Dasara Boxoffice: దసరా బరిలో పెద్ద సినిమాలు- బాక్సాఫీస్ దగ్గర ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు‘, 'లియో'ఢీ
తెలుగు సినిమా పరిశ్రమకు దసరా బిగ్గెస్ట్ సీజన్. ప్రతి విజయ దశమికి రెండు పెద్ద సినమాలతో పాటు మరికొన్ని మీడియం సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి కూడా పలు పెద్ద సినిమాలో బరిలోకి దిగుతున్నాయి.
ఎప్పటిలాగే ఈ ఏడాది దసరా పండుగ టాలీవుడ్ లో కొత్త ఊపు తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాలు కూడా దసరా బెర్త్ ఖరారు చేసుకున్నాయి. డిఫరెంట్ జోనర్లలో రూపొందుతున్న ఈ చిత్రాలు అభిమానులను అలరించబోతున్నాయి. ఇంతకీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలేంటో తెలుసుకుందాం..
1.బాలకృష్ణ 'భగవంత్ కేసరి'
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'భగవంత్ కేసరి'. ఈ మూవీని విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. అక్టోబర్ 19న 'భగవంత్ కేసరి'ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19 గురువారం వచ్చింది. అప్పటి నుంచి 24వ తేదీ పండగ వరకు సెలవులు ఉంటాయి. బాలకృష్ణ సినిమాకు మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది.
2.రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’
వరుస హిట్లతో జోష్ మీదున్న మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు‘. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం పీరియాడికల్ కథాంశంతో రూపొందుతోంది. 1970లలో పేరు మోసిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి కథతో ఈ సినిమాను డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్నారు. నాగేశ్వరరావు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకోవడంలో ఎక్స్ ఫర్ట్. 1970 దశకంలో చెన్నై జైలు నుంచి అనూహ్య రీతిలో తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ‘టైగర్’ అనే పేరు వచ్చింది. ఆయన బయోపిక్ గా ఈ సినిమా రెడీ అవుతోంది. అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో రూపొందుతున్నది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. దసరా కానుక గా అక్టోబర్ 20 న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
3.దళపతి విజయ్‘లియో‘
తమిళ హీరో దళపతి విజయ్ సైతం వరుస హిట్లతో జోష్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండగకు ‘వారసుడు’ చిత్రంతో పలకరించిన విజయ్, దసరాకు ‘లియో’తో బాక్సాఫీస్ బరిలో దిగనున్నాడు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నరు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, మిస్కిన్, ప్రియా ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా పండుగకు తెలుగులో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లతో ‘లియో’ పోటీ పడనుంది. మరికొన్ని మీడియం సినిమాలు కూడా విజయ దశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Read Also: పూనమ్ కౌంటర్‌కు ఆర్జీవీ ఎన్‌కౌంటర్ - ఇద్దరిపై నిప్పులు చెరుగుతున్న పవన్ ఫ్యాన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial