అన్వేషించండి

Bigg Boss 7: ‘బిగ్ బాస్’ బడా ప్లాన్ - తమిళ హీరో, ‘సీమశాస్త్రీ’ బ్యూటీ, ఆ శృంగార తారకు బంపర్ ఆఫర్?

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 గురించి అనేక కథనాలు, వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది.

రియాలిటీ షోలలో బిగ్ బాస్‌కు ఉన్న క్రేజే వేరు. అందులోనూ ‘బిగ్ బాస్’కు మరింత ఎక్కువ క్రేజే ఉంటుంది. అందుకే తెలుగులో బిగ్ బాస్ 7వ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ గురించి అనేక కథనాలు, వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ 7లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్‌లో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తుండగా.. తాజాగా మరో కనుమరుగైపోయిన హీరో, హీరోయిన్ కూడా బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అవుతారని టాక్ వినిపిస్తోంది. 

దాదాపు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వీరే..
ఇప్పటికే బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురు పేర్లు బయటికొచ్చాయి. అందులో బుల్లితెర సెలబ్రిటీలు, సింగర్స్, కామెడియన్స్.. ఇలా చాలామందే ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వస్తుందని, లేదా ఆమె కూతురు సుప్రిత వస్తుందని, అలా కాకుండా ఇద్దరు కలిసి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదని తెలుస్తోంది. అయితే, ఇది ఇంకా కన్‌ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక వీరితో పాటు జబర్దస్త్‌లో కామెడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుల్లెట్ భాస్కర్, నరేశ్ కూడా ఈ సీజన్‌లో ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మామూలుగా ఒకప్పుడు సినిమాల్లో నటించి హీరో, హీరోయిన్లుగా ఫేమస్ అయ్యి.. ఆ తర్వాత కనుమరుగయిపోయిన వారిని కంటెస్టెంట్స్‌గా తీసుకురావడం బిగ్ బాస్‌కు అలవాటే. ఈసారి కూడా బిగ్ బాస్ టీమ్ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది.

న్యూజిలాండ్ నుండి తిరిగి ఇండియాకు..
ఇప్పటికే బిగ్ బాస్ 7లో అలనాటి హీరో అబ్బాస్ కంటెస్టెంట్‌గా వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ప్రేమదేశం’ లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో హీరోగా నటించిన తర్వాత అబ్బాస్‌.. ఆ తర్వాత కూడా పలు హిట్ చిత్రాల్లో నటించాడు. కానీ ఉన్నట్టుండి వెండితెరపై కనిపించకుండా పోయాడు. కానీ ఇప్పటికీ ఈ హీరోను గుర్తుపట్టేవారు, అభిమానించేవారు ఉన్నారు. సినిమాలు మానేసిన తర్వాత కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు అబ్బాస్. ఇక ఈ ఏడాది ఇండియాకు తిరిగి వచ్చేశాడు. దీంతో అబ్బాస్ మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాలు రావాలంటే బిగ్ బాసే సరైన ప్లాట్‌ఫార్మ్ అని అందులో కంటెస్టెంట్‌గా రావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కామెడీ సినిమాలతో ఫేమస్..
ఇక హిట్ చిత్రాల్లో నటించినా కూడా ఒక్కొక్కసారి అవకాశాలు రావు, దాని వల్ల కెరీర్ ఎండ్ అయిపోతుంది అని చెప్పడానికి ఇప్పటికే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్‌లో ఇలాంటి పరిస్థితి ఎదుర్కున్నవారు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో ఫర్జానా ఒకరు. అసలు ఫర్జానా అనే పేరుతో హీరోయిన్ ఉందని కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ తను తెలుగులోనే అరడజనుకుపైగా సినిమాలు చేసింది. అల్లరి నరేశ్‌తో కలిసి ‘సీమశాస్త్రి’ అనే సినిమాలో నటించింది ఫర్జానా. ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్స్‌లో నటించిన ఫర్జానా.. 2009లో చివరిసారిగా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. ఇన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వారి ముందుకు వస్తుందని సమాచారం. ఇంకా ఆమెతోపాటు ఒకప్పుడు శృంగార తారగా కుర్రాళ్ల మనసు దోచిన షకీలా కూడా ఈ సీజన్‌లో ఛాన్స్ కొట్టేసిందని తెలిసింది.

Also Read: 'రామాయణం' నుంచి ఆలియా భట్ ఔట్? యశ్ కూడా అనుమానమే - భయపడుతున్నారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget