అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో టిక్కెట్ టు ఫినాలే కోసం టాస్కులు జోరుగా సాగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో ఇంకో రెండు వారాల్లో తేలిపోనుంది. టిక్కెట్ టు ఫినాలే టాస్కు పెట్టి ఫైనల్ వెళుతున్న మొదటి కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఈ టాస్కులో చివరి వరకు ఆడిన ఆదిరెడ్డి ఫైనల్ కు చేరినట్టు సమాచారం. ఆటల్లో ఓటమిని తట్టుకోలేని రేవంత్ రెండో స్థానంలో నిలిచాడు కానీ ఫైనలిస్టు కాలేకపోయాడు. 

ఇనాయ అవుట్
ఈ ఎపిసోడ్ లో ఏమైందంటే...ముందు రోజు ఆట నుంచి ఎలిమినేట్ అయిన శ్రీసత్య, ఇనయా, కీర్తిలకు రంగులు పూసుకునే టాస్కు ఇచ్చారు. రు ముగ్గురికీ రంగు పడుద్ది అనే టాస్కు ఇచ్చారు.ఈ టాస్కులో ఎవరు గెలుస్తారో వారు ఫినాలే రేసు టాస్కులో పోటీ పడొచ్చు. ఒక సర్కిల్ లోపల వీరు ముగ్గురు ఉండి, అక్కడ పెట్టిన ఎర్రరంగును ఎదుటి వారి తెల్లని టీ షర్టుపై పూయాలి. ఎవరి టీ షర్టు అయితే ఎక్కువ రంగుతో నిండిపోతుందో వారు ఆట నుంచి అవుట్ అవుతారు. మొదటి రౌండ్లో కీర్తి, ఇనాయ కలిసి, శ్రీసత్యకు రంగును బాగా పులిమారు. దీంతో ఆమె అవుట్ అయింది. చివరికి కీర్తి, ఇనాయ మిగిలారు. వీరిద్దరూ ఆడ పులుల్లా ఆడారు. ఎవ్వరూ వెనక్కి తగ్గకుండా పోటీ పడ్డారు. కిందా మీదా పడి, దెబ్బలు తాకుతాయన్న భయం కూడా లేకుండా ఆడారు. ఇద్దరు టీ షర్టులు ఎర్రగా మారాయి. ఎవరి టీషర్టు ఎక్కువ రంగును కలిగి ఉందో చెప్పి, వారిని ఎలిమినేట్ చేసే బాధ్యత సంచాలక్ అయిన రేవంత్ పై పడింది. ఇద్దరు టీషర్టులు చూసిన రేవంత్ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. చివరికి ఇనాయను తప్పించి కీర్తిని ఎంపిక చేశాడు. ఈమె ఫినాలే టిక్కెట్ రేసులో మళ్లీ పోటీ పడింది. 

ఫినాలే రేసులో మిగిలింది ఆరుగురు. ఈ ఆరుగురిలో ఏకాభిప్రాయంతో నలుగురిని ఎంపిక చేసి నెక్ట్స్ లెవెల్‌కి పంపాలని చెప్పారు బిగ్ బాస్. దీంతో ఆటలో ఆరుగురు విసుగుచెందారు. ఈ స్థాయికి వచ్చాక ఏకాభిప్రాయం ఏంటి బిగ్ బాస్ అంటూ చికాకుపడ్డారు. దీంతో సంచాలక్‌గా ఉన్న ఇనాయ, శ్రీసత్యలను తేల్చమన్నాడు బిగ్ బాస్. వీరు ఆరుగురిలో తక్కువ పాయింట్లు ఉన్న వారిని తీసేశారు. అందరి కన్నా తక్కువగా కీర్తి, రోహిత్ ఉండడంతో వారిద్దరూ ఆట నుంచి తొలగిపోయారు. మధ్యలో రేవంత్ - కీర్తి మధ్య గొడవ పడింది. దానికి కారణం తక్కువ పాయింట్లు ఉన్న వారిని తీసేయమని ఐడియా ఇచ్చింది రేవంతే. 

చివరికి మిగిలిన నలుగురికి కప్పులు, సాసర్లు ఒకదానిపై ఒకటి నిలబెడుతూ బ్యాలెన్స్ చేసే టాస్కు ఇచ్చారు. ఇందులో రేవంత్ ఆడలేకపోయాడు. చివరి వరకు ఉండి ఆదిరెడ్డి గెలిచాడు. మొత్తంమ్మీద ఆదిరెడ్డికి తొమ్మిది పాయింట్లు, రేవంత్ ఎనిమిది, శ్రీహాన్ ఆరు, ఫైమా అయిదు, కీర్తి రెండు పాయింట్లతో నిలిచారు. వీరందరికీ మళ్లీ టాస్కు పెట్టబోతున్నారు బిగ్ బాస్. తరువాతి ఎపిసోడ్లో టిక్కెట్ టు ఫినాలే విన్నర్ తేలిపోనుంది. ఇప్పటికే అనధికార సమాచారం ప్రకారం ఆదిరెడ్డి గెలిచాడని తెలుస్తోంది. 

Also read: ‘ఏకాభిప్రాయం’ అనేది కరెక్టు కాదు - బిగ్‌బాస్‌నే తప్పు పడుతున్న సీజన్ 6 కంటెస్టెంట్లు

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్‌లో అందరూ! పక్కా ప్లాన్‌తోనే ఇలా చేశారా!
Bigg Boss Season 10 Today Promo 4: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 4: ఎఫైర్‌కి ఎఫ్‌ఐఆర్‌కి తేడా తెలీదా? చచ్చేంత వరకు వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటా!
Bigg Boss Season 10 Today Promo 3: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: ఝాన్సీ నామినేషన్స్‌లో రెచ్చిపోయిన, రోహిత్, అమన్, ముకేశ్! రోహిత్‌కి షాక్ ఇచ్చిన దేబ్జానీ!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 3: ఝాన్సీ నామినేషన్స్‌లో రెచ్చిపోయిన, రోహిత్, అమన్, ముకేశ్! రోహిత్‌కి షాక్ ఇచ్చిన దేబ్జానీ!
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చరణ్‌ మీద చలరేగిపోయిన నరేశ్! ముకేశ్ విజిల్స్! అపూర్వ వర్సెస్ ఝాన్సీ!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: చరణ్‌ మీద చలరేగిపోయిన నరేశ్! ముకేశ్ విజిల్స్! అపూర్వ వర్సెస్ ఝాన్సీ!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌.. ధర రూ.11.80 లక్షలు.. కొత్తగా వచ్చిన మార్పులు ఇవే!
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Embed widget