అన్వేషించండి

Akshara Singh viral Video: పబ్లిక్‌లో చిందేసిన బోజ్‌పూరి నటి అక్షర సింగ్ - అభిమానులు రాళ్ల దాడి

Akshara Singh viral Video: భోజ్ పురి స్టార్ హీరోయిన్ అక్షర సింగ్ పాల్గొన్న ఓ ఈవెంట్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

Akshara Singh viral Video: సినీ తారలు తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లాంటి ఈవెంట్స్ లో పాల్గొంటారు. ఒక్కోసారి వారిని చూసేందుకు  భారీగా తరలి వచ్చిన అభిమానులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా భోజ్‌పురి నటి, గాయని అక్షర సింగ్‌ పాల్గొన్న కార్యక్రమం రసాభాసగా మారింది. ఆమెను చూసేందుకు ఇసుకేస్తే రాలనంత మంది అభిమానులు తరలి వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఖాకీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్యాన్స్ తిరగబడ్డారు. రాళ్లతో పోలీసులు మీద ఎదురు దాటికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

పోలీసులపై రాళ్ల దాడి చేసిన అక్షర సింగ్ అభిమానులు

నటి అక్షర సింగ్‌ కు భోజ్‌ పురిలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అక్షర నటి మాత్రమే కాదు, సింగర్, డ్యాన్సర్ కూడా. తాజాగా బిహార్ ఔరంగాబాద్ లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నది. ఆమె వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు భారీగా సంఖ్యలో తరలి వచ్చారు. షాపింగ్ మాల్ ముందు వేలాది మంది జమ అయ్యారు. షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసిన అక్షర, ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి మాట్లాడింది. ఆ తర్వాత చక్కటి పాట పాడుతూ ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేసింది. ఆమె పాటకు అభిమానులు ఆనందంతో డ్యాన్స్ చేశారు.

ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. అదే సమయంలో పరిస్థితి కంట్రోల్ తప్పుతుందని భావించిన పోలీసులు అక్షరను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పోలీసులు తీరుపై ఆమె అభిమానులు సీరియస్ అయ్యారు. రాళ్లతో వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో కొద్ది మంది పోలీసులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమెను అక్కడి నుంచి క్షేమంగా పాట్నాకు తరలించారు. ఈ దాడికి కారణం పోలీసులు కాదని, అక్షర అనుకున్న సమయానికి రాకపోవడం వల్లే అభిమానులకు కోపం వచ్చిందని పోలీసులు అధికారులు తెలిపారు. ఆ కోపంలోనే రాళ్లతో దాడి చేశారని చెప్పారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshara Singh (@singhakshara)

2010లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్షర సింగ్

అక్షర సింగ్ 2010లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ‘సత్యమేవ జయతే‘ అనే భోజ్ పురి మూవీతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. సింగర్ గా, డ్యాన్సర్ గానూ అలరించింది. ఆ తర్వాత పలు హిందీ సిరీస్ లలో నటించింది. కొంత కాలం తర్వాత అవకాశాలు రావడం లేదు. 2021లో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో పాల్గొన్నది. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో గడుపుతోంది.

Also Read: రోజూ రెండు రౌండ్లు మద్యం, స్వీట్స్ తినకపోతే నిద్ర రాదు - నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఇవేనట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
Embed widget