అన్వేషించండి

Abijeet: అది చెప్పడం కష్టం, నాలో చాలా లోపాలు ఉన్నాయి - ‘మిస్ పర్ఫెక్ట్’ హీరో అభిజీత్

Abijeet: బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా కనిపించిన అభిజీత్.. ప్రస్తుతం ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ.. తన గురించి కూడా వ్యాఖ్యలు చేశాడు అభిజీత్.

Abijeet about Miss Perfect Series: బిగ్ బాస్ తెలుగులో ఇప్పటికే 7 సీజన్లను పూర్తిచేసుకుంది. ఇక ఈ ఏడు సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారందరూ సినీ పరిశ్రమలో తారాస్థాయికి చేరుకున్నారని చెప్పడం కష్టం. చాలామంది కంటెస్టెంట్స్ ఇంకా కెరీర్‌లో ఎటు వెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కొందరు మాత్రం మంచి ప్రాజెక్ట్స్‌లో నటించడానికి ఎదురుచూస్తున్నారు. అలా చూస్తున్నవారిలో అభిజీత్ కూడా ఒకడు. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చిన అభిజీత్.. చాలామంది బుల్లితెర ప్రేక్షకులను ప్రేమను అందుకున్నాడు. తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో.

కమ్ బ్యాక్ ఎప్పుడంటే..

ప్రస్తుతం లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌లో అభిజీత్ హీరోగా కనిపించాడు. త్వరలోనే ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్య్యూలో పాల్గొన్న అభిజీత్.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఒక క్లారిటీ ఇచ్చాడు. ‘‘కమ్ బ్యాక్ ఎప్పుడు అంటే చెప్పడం కష్టం. కానీ త్వరలోనే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మంచి కథ ఉంటేనే నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఏ మాత్రం డౌట్ ఉన్నా ఎక్కువశాతం వద్దులే అనే అనుకుంటాను. కథ అనేది చాలా ముఖ్యం. కచ్చితంగా మంచి స్టోరీ, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అది కచ్చితంగా చేస్తాను’’ అంటూ తన కమ్ బ్యాక్ గురించి వ్యాఖ్యలు చేశాడు అభిజీత్.

అదంతా వాళ్ల ప్రేమ..

ఇక ‘మిస్ పర్ఫెక్ట్’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఓసీడీ అనేది ఒక క్యారెక్టరైజేషన్. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాని గురించి డిఫరెన్స్ నేను చెప్పలేను’’ అంటూ సిరీస్ చూసి దాని గురించి తెలుసుకోమని సమాధానమిచ్చాడు అభిజీత్. బిగ్ బాస్ 4లో తనను కంటెస్టెంట్‌గా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు.. తనకు మిస్టర్ పర్ఫెక్ట్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. దానిపై కూడా అభిజీత్ స్పందించాడు. ‘‘నన్ను పర్ఫెక్ట్ అనడం వాళ్ల ప్రేమ. నేను నిజానికి అస్సలు పర్ఫెక్ట్ కాదు. నాలో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాలనే ప్రయత్నం ఎప్పటికైనా ఉంటుంది. నా మీద ఉన్న ప్రేమతో నన్ను పర్ఫెక్ట్ అంటున్నారు’’ అంటూ ప్రేక్షకుల ప్రేమపై స్పందించాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

ఒక్క సినిమాతోనే పాపులారిటీ..

చాలామంది నటీనటులను ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలంటే ఎన్నో సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. అందరికీ గుర్తుండిపోయే ఒక్క సినిమాలో కనిపించినా చాలు అని చెప్పడానికి అభిజీత్ ఒక ఉదాహరణ. దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంతోమంది నటీనటులను పరిచయం చేశాడు. అందులో అభిజీత్ కూడా ఒకడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో హీరోగా నటించినా తగినంత గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు అభిజీత్‌ను ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’లో శ్రీనుగానే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక త్వరలోనే ‘మిస్ పర్ఫెక్ట్’ అనే సిరీస్‌తో మరోసారి అందరినీ అలరించనున్నాడు.

Also Read: చాలాసార్లు మోసపోయాం, ఫైనల్‌గా కల నేరవేరింది - శోభా శెట్టి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget