అన్వేషించండి

Bigg Boss Telugu 7: ప్రియాంకకు అశ్విని ఫ్లాప్ ట్యాగ్, హౌజ్‌లో గ్రూపులు ఉన్నాయంటూ స్టేట్‌మెంట్

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో అశ్విని వెళ్లిపోతూ హౌజ్‌లో తను అందరి ముందు చెప్పలేని కొన్ని విషయాలు చెప్పేసి వెళ్లింది.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో అశ్విని ఔట్ అయ్యింది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ కాగా.. శనివారం అశ్విని ఎలిమినేట్ అయ్యి హౌజ్ నుండి బయటికి వెళ్లిపోయింది. ఆదివారం కూడా మరో ఎలిమినేషన్ జరగనుంది. ఇక సండే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో స్టేజ్‌పైకి వచ్చిన అశ్వినిని.. హౌజ్‌మేట్స్‌తో మాట్లాడిస్తారు నాగార్జున. ముందుగా హౌజ‌మేట్స్‌లో ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అని చెప్పమంటారు. ఇక అశ్విని వెళ్లిపోయిన తర్వాత హౌజ్‌మేట్స్‌తో సండే ఫన్‌డే గేమ్స్ ప్రారంభిస్తారు.

మంచి ఫ్రెండ్..
‘‘నువ్వు వెళ్లిపోయే ముందు ఈ హౌజ్‌లో హిట్ ఎవరు, ఫ్లాప్ ఎవరు చెప్పేసి వెళ్లాలి’’ అని నాగార్జున చెప్పడంతో ఈ ప్రోమో మొదలయ్యింది. ముందుగా ప్రశాంత్ గురించి చెప్తుంది అశ్విని. ‘‘ప్రశాంత్ కొన్నిసార్లు మాట వినడు’’ అని చెప్పింది. దాంతో నాగార్జున.. ‘‘నీకు మిమిక్రీ చేయడం వచ్చా?’’ అని అశ్వినిని అడిగారు. లేదు అని అశ్విని సమాధానమివ్వగా.. ‘‘నువ్వు శివాజీలాగా మిమిక్రీ చేసి చెప్తే వినేస్తాడు’’ అని నాగ్ అనగానే.. అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత ‘‘మంచి ఫ్రెండ్‌ను తీసుకెళ్తున్నాను బిగ్ బాస్ హౌజ్ నుండి. అనుకోలేదు ఇంత ఫ్రెండ్‌షిప్ అవుతుంది అని’’ అంటూ యావర్ గురించి చెప్పింది అశ్విని. ‘‘నీతో తెలుగులోనే మాట్లాడతాడా?’’ అని నాగ్ అడగగా.. అవును అని చెప్పింది. ‘‘ఆడపిల్లలతో అయితే మాట్లాడతాడులే’’ అని కౌంటర్ వేశారు నాగార్జున.

నాకైతే ఫ్లాప్..
ఆ తర్వాత ప్రియాంకపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది అశ్విని. ‘‘మంచిదే కానీ కాస్త తొందరపాటు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. హిట్టా? ఫ్లాపా? అని అడగగా ‘‘నాపరంగా చూస్తే నాకైతే ఫ్లాపే’’ అని చెప్పేసింది. అందరికీ హిట్, ఫ్లాప్ అని ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత హౌజ్‌లోని గ్రూప్స్ గురించి మాట్లాడింది అశ్విని. ‘‘ప్రియాంక, శోభా, అమర్ ముగ్గురు ఒక గ్రూప్. శివాజీ, రతిక, యావర్, ప్రశాంత్ వీళ్లంతా ఒక గ్రూప్. గౌతమ్ మాత్రం ఏకాకిలాగా మిగిలిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా అయిపోయాడు’’ అని చెప్పింది. మధ్యలో అర్జున్ జోక్యం చేసుకొని ‘‘ఆ ఏకాకిదాంట్లో కూడా లేనా నేను?’’ అని అశ్వినిని అడిగాడు. ‘‘అర్జున్ అసలు దేంట్లో లేడు. నిన్ను చూస్తే ఏం చేస్తావో అని భయమేస్తుంది’’ అని నాగ్ రిప్లై ఇచ్చారు. ఇక హౌజ్‌లో ఉన్న గ్రూప్స్ గురించి చెప్తూ.. ‘‘చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ మధ్యలో తొక్క బ్యాచ్’’ అంటూ కామెడీ చేయగానే అందరూ నవ్వుకున్నారు.

గువ్వ ఎవరు? గోరింక ఎవరు?
ఇక సండే ఫన్‌డే టాస్కులో ఇన్నిరోజులు హౌజ్‌మేట్స్ కలిసి ఉన్న బిగ్ బాస్ హౌజ్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు నాగార్జున. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కోసం కంటెస్టెంట్స్‌ను స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ అని రెండు బ్యాచ్‌లుగా విభజించారు. ఏ ప్రశ్న అడిగినా రతిక సరైన సమాధానం చెప్తుండడంతో ‘‘ఆటంతా ఆపేసి ఇవన్నీ లెక్కలు వేస్తున్నావా’’ అని కౌంటర్ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత నాగార్జున ఒక ఫోటో చూపించగా.. దానికి సంబంధించిన పాటను గెస్ చేయాలి. గువ్వ గోరింకతో పాటను ప్రశాంత్ కరెక్ట్‌గా గెస్ చేయగా.. ఆ పాటకు రతికతో కలిసి డ్యాన్స్ చేయమన్నారు నాగ్. డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇందులో గువ్వ ఎవరు? గోరింక ఎవరు అని నాగార్జున అడగగా.. అది మాకు కూడా తెలియడం లేదని నవ్వాడు అర్జున్. ఆ తర్వాత నాగార్జున.. ఐన్‌స్టీన్ ఫోటో చూపించగా.. దానిని శివుడు అనుకొని కన్‌ఫ్యూజ్ అయ్యాడు అమర్‌దీప్. అలా సండే ఫన్‌డే గేమ్ చాలా ఫన్‌తో సాగిపోయినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

Also Read: 'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ - బాలకృష్ణతో హిట్ కొట్టిన దర్శకుడితో మెగాస్టార్ సినిమా!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget