అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : పృథ్వీ గురించి అందరూ పడి చస్తున్నారా?.. కంటెస్టెంట్లను రోస్ట్ చేసిన సమీరా భరద్వాజ్

Bigg Boss 8 Telugu Episode 57 : బిగ్ బాస్ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్ ఎపిసోడ్ గ్రాండ్‌గా జరిగింది. కంటెస్టెంట్లను గమనించి, వారి ఆట తీరు, వారి వ్యవహార శైలిల మీద సమీరా భరద్వాజ్ పాటలు వినిపించింది.

Diwali Episode Sameera Bharadwaj Sings About Contestants: 

బిగ్ బాస్ ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్ ఎపిసోడ్ గ్రాండ్‌గానే జరిగింది. ప్రాపర్టీలు ఇచ్చి కంటెస్టెంట్లను జంటలుగా విడగొట్టి నాగ్ ఆట ఆడించాడు. ఆ ఆటలో నిఖిల్ యష్మీ, రోహిణి అవినాష్ జోడికి ఎక్కువ మార్కులు ఇచ్చాడు నాగ్. ఇక ఈ ఆట అనంతరం గంగవ్వ, తేజల డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు మెచ్చి.. ఇంటి సభ్యుల మెసెజ్‌ను చూపించాడు. కానీ ఎవరో ఒకరి మెసెజ్ మాత్రమే పంపిస్తామని అన్నాడు. దీంతో తేజ త్యాగం చేయడంతో గంగవ్వ బిడ్డ మెసెజ్‌ను బిగ్ బాస్ ప్లే చేశాడు.ఆ తరువాత విష్ణు ప్రియ సేఫ్ అయిందని చెప్పేశాడు.

అనంతరం అనసూయ డ్యాన్సులతో బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేసింది. పుష్ప 2 గురించి నాగ్ అప్డేట్లు అడిగితే.. అసలు కథ ఇందులోనే ఉందని, ప్రతీ పది నిమిషాలకు ఓ హై మూమెంట్ ఉంటుందని చెప్పింది. ఆ తరువాత అనసూయ ఇచ్చే క్లూస్‌తో నిఖిల్, యష్మీ.. రోహిణి అవినాష్‌లు ట్రెజర్ హంట్‌లు చేశారు. ఈ టాస్కులో నిఖిల్ యష్మీ కలిసి లక్ష రూపాయలు సంపాదించారు. ఈ మొత్తాన్ని ప్రైజ్ మనీకి యాడ్ చేశారు. ఆ తరువాత యష్మీ త్యాగంతో నిఖిల్ తన ఇంటి నుంచి వచ్చిన మెసెజ్‌ను బిగ్ బాస్ చూపించాడు.

ఆ పై క టీం స్టేజ్ మీదకు వచ్చింది. కళ్లు మూసుకో.. బొమ్మ గీసుకో అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్కుకి క టీం జడ్జ్‌లుగా వ్యవహరించారు. ఈ టాస్కులో హరితేజ, మెహబూబ్‌లు కళ్లకు గంతలు కొట్టి బొమ్మని గీస్తుంటే.. నబిల్, ప్రేరణలు వారిద్దరినీ గైడ్ చేశారు. ఈ టాస్కులో మెహబూబ్, ప్రేరణలు విన్ అయ్యారు.అనంతరం మెహబూబ్ త్యాగం చేయడంతో.. ప్రేరణ పేరెంట్స్ పంపిన మెసెజ్‌ను చూపించాడు. తల్లిదండ్రుల మాటలతో ప్రేరణ కన్నీరు పెట్టేసింది.

అనంతరం సమీరా భరద్వాజ్‌తో మంచి పాటల ప్రోగ్రాం పెట్టించాడు బిగ్ బాస్. కంటెస్టెంట్లను ఇన్ని రోజులు గమనించి, వారి ఆట తీరు, వారు చేసిన తప్పులు, వారి వ్యవహార శైలిల మీద సమీరా భరద్వాజ్ పాటలు రాసి వినిపించింది. ఇందులో నబిల్, రోహిణి, టేస్టీ తేజల మీద రాసి పాడిన పాటలు బాగున్నాయి. యష్మీ డ్రీమ్ బాయ్ గురించి చెప్పడం లేదని పాటలో పాడి వినిపించింది. అవినాష్ ఎంటర్టైన్మెంట్, ప్రేరణ నామినేషన్ ప్రాసెస్ గురించి పాటల్లో జొప్పించింది.

విష్ణు ప్రియ కోసం పాడిన పాటలో అంతర్లీనంగా పృథ్వీ గురించి పెట్టేసింది. కానీ విష్ణు ప్రియ ఆ విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోదు. నిత్యం పృథ్వీ నామస్మరణ చేసుకుంటూ తిరుగుతూనే ఉంటుంది. నయనికి కంటతడి పెట్టొద్దు అంటూ హింట్ ఇచ్చింది. గౌతమ్, గంగవ్వ,నిఖిల్ ఇలా అందరి గురించి పాజిటివ్‌గానే చెప్పింది. పృథ్వీ గురించి మాత్రం కాస్త ఎక్కువగానే చెప్పినట్టు కనిపిస్తుంది. అర్జున్ రెడ్డి, సమర సింహా రెడ్డి అని పొగిడేసింది. రెండు రాష్ట్రాల్లోని అమ్మాయిలంతా పృథ్వీనే కలవరిస్తోన్నారన్నట్టుగా చెప్పింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR Letter To Revanth: ఫార్ములా-ఈ రేస్‌పై చర్చకు సిద్దమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Bhu Bharati Act 2024: తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక 
Best Mobiles Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - వివో నుంచి మోటో వరకు!
Embed widget