అన్వేషించండి

Bigg Boss 5 Telugu: 'కమ్యూనిటీ' టాపిక్ తీసుకొచ్చిన పింకీ.. ఇది తప్పంటూ షణ్ముఖ్ ఫైర్.. సిరిని హత్తుకొని ఏడుస్తూ..

టాస్క్ లో లాస్ట్ బజర్ కి షణ్ముఖ్ కుర్చీలో కూర్చున్నాడు. ఆ విషయం తెలిసి సిరి లోపల నుంచి వచ్చి షణ్ముఖ్ ని గట్టిగా కౌగిలించుకొని ముద్దు ఇచ్చింది.

నిన్నటి 'నియంత మాటే శాసనం' టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. ప్రియాంక రెండోసారి కుర్చీలో కూర్చున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ రవి, సిరి, షణ్ముఖ్ లకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రవి, సిరి లాస్ట్ లో రావడంతో వారిద్దరూ వెళ్లి ప్రియాంకను రిక్వెస్ట్ చేసుకున్నారు. సిరి లేకపోతే తన గేమ్ ఈజీ అవుతుందని ఆమెని ఎలిమినేట్ చేసి రవిని సేవ్ చేసింది. దీంతో సిరి హర్ట్ అయి.. ఏడ్చేసింది. 
 
కాజల్ పై షణ్ముఖ్ ఫైర్.. 
 
టాస్క్ లో లాస్ట్ బజర్ కి షణ్ముఖ్ కుర్చీలో కూర్చున్నాడు. ఆ విషయం తెలిసి సిరి లోపల నుంచి వచ్చి షణ్ముఖ్ ని గట్టిగా కౌగిలించుకొని ముద్దు ఇచ్చింది. ప్రియాంక, రవి లాస్ట్ వరకు ఉండిపోవడంతో వారు షణ్ముఖ్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు. దీంతో షణ్ముఖ్.. రవిని సేవ్ చేశాడు. ప్రియాంక తనకు ఇది లాస్ట్ ఛాన్స్ అని.. షణ్ముఖ్ ని రిక్వెస్ట్ చేసుకుంది. తను కెప్టెన్ అయితే తన కమ్యూనిటీకి ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుందని పాయింట్ తీసింది. అయినప్పటికీ షణ్ముఖ్.. రవిని సేవ్ చేశాడు. మధ్యలో కాజల్ కల్పించుకొని తన కమ్యూనిటీ కోసం ఆలోచించు అంటూ షణ్ముఖ్ ని అడిగింది. దీంతో షణ్ముఖ్ ఫైర్ అయ్యాడు. 'మధ్యలో కమ్యూనిటీని ఎందుకు తీసుకొస్తున్నారు..? మీరు రిక్వెస్ట్ చేసినా.. నేను పింకీని సపోర్ట్ చేయలేదని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారా..? అంటే నేను ఎదవని అవ్వాలా..? ఇది తప్పు కాజల్' అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో ప్రియాంక ఫ్రస్ట్రేట్ అయి తన మొహం మీద కొట్టుకుంటూ.. బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చేసింది ప్రియాంక. 'నేను మర్చిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారంటూ' మానస్ తో చెప్పింది. 'మర్చిపోతే కమ్యూనిటీ అనే వర్డ్ ఎందుకు అన్నావ్' అంటూ మానస్ రివర్స్ అవ్వడంతో ప్రియాంక బాధ ఇంకా ఎక్కువైపోయింది. ఫైనల్ గా కాజల్, మానస్, సన్నీ.. ప్రియాంకను కూల్ చేసే ప్రయత్నం చేశారు. 
 
ఆ తరువాత షణ్ముఖ్.. సిరిని హగ్ చేసుకొని ఏడ్చేశాడు. ఎంత పెద్ద లేబుల్ తెలుసా అది..? అంటూ హర్ట్ అయిపోయాడు షణ్ముఖ్. తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ.. కాజల్ మాత్రమే కాదు పింకీ కూడా కమ్యూనిటీ అని మాట్లాడడం కరెక్ట్ కాదంటూ చెప్పాడు.
 
ఫైనల్ గా షణ్ముఖ్, రవి ఉండగా.. హౌస్ మేట్స్ అందరూ కలిసి షణ్ముఖ్ ని కెప్టెన్ గా ఎన్నుకున్నారు. 
 
ఆ తరువాత కెప్టెన్ గా గెలిచిన షణ్ముఖ్.. సిరికి ముక్కుపుడకను గిఫ్ట్ గా ఇచ్చాడు. అది పెట్టుకోమని అడగడంతో సిరి ముక్కుపుడక పెట్టుకొనే హౌస్ లో గేమ్ ఆడింది. 
 
బీబీ ఎక్స్ ప్రెస్.. 
 
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ లో భాగంగా 'చుక్‌ చుక్‌ చుక్‌' అంటూ బజర్‌ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులంతా రైలు బోగీల్లా మారి పరుగులు తీయాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ గేమ్ మధ్యలోనే ఫార్వర్డ్, పాజ్ అంటూ బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను హౌస్ మేట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ గేమ్ మధ్యలోనే ఫార్వర్డ్, పాజ్ అంటూ ఆదేశాలివ్వడంతో ఇంటి సభ్యులంతా ఎంజాయ్ చేశారు. టాస్క్ మధ్యలో షణ్ముక్ పాజ్ అనడంతో ఆటపట్టించేందుకు వచ్చిన సిరికి పాజ్ చెప్పారు. వెంటనే కాజల్ , సన్నీకి పాజ్ చెప్పడంతో రవి-శ్రీరామ్‌ సన్నీతో ఓ ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంటిసభ్యులందర్నీ ఫాజ్‌ చేయడంతో చివరికి షణ్ముఖ్‌.. వాళ్లందర్నీ ఆటపట్టించాడు.
 
హౌస్‌లోకి కాజల్ కూతురు..
 
అయితే హౌస్ మేట్స్ అందరూ ఫ్రీజ్ అయి ఉన్న సమయంలో ముందుగా కాజల్ కూతురు 'మమ్మా' అంటూ అరుచుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్లింది. టాస్క్ లో ఫ్రీజ్ అయి ఉన్న తన తల్లిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ రిలీజ్ అని చెప్పడంతో కాజల్ వెంటనే తన కూతుర్ని హగ్ చేసుకుంది. కాజల్ భర్త కూడా భార్యాబిడ్డను హత్తుకున్నారు. ఈ ఎమోషనల్ సీన్ చూసిన సిరి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత కాజల్ భర్త హౌస్ మేట్స్ తో కూర్చొని కాజల్ పై సెటైర్లు వేశారు. కాజల్ కూతురికి హౌస్ మేట్స్ ఫన్నీగా శ్రీరామ్ పై కంప్లైంట్ చేశారు. వెంటనే శ్రీరామ్ 'కోపం వస్తాదా..? మమ్మీని ఎవరైనా నామినేట్ చేస్తే..?' అని ప్రశ్నించగా.. ఫన్నీగా 'ఊ' కొడుతూ అక్కడ నుంచి వెళ్లిపోయింది కాజల్ కూతురు. షణ్ముఖ్ కెమెరా ముందుకు వెళ్లి 'సార్ బిగ్ బాస్ సార్.. మీరు ఎవరిని పంపిస్తున్నారో చెప్తే..' అంటూ ప్లీజ్ చేసుకున్నాడు.  
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget