Bigg Boss 8 Nikhil: సింగిల్ అంటూనే బాంబ్ పేల్చిన నిఖిల్ - నటితో జంటగా...
రెండో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాడు ఊర్వశీవో రాక్షసివో హీరో నిఖిల్. ఈ సందర్భంగా రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అంటూనే ఆ విషయంలో షాకిచ్చాడు. కానీ హౌజ్‌లోకి జంటగా అడుగులు వేశాడు.
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ 8 తెలుగు నేడు గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఈ రియాలిటీ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి హౌజ్‌ను నేచర్, యానిమల్ థీమ్, ఫ్లవర్ డెకరేషన్ ఆకర్షణియంగా ముస్తాబు చేశారు. బుద్ది బలం, కండ బలంతో ఆడేందుక రెండో కంటెస్టెంట్‌గా బుల్లితెర హీరో నిఖిల్ మలియక్కన్ వచ్చేశాడు. బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ అయిన నిఖిల్.. తాను సింగిల్ అని చెప్పి లేడీ ఫ్యాన్స్‌ని ఖుషి చేశాడు. నిఖిల్‌ని చాల హ్యాండ్సమ్గా ఉన్నావంటూ కితాబిచ్చాడు నాగ్. హీరోగా కన్నడ సినిమా చేశానన్నా నిఖిల్ తనకు విలన్‌గా చేయడం ఇష్టమన్నాడు. సినిమాకు వస్తే మంచి విలన్‌గా రావాలని అనుకుంటున్నానన్నాడు. క్రష్‌లు ఉన్నాయని, రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం సింగిల్ అన్నాడు.
యష్మీతో జంటగా హౌజ్‌లోకి
హౌజ్‌లోకి సింగిల్‌కి వెళ్తున్న నువ్వు పార్ట్నర్ వెతుక్కుంటావా? అడగ్గా.. అలాంటిదేమి లేదని, అన్ని అమ్మ చూసుకుంటారంటూ అమ్మాయిల గుండెల్లో బాంబు పేల్చాడు. బిగ్‌బాస్‌లో హౌజ్‌లోకి లిమిట్లెస్గా ఏం కావాలనుకుంటున్నావాని అడగ్గా.. మనశాంతి కావాలన్నాడు. కానీ అది దొరకదని తెలుసన్నాడు. ఈసారి హౌజ్‌లోకి సింగిల్‌గా కాకుండా బడ్డీగా వెళ్లాలనేది బిగ్‌బాస్ కండిషన్. ఈ మేరకు నిఖిల్ తన పార్ట్నర్గా యష్మీతో కలిసి హౌజ్‌లోకి వెళ్లాడు. ఇద్దరు జంటగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన వీరు మరి హౌజ్‌లోకి పార్ట్నర్స్ అవుతారా? శత్రువులవుతారా? చూడాలి.