అన్వేషించండి

ఈ ముగ్గురిలో ఆమె ఔట్ - టాప్ 5లో ఇనయా ఉండదట!

ఈ వారం ‘బిగ్ బాస్‌’ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. మరి, మిగిలిన 9 మందిలో టాప్-5 వరకు చేరుకోలేని వీక్ కంటెస్టెంట్లు ఎవరు? నాగ్ అడిగిన ప్రశ్నకు హౌస్‌మేట్స్ ఏం బదులిచ్చారు?

మరో మూడు వారాల్లో ‘బిగ్ బాస్’ సీజన్-6 ముగిసిపోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు ఆదివారం రాత్రి ఎలిమినేట్ అవుతారు. దీంతో మిగతా 9 మంది కంటెస్టెంట్ల మధ్య పోటాపోటీ నెలకోనుంది. ఈ వారం నామినేషన్లలో ఉన్న ఇనయా, శ్రీసత్య, మెరీనా, రోహిత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్, కీర్తిలో ఒకరు బయటకు వెళ్లక తప్పదు. అయితే, ఇప్పటికే శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్‌, కీర్తిలు నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. తాజా ప్రోమో ప్రకారం.. ఇనయా, శ్రీసత్య, మెరీనాలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెరీనా ఈ రోజు ఎలిమినేట్ కానుంది. 

ఈ రోజు ఎపిసోడ్‌లో ఫన్‌తోపాటు ఎలిమినేషన్ టెన్షన్ కూడా ఉండనుంది. షో చివరి దశకు వచ్చిన నేపథ్యంలోకి హోస్ట్ నాగార్జున ఎవరు బాటమ్-5లో ఉంటారని హౌస్‌మేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు. ఆదిరెడ్డి మెరీనా పేరు చెప్పగా.. ఇనయ, శ్రీసత్య రాజ్ పేరు చెప్పారు. కీర్తి ఆదిరెడ్డి పేరు, మెరినా.. శ్రీహన్ పేరు, రేవంత్.. రోహిత్ పేరు, శ్రీహాన్, రోహిత్‌లు.. కీర్తి పేరు, ఫైమా, రాజ్‌లు ఇనయా పేరు చెప్పారు. కంటెస్టెంట్ల అభిప్రాయం ప్రకారం.. ఇనయా, రాజ్, కీర్తిలు టాప్‌-5లో ఉండరని, ఫినాలేకు చేరుకోలేరని తెలుస్తోంది. అయితే, బయట ఓటింగ్ మాత్రం వేరేలా ఉన్నట్లు సమాచారం. టైటిల్ కోసం ఇనయా గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొందరైతే రేవంత్‌కు టైటిల్ ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. కానీ, కచ్చితమైన నిర్ణయాన్ని ఇప్పట్లో చెప్పడం కష్టమే. ఒక్కోసారి అంచనాలు తారుమారయ్యే అవకాశాలుంటాయి. మరి, మీరు ఎవరు టైటిల్ గెలుస్తారని అనుకుంటున్నారు?

శనివారం నాటి ఎపిసోడ్‌లో.. ఆదిరెడ్డికి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్:  

 ఇటీవల ‘బిగ్ బాస్’ ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే పోటీ పెట్టారు. ఏ ముగ్గురు ఇంటి సభ్యులైతే ముందుగా బజర్ నొక్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కొనుగోలు చేస్తారో వాళ్ళు పాస్ కోసం పోటీ పడే అవకాశం పొందుతారు. ఈ గేమ్ లో ఆదిరెడ్డి ఆడను అని పక్కన కూర్చున్నాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అందులో పాల్గొనాలి కదా అని ఇనయా చెప్తుంటే.. ఆదిరెడ్డి తాను ఆడకూడదు అనుకోవడం కూడా టాస్క్ అని విరుద్ధంగా మాట్లాడాడు. నువ్వు విన్నర్ కాకపోతే వేరే వాళ్ళ డబ్బులతో ఇక్కడ వన్ వీక్ ఉంటున్నావ్ అంటూ లాజిక్ చెప్పాడు.

ఇదే విషయంపై నాగార్జున.. శనివారం ఎపిసోడ్‌లో ఆదిరెడ్డిని నిలదీశారు. ‘‘ఇనయా నీకో విషయం చెప్పింది. బిగ్ బాస్ నీకో ఆట ఇచ్చినప్పుడు ఆట ఆడాలి కానీ, అడ్డమైన కారణాలతో ఆట ఆడకుండా చూసుకోకూడదని తెలిపింది. నీ ఫీలింగ్ ఏమిటీ? టాస్క్ ఆడకపోవడమే నీ టాస్కా? నువ్వేగానీ ఆ టాస్క్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ నీకు వచ్చి ఉంటుంటే.. ఒక జెన్యున్ క్యాండిడేట్ హౌస్ నుంచి వెళ్లకుండా ఆపగలిగేవాడివి కాదా. అది సపోర్ట్ చేయడం కాదా? అది ఆట తీరు కాదా? నువ్వు అలా చేస్తే జనం ఎంత మెచ్చుకుంటారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్టా? ఆ పాస్ ఎవరికి వస్తే.. వారికి ఓట్లు రావా? నువ్వేమన్నా తోపా తురుమువా? ఆడియన్స్ ఏమనుకుంటున్నారో చెప్పడానికి? గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలుసా??’’ అని నాగార్జున అన్నారు. 

దీనికి ఆదిరెడ్డి స్పందిస్తూ.. ‘‘నేను నిజంగా గెలిస్తే.. నాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తే నాకు నేను వాడుకోను కదా. నాకెందుకు అది?’’ అన్నాడు. ఇందుకు నాగ్ స్పందిస్తూ.. ‘‘అది గెలిచి చెప్పాలి. అది గెలవకుండా కాదు’’ అని అన్నారు. దీంతో ఆదిరెడ్డి ‘‘దాని వల్ల డబ్బులు వేస్ట్ కాదా’’ అని అన్నాడు. నాగ్ స్పందిస్తూ.. ‘‘మరి ఇమ్యునిటీ ఎందుకు నీకు?’’ అన్నారు. ‘‘కెప్టేన్ అయితే అది తీసుకుంటాను కదా ఇమ్యునిటీ’’ అని వాదించే ప్రయత్నం చేశాడు ఆదిరెడ్డి. దీంతో నాగార్జునకు కాస్త సహనం నశించినట్లే కనిపించింది. ‘‘ఆది బిగ్ బాస్ హౌస్‌లో తీరు మార్చుకో. మార్చుకోకపోతే.. గేట్లు తీయండి నేను వెళ్లిపోతా కాదు. ఆడియన్సే వచ్చి గేట్లు తెరిచి నిన్ను తీసుకెళ్లిపోతారు’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. గేమ్‌లో లూప్స్ వెతికితే గీతూ పరిస్థితే ఏర్పడుతుందని అన్నారు. ఆ తర్వాత శ్రీసత్య, శ్రీహాన్‌కు కూడా నాగార్జున క్లాస్ పీకారు. నామినేషన్స్ సమయంలో వెకిలి నవ్వులు నవ్వుతున్న శ్రీసత్యకు గట్టిగానే క్లాస్ పీకారు నాగ్. ‘‘అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుంది’’ అని నాగ్ అన్నారు. మరి వచ్చే ఇకపై శ్రీసత్య తన ప్రవర్తన మార్చుకుంటుందో లేదో చూడాలి.

Also Read: నయన్ ‘కనెక్ట్’ టీజర్: ఈ సీన్ చూస్తే ఉలిక్కిపడతారు - ఈ సినిమాకు ఇంటర్వెల్ ఉండదట!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: త్రిగుణ్‌ని మీద విరుచుకుపడ్డ రోహిత్! బాత్‌రూంలో బట్టల గొడవ పీక్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: త్రిగుణ్‌ని మీద విరుచుకుపడ్డ రోహిత్! బాత్‌రూంలో బట్టల గొడవ పీక్స్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కెప్టెన్సీ పోటీలో ఆ ఏడుగురు! అదిరిపోయే పావులు కదిపిన త్రిగుణ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: కెప్టెన్సీ పోటీలో ఆ ఏడుగురు! అదిరిపోయే పావులు కదిపిన త్రిగుణ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్, షాలినిల ఎడబాటు..! చివరిలో ట్విస్ట్! పాపం వంశీ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget