. గౌతమ్ ఇంట్లో ఈ డిన్నర్ పార్టీ జరిగిందని ముందుగా ప్రియాంక.. తన వీడియోలో చెప్పుకొచ్చింది. అందులో వారంతా సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించారు. శోభా రాలేదని తేజ ఫీల్ అవుతున్నాడని ప్రియాంక వెటకారంగా మాట్లాడగా.. యశ్వంత్‌తో బిజీగా ఉందని గౌతమ్ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత వారిపై వచ్చిన మీమ్స్ అన్నింటినీ చూసి ఎంజాయ్ చేశారు.
అందరూ మింగిల్.. తేజ సింగిల్
పోల్ డ్యాన్స్ చేయమంటూ తేజను ఆటపట్టించింది పావని. అందరూ కలిసి తేజను టార్గెట్ చేసి ఫన్ క్రియేట్ అయ్యేలా చేశారు. ప్రియాంకతో పాటు శివ్ కూడా ఈ పార్టీకి వెళ్లాడు. తన ముందే తేజ, ప్రియాంక ఒకరికి ఒకరు సరదాగా ఐ లవ్ యూ చెప్పుకున్నారు.‘‘ఆ అమ్మాయిని చాలామంది లవ్ చేస్తారు కానీ ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేస్తుంది అది ముఖ్యం కదా’’ అని కౌంటర్ ఇచ్చాడు. పార్టీ జరుగుతున్నంతసేపు నయని పావని, శుభశ్రీలతో పులిహోర కలపడానికి ప్రయత్నించాడు తేజ. కానీ నయని పావని, యావర్‌ను హగ్ చేసుకుంటూ కనిపించింది. శుభశ్రీ ఏమో గౌతమ్‌తోనే ఎక్కువగా ముచ్చట్లు పెట్టింది. దీంతో అసలు తనకు పెయిర్ లేరని తేజ తెగ ఫీల్ అయిపోయాడు. అందరు జంటలు అయిపోయారు.. తానే ఒంటరి అయిపోయానని అన్నాడు.
కొందరు రాలేదు
ఈ పార్టీకి మరికొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రాలేదు. శివాజీ, రతిక, శోభా శెట్టి, అశ్వినితో పాటు పలువురు మిస్ అయ్యారు. అప్పుడే ప్రియాంక అప్లోడ్ చేసిన ఈ పార్టీ వీడియోకు దాదాపుగా నాలుగున్నర లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో కింద కామెంట్స్‌లో చాలామంది ప్రశాంత్ అరెస్ట్‌ను పట్టించుకోకుండా కంటెస్టెంట్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ శివాజీ, యావర్ తప్పా మరే ఇతర కంటెస్టెంట్ కూడా పల్లవి ప్రశాంత్‌పై పెట్టిన కేసు గురించి గానీ, తన అరెస్ట్ గురించి గానీ మాట్లాడడానికి ముందుకు రాలేదు. భోలే షావలి మాత్రం ప్రశాంత్ అరెస్ట్ దగ్గర నుండి బెయిల్ వరకు చాలా విషయాలను దగ్గరుండి చూసుకున్నాడు.
Also Read: నా బిడ్డను మెడ పట్టుకుని దొంగలా తీసుకెళ్లారు, కన్నీటి పర్యంతమైన పల్లవి ప్రశాంత్ తండ్రి