అన్వేషించండి

Amardeep vs Priayanka: ఫైనల్ అస్త్రా కోసం అమర్, ప్రియాంక మధ్య సీరియస్ ఫైట్ - చెయ్యి కొరికేసిన వంటలక్క

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో ఫైనల్ అస్త్రా టాస్క్ మొదలవ్వగా.. అది ఫ్రెండ్స్ మధ్యే చిచ్చుపెడుతోంది. తాజాగా ప్రియాకంతో సీరియస్‌గా ఫైట్ చేశాడు అమర్‌దీప్.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో టికెట్ టు ఫైనల్ కోసం పోటీ మొదలయ్యింది. ప్రతీసారిలాగా ఈసారి ఈ ఇమ్యూనిటీకి టికెట్ టు ఫైనల్ అని కాకుండా ఫైనల్ అస్త్రా అని పేరుపెట్టారు బిగ్ బాస్. ఇక ఈ ఫైనల్ అస్త్రా రేసులో కంటెస్టెంట్స్ అంతా ఒకదాని తర్వాత మరొక గేమ్‌లో పోటీపడుతూ ఉండాలి. ఈ పోటీల వల్ల తమకు పాయింట్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్రతీ రెండు పోటీల తర్వాత పాయింట్స్ బోర్డ్‌లో లాస్ట్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ ఫైనల్ అస్త్రా రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇక నవంబర్ 28న ప్రసారం అయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా మూడు గేమ్స్‌ను పూర్తిచేసుకున్నారు. ఈ గేమ్స్ ఆడే క్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య కూడా ఆసక్తికర గొడవలు జరిగాయి. 

ఫీల్ అయిన శోభా..
ఫైనల్ అస్త్రా కోసం ముందుగా ‘వీల్ ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు. ఈ టాస్క్‌లో గార్డెన్ ఏరియాలో ఒక గడియారం ఏర్పాటు చేసుంటుంది. ఆ గడియారం ముల్లు తిరుగుతూ ఉండగా.. దానికి తాకకుండా బాక్స్‌పై నిలబడి ఉన్న కంటెస్టెంట్స్ దానిని దాటాల్సి ఉంటుంది. చివరి వరకు ఈ గేమ్‌లో ఉన్నవారికే ఎక్కువ పాయింట్స్ లభిస్తాయి. ముందుగా ప్రశాంత్.. ఈ గేమ్ నుంచి ఔట్ అవ్వగా.. ప్రియాంక, అర్జున్ చివరి వరకు నిలబడ్డారు. లాస్ట్ రౌండ్‌లో ప్రియాంక.. గడియారం ముల్లు తగిలి కింద పడిపోయింది. దీంతో టెన్షన్ పడిన ఇతర కంటెస్టెంట్స్.. ఏమైందో చూడడానికి దగ్గరకు వచ్చారు. అప్పటికే ప్రియాంకకు దెబ్బ తగిలి పడుండడంతో ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు. ఆ విషయం గురించి శోభా ఫీల్ అయ్యింది. ఏమైందో అని చూడడానికి వస్తే అరిచావు అని అడిగింది. దీంతో దెబ్బ తగిలినా కూడా ప్రియాంకనే వెళ్లి.. తన ఫ్రెండ్‌ను ఓదార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అమర్‌దీప్‌కు శివాజీ సాయం..
‘వీల్ ఛాలెంజ్’ తర్వాత ‘ఫ్లవర్ ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు కంటెస్టెంట్స్. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా బజర్ మోగిన తర్వాత వెళ్లి యాక్టివిటీ ఏరియాలో ఉన్న పువ్వులను సేకరించి గార్డెన్ ఏరియాలో తమ పేర్లపై ఉన్న ట్రేలలో ఏర్పాటు చేయాలి. ఈ గేమ్‌లో పువ్వులను ఎక్కువగా తమ టీషర్ట్స్‌లో సేకరించుకొని వచ్చారు కంటెస్టెంట్స్. అయితే అలా చేయడం కరెక్ట్ కాదు అనుకొని శివాజీ మాత్రం పువ్వులను చేతులతోనే పట్టుకొని వచ్చాడు. అలా ఆలోచించి ఫూల్ అయ్యాను అని తన గురించి తానే నెగిటివ్‌గా మాట్లాడుకున్నాడు. నాది అతితెలివి అనుకుంటూ ఫీల్ అయ్యాడు. ఇక ఈ ఆటలో అందరికంటే శివాజీ, ప్రియాంక తక్కువ పువ్వులను సేకరించడంతో ఈ ఆట నుంచి వారిద్దరూ ముందుగా తప్పుకున్నారు. రెండు ఆటలు ముగిసే సమయానికి అందరికంటే తక్కువ పాయింట్స్‌తో శివాజీ, శోభా ఉన్నారు. దీంతో వారి పాయింట్స్‌ను వేరే కంటెస్టెంట్‌కు ఇచ్చేసి వారు టికెట్ టు ఫైనల్ రేసు నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని బిగ్ బాస్ తెలిపారు. అలా అనౌన్స్‌మెంట్ రాగానే శివాజీతో చర్చలు మొదలుపెట్టాడు అమర్‌దీప్. నీకు శోభా ఇస్తుందిలే నేను యావర్‌కు ఇస్తానని అమర్ మాటలకు ఒప్పుకోలేదు శివాజీ. కానీ శివాజీ, శోభా కలిసి ఒక కంటెస్టెంట్‌కే ఇవ్వాలి అని చెప్పడంతో ఎక్కువగా వాదించుకోకుండా అమర్ పేరు చెప్పారు. దీంతో పాయింట్స్ టేబుల్‌లో అమర్‌దీప్ టాప్‌కు చేరుకున్నాడు.

ప్రియాంకతో అమర్ ఫైట్..
ఫైనల్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ పాల్గొన్న మూడో ఛాలెంజ్ ‘బాల్ టాస్క్’. ఈ టాస్క్‌లో సర్కిల్ మధ్యలో ఉన్న బాల్‌ను దాని చుట్టూ నిలబడిన కంటెస్టెంట్స్ గాలం వేసి పట్టుకోవాలి. దీనికి సంచాలకులుగా రేసు నుంచి తప్పుకున్న శివాజీ, శోభా వ్యవహరించారు. దీంతో బాల్ బయటికి వచ్చిన తర్వాత ఎవరైనా లాక్కొని తమ బాస్కెట్‌లో వేసుకోవచ్చు అని రూల్ పెట్టారు. ముందుగా అర్జున్ బాల్‌ను తన బుట్టలో వేసుకొని టాప్ స్కోర్‌ను సంపాదించుకున్నాడు. చివరిగా ప్రియాంక, అమర్‌దీప్ టాస్క్‌లో మిగిలారు. బాల్‌కు ప్రియాంక గాలం కరెక్ట్‌గా పడింది కానీ దానిని లైన్ బయటికి తీసుకొచ్చి బాస్కెట్‌లో వేసుకునేలోపే అమర్ వచ్చి దానిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య గట్టి పోటీనే జరిగింది. ఫైనల్‌గా బాల్ అమర్ బాస్కెట్‌లోకే వెళ్లింది. బాల్ కోసం అంత ఫైట్ చేయడంతో ప్రియాంక చాలా బాధపడింది. అమర్ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఏడ్చేసింది. తన శరీరం చాలా వీక్‌గా అనిపిస్తుందని, గెలవడం ఓడిపోవడం మ్యాటర్ కాదు అని అమ్మ కావాలనిపిస్తుందని ఏడ్చింది ప్రియాంక. ఇక మూడు టాస్కులు పూర్తయ్యే సమయానికి పాయింట్స్ బోర్డ్‌లో అమర్ లీడ్‌లో ఉండగా.. ప్రియాంక లాస్ట్‌లో ఉంది.

Also Read: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget